నోటిషికేషన్స్
రీజినల్ రూరల్ బ్యాంకు (ఆర్‌ఆర్‌బీ)ల్లో కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ ద్వారా 8612 పోస్టుల భర్తీ కోసం ఐబీపీఎస్ ప్రకటన విడుదల చేసింది.
గ్రామీణ బ్యాంకుల్లో 8612 ఉద్యోగాలు
రీజినల్ రూరల్ బ్యాంకు (ఆర్‌ఆర్‌బీ)ల్లో కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ ద్వారా 8612 పోస్టుల భర్తీ కోసం ఐబీపీఎస్ ప్రకటన విడుదల చేసింది.
1. ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్): 5538
2. ఆఫీసర్ స్కేల్-1 (ఏఎం): 2485
3. జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ (మేనేజర్) స్కేల్-2: 332
4. ఐటీ ఆఫీసర్ స్కేల్-2: 68
5. సీఏ ఆఫీసర్ స్కేల్-2: 21
6. లా ఆఫీసర్ స్కేల్-2: 24
7. ట్రెజరీ మేనేజర్ స్కేల్-2: 08
8. మార్కెటింగ్ ఆఫీసర్ స్కేల్-2: 03
9. అగ్రికల్చర్ ఆఫీసర్ స్కేల్-2: 60
10. ఆఫీసర్ స్కేల్-3 (సీనియర్ మేనేజర్): 73
అర్హత: పోస్టును బట్టి సంబంధిత బ్యాచిలర్స్ డిగ్రీ, సీఏ, ఎంబీఏ.
వయసు (01-06-2023 నాటికి): ఆఫీసర్ స్కేల్-3 (సీనియర్ మేనేజర్)కు 21 నుంచి 40 ఏళ్లు. ఆఫీసర్ స్కేల్-2 (మేనేజర్)కు 21 నుంచి 32 ఏళ్లు. ఆఫీసర్ స్కేల్-1 (అసిస్టెంట్ మేనేజర్)కు 18 నుంచి 30 ఏళ్లు. ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్)కు 18 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక: పోస్టును అనుసరించి ప్రిలిమ్స్ రాత పరీక్ష, మెయిన్స్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా
దరఖాస్తు రుసుము: ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు రూ.175; మిగతా వారందరికీ రూ.850.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, దరఖాస్తు సవరణ: 21.06.2023 వరకు.
అప్లికేషన్ ఫీజు/ ఇంటిమేషన్ ఛార్జీ చెల్లింపు: 21.06.2023 వరకు.
ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష: ఆగస్టు, 2023.
ఆన్‌లైన్ మెయిన్స్ పరీక్ష: సెప్టెంబర్, 2023.
ఇంటర్వ్యూ తేదీలు (ఆఫీసర్స్ స్కేల్ 1, 2, 3): అక్టోబర్/ నవంబర్, 2023.
వెబ్‌సైట్: https://www.ibps.in/crp-rrb-xii/
దిల్లీలో 181 సైంటిస్ట్ పోస్టులు
దిల్లీలోని డీఆర్‌డీఓ ఆధ్వర్యంలోని రిక్రూట్‌మెంట్ అండ్ అసెస్‌మెంట్ సెంటర్ 181 సైంటిస్ట్ బీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్/ ఇంజినీరింగ్/ మాస్టర్స్.
* గేట్‌లో అర్హత సాధించాలి.
వయసు: యూఆర్/ ఈడబ్ల్యూఎస్-28, ఓబీసీ-31, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులు 33 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: గేట్ స్కోర్‌ను అనుసరించి స్క్రీనింగ్/ షార్ట్‌లిస్టింగ్ అనంతరం ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: రూ.100.
ఆన్‌లైన్ దరఖాస్తు గడువు: ఉద్యోగ ప్రకటన వెలువడిన 21 రోజుల్లోపు.
వెబ్‌సైట్: https://rac.gov.in/index.php?lang=en&id=0
ఇఫ్లూలో 97 నాన్ టీచింగ్ పోస్టులు
హైదరాబాద్‌లోని ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ.. హైదరాబాద్, షిల్లాంగ్‌లోని ఇఫ్లూ క్యాంపస్‌లలో 97 గ్రూప్- ఏ, బీ, సీ నాన్-టీచింగ్ పోస్టుల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ.
దరఖాస్తుకు చివరి తేదీ: 26.06.2023.
వెబ్‌సైట్: https://www.efluniversity.ac.in/
ఫెలోషిప్
ఐజీసీఏఆర్-కల్పక్కంలో..
కల్పక్కంలోని ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రిసెర్చ్ (ఐజీసీఏఆర్) 100 జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్‌ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
విభాగాలు: అప్లైడ్ ఫిజిక్స్, న్యూక్లియర్ ఫిజిక్స్, మెటీరియల్ ఇంజినీరింగ్, ఆర్గానిక్ కెమిస్ట్రీ, రేడియేషన్ ఫిజిక్స్, నానో ఫ్లూయిడ్స్, కెమికల్ సెన్సార్స్, సూపర్ హైడ్రోఫోబిక్ కోటింగ్, కంప్యుటేషనల్ కెమిస్ట్రీ తదితరాలు.
అర్హత: బీఎస్సీ/ బీఈ/ బీటెక్/ ఎంఈ/ ఎంటెక్/ ఎమ్మెస్సీ
వయసు: 28 ఏళ్లు మించకూడదు.
1. డైరెక్ట్ పీహెచ్‌డీ: నెలకు రూ.31000
2. ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ: నెలకు రూ.21000
3. డబుల్ పీహెచ్‌డీ: నెలకు రూ.21000
ఎంపిక రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
* గేట్/ జెస్ట్ అర్హత సాధించినవారిని షార్ట్‌లిస్ట్ చేసి నేరుగా ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు.
దరఖాస్తు: ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 16.06.2023
వెబ్‌సైట్: http://www.igcar.gov.in/recruitment.html
వాక్‌ఇన్‌లు
ఈఎస్‌ఐసీ-హైదరాబాద్‌లో..
హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌కు చెందిన ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్‌ఐసీ) 76 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సీనియర్ రెసిడెంట్లు, సూపర్ స్పెషలిస్ట్‌లు.
1. ఫ్యాకల్టీ/ సీనియర్ రెసిడెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఎన్‌ఎంసీ నిబంధనల ప్రకారం అర్హత ప్రమాణాలుండాలి.
2. సూపర్ స్పెషలిస్ట్: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంబీబీఎస్.
వయసు: 45-67 ఏళ్లు ఉండాలి.
దరఖాస్తు ఫీజు: రూ.500.
ఇంటర్వ్యూ వేదిక: Academic Block, ESIC Medical College, Sanathnagar, Hyderabad.
ఇంటర్వ్యూ తేదీ: 06-10.06.2023
వెబ్‌సైట్: https://www.esic.gov.in/recruitments
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
సిబ్బందిని మందలించిందని.. వ్యాపార భాగస్వామిని చితకబాదాడు..
-
అప్పుడు హమాలీ.. ఇప్పుడు వడ్రంగి
-
వరద నీటిలో కొట్టుకుపోయిన 190 పశువులు
-
భారతీయులకు వీసాల జారీలో అమెరికా రికార్డు..!
-
Chandrayaan-3: ప్రజ్ఞాన్ రోవర్ మేల్కోకపోయినా ఇబ్బందేం లేదు: సోమనాథ్
-
Rajasthan : ఉప రాష్ట్రపతి తరచూ రాజస్థాన్‌కు ఎందుకొస్తున్నారు.. మీ పర్మిషన్ కావాలా?