నోటిఫికేషన్స్‌

పుదుచ్చేరిలోని జవహర్‌లాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (జిప్‌మర్‌).. రెగ్యులర్‌ ప్రాతిపదికన 122 సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

Published : 06 Jun 2023 00:09 IST

ప్రభుత్వ ఉద్యోగాలు

జిప్‌మర్‌లో సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టులు

పుదుచ్చేరిలోని జవహర్‌లాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (జిప్‌మర్‌).. రెగ్యులర్‌ ప్రాతిపదికన 122 సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

అర్హత: సంబంధిత విభాగంలో ఎండీ, ఎంఎస్‌, డీఎన్‌బీ, ఎంసీహెచ్‌.  
వయసు: 31-07-2023 నాటికి 45 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు రుసుము: రూ.1500. ఓబీసీ అభ్యర్థులకు రూ.1500. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రూ.1200. దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.
ఎంపిక: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 19-06-2023.

వెబ్‌సైట్‌: https://jipmer.edu.in/


ఎంసీఈఎంఈ-సికింద్రాబాద్‌లో ఫ్యాకల్టీ

సికింద్రాబాద్‌లోని తిరుమలగిరికి చెందిన మిలిటరీ కాలేజ్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ (ఎంసీఈఎంఈ) ఒప్పంద ప్రాతిపదికన ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

1. అసోసియేట్‌ ప్రొఫెసర్‌: బీఈ/ బీటెక్‌/ ఎంఈ/ ఎంటెక్‌. అనుభవం: కనీసం 5 ఏళ్లు.
2. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌: బీఈ/ బీటెక్‌/ ఎంఈ/ ఎంటెక్‌ అనుభవం: కనీసం 2 ఏళ్లు.
ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో పంపాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: 07.06.2023.
రాతపరీక్ష: 09.06.2023.
ఇంటర్వ్యూ: 10.06.2023.
ఇంటర్వ్యూ వేదిక: ఎఫ్‌డీఈ, ఎంసీఈఎంఈ, తిరుమలగిరి, సికింద్రాబాద్‌-15.

వెబ్‌సైట్‌: https://www.mes.gov.in/


పీఎంబీఐ-న్యూదిల్లీలో..

న్యూదిల్లీలోని ఫార్మాసూటికల్స్‌ అండ్‌ మెడికల్‌ డివైజెస్‌ బ్యూరో ఆఫ్‌ ఇండియా (పీఎంబీఐ) 37 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: అసిస్టెంట్‌ మేనేజర్‌, సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌, ఎగ్జిక్యూటివ్‌, డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌.
అర్హత: పోస్టును అనుసరించి బీఫార్మసీ/ బీఎస్సీ/ ఎల్‌ఎల్‌బీ/ బీసీఏ/ బీటెక్‌/ బీకామ్‌/ ఎంఫార్మసీ/ ఎంఎస్సీ/ ఎంబీఏ/ ఎంకామ్‌/ ఎంసీఏ/ ఎంటెక్‌.
ఎంపిక: స్క్రీనింగ్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు: ఈమెయిల్‌, ఆఫ్‌లైన్‌ ద్వారా.
ఈమెయిల్‌: recruitment@janaushadhi.gov.in
చిరునామా: CEO, PMBI at E-1, 8th Floor, Videocon Tower, Jhandewalan Extn., New Delhi - 110055.
దరఖాస్తుకు చివరి తేది: 22.06.2023.

వెబ్‌సైట్‌: http://janaushadhi.gov.in/Recruitment.aspx


యూపీఎస్సీ ద్వారా 19 ఖాళీలు

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) 19 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: సైంటిస్ట్‌ బీ, అసిస్టెంట్‌ ఇంజినీర్‌, స్పెషలిస్ట్‌, జూనియర్‌ రిసెర్చ్‌ ఆఫీసర్‌ తదితరాలు.
విభాగాలు: డెర్మటాలజీ, లెప్రసీ, రిసెర్చ్‌, స్టాటిస్టిక్స్‌, అనాలిసిస్‌ తదితరాలు.
అర్హత: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీ/ ఇంజినీరింగ్‌/ ఎంబీబీఎస్‌/ మాస్టర్స్‌ డిగ్రీ.
వయసు: 30-40 ఏళ్లు ఉండాలి.
ఎంపిక: రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: రూ.25.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 15.06.2023

వెబ్‌సైట్‌: https://www.upsc.gov.in/ recruitment/recruitmentnadvertisement


ప్రవేశాలు

ట్రిపుల్‌ఐటీ బాసరలో ఇంటెగ్రేటెడ్‌ బీటెక్‌ 

బాసర రాజీవ్‌గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) నిర్వహిస్తున్న ట్రిపుల్‌ఐటీలో ప్రవేశాల ప్రకటన విడుదలైంది.

* బాసర ఆర్‌జీయూకేటీలో మొత్తం 1650 ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌ (ఇంటర్‌+బీటెక్‌) సీట్లు భర్తీ కానున్నాయి.
* మొత్తం సీట్లలో 85 శాతం రాష్ట్ర విద్యార్థులకు కేటాయిస్తారు. మిగిలిన 15 శాతం సీట్లకు రాష్ట్రంతోపాటు ఏపీ విద్యార్థులు కూడా పోటీపడతారు.
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత.  
వయసు: ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల వయసు 21, మిగిలినవారి వయసు 18 ఏళ్ల లోపు.
ఎంపిక: పదో తరగతి జీపీఏ మెరిట్‌ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.450, ఇతరులకు రూ.500.
జూన్‌ 5-19: ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ
జూన్‌ 24: ప్రత్యేక కేటగిరీ (పీహెచ్‌/క్యాప్‌/ఎన్‌సీసీ/క్రీడాకారులు) వారు ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రింటౌట్‌ను సమర్పించేందుకు తుది గడువు.
జూన్‌ 26: ఎంపికైన విద్యార్థుల జాబితా వెల్లడి
జులై 1: తొలి విడత కౌన్సెలింగ్‌ (ధ్రువపత్రాల పరిశీలన)

వెబ్‌సైట్‌: https://www.rgukt.ac.in/admissions2023.html


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని