నోటిఫికేషన్స్
బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ (ఎన్‌ఎల్‌ఎస్‌ఐయూ) ఆన్‌లైన్ అండ్ హైబ్రిడ్ మోడ్ ద్వారా కింది ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ప్రవేశాలు
ఎన్‌ఎల్‌ఎస్‌ఐయూలో లా కోర్సులు
బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ (ఎన్‌ఎల్‌ఎస్‌ఐయూ) ఆన్‌లైన్ అండ్ హైబ్రిడ్ మోడ్ ద్వారా కింది ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
1. మాస్టర్ ఆఫ్ బిజినెస్ లాస్ (ఎంబీఎల్): రెండేళ్లు
2. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా: ఒక సంవత్సరం
ఎ) హ్యూమన్ రైట్స్ లా
బి) మెడికల్ లా అండ్ ఎథిక్స్
సి) ఎన్విరాన్‌మెంటల్ లా
డి) ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ లా
ఇ) చైల్డ్ రైట్స్ లా
ఎఫ్) కన్‌స్యూమర్ లా అండ్ ప్రాక్టీస్
జి) సైబర్ లా అండ్ సైబర్ ఫోరెన్సిక్స్
అర్హత: గ్రాడ్యుయేట్ డిగ్రీ
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 31-07-2023.
వెబ్‌సైట్: https://pace.nls.ac.in/
నిట్ రవుర్కెలాలో ఎంఏ
రవుర్కెలాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్స్ డిపార్ట్‌మెంట్ ఎంఏ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఎంఏ (డెవలప్‌మెంట్ స్టడీస్): 39 సీట్లు
అర్హత: 50 శాతం మార్కులతో బీటెక్/బీఏ/బీఎస్సీ/బీకాం
ఎంపిక: రాత పరీక్ష, పర్సనల్ ఇంటరాక్షన్ ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ.500.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 30.06.2023.
రాత పరీక్ష, ఇంటర్వ్యూ, కౌన్సెలింగ్ తేదీలు: 12, 13.06.2023.
వెబ్‌సైట్: https://nitrkl.ac.in/
ట్రిపుల్ ఐటీలో ఎగ్జిక్యూటివ్ ఎంటెక్
పశ్చిమ్ బెంగాల్ రాష్ట్రం కల్యాణిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్ ఎంటెక్ ప్రోగ్రామ్ (జులై 2023)లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
స్పెషలైజేషన్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్.
సీట్లు: 30.
అర్హత: బీఈ/బీటెక్/ఎంఎస్సీ/ ఎంఎస్ (సీఎస్, ఐటీఐ, ఈసీఈ, ఈఈ)/ ఎంసీఏ.
ఎంపిక: రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ.500.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 16-06-2023.
హార్డ్‌కాపీ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 23-06-2023.
రాత పరీక్ష/ ఇంటర్వ్యూ: 07-07-2023.
ఎంపికైన అభ్యర్థుల ప్రకటన: 10-07-2023.
వెబ్‌సైట్: https://iiitkalyani.ac.in/index.php
అప్రెంటిస్
సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్‌లో ...
ఝార్ఖండ్ రాష్ట్రం రాంచీలోని సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (సీసీఎల్) ట్రేడ్, ఫ్రెషర్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ట్రేడ్ అప్రెంటిస్: 536
ఫ్రెషర్ అప్రెంటిస్: 72
మొత్తం ఖాళీలు: 608
ట్రేడులు: ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మెకానిక్ డీజిల్, మెషినిస్ట్, టర్నర్, వైర్‌మ్యాన్, సర్వేయర్, వెల్డర్ తదితరాలు.
అర్హత: ట్రేడును అనుసరించి మెట్రిక్యులేషన్, ఐటీఐ, సంబంధిత విభాగంలో డిగ్రీ.
వయసు: 19-04-2023 నాటికి ట్రేడ్ అప్రెంటిస్‌కు 18-27 ఏళ్లు, ఫ్రెషర్ అప్రెంటిస్‌కు 18-22 ఏళ్ల మధ్య ఉండాలి.
నెలవారీ స్టైపెండ్: ట్రేడును అనుసరించి రూ.6000 - రూ.9000.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 18-06-2023.
వెబ్‌సైట్: https://www.centralcoalfields.in/ind/index_h.php
తిరువనంతపురంలో 30 జనరల్ అప్రెంటిస్‌లు
తిరువనంతపురంలోని శ్రీ చిత్ర తిరుణాల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ (ఎస్‌సీటీఐఎంఎస్‌టీ) 30 జనరల్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ.
వయసు: 01.05.2023 నాటికి 35 సంవత్సరాలు మించకూడదు.
నెలవారీ స్టైపెండ్: రూ.9000.
ఎంపిక: రాత పరీక్ష ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 08.6.2023.
అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ తేదీలు: 9.6.2023 నుంచి 12.6.2023 వరకు.
రాత పరీక్ష: 13.6.2023.
సర్టిఫికెట్ వెరిఫికేషన్: 14.6.2023, 15.6.2023.
వెబ్‌సైట్: https://www.sctimst.ac.in/
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
POCSO Act: లైంగిక కార్యకలాపాలకు ‘సమ్మతి’ వయసు 18 ఏళ్లే.. దాన్ని తగ్గించొద్దు: లా కమిషన్
-
Vizag Steel Plant: విశాఖ స్టీల్‌ప్లాంట్ భూముల విక్రయ ప్రక్రియ ప్రారంభం
-
క్యాబ్ డ్రైవర్ ఖాతాలో రూ.9వేల కోట్లు జమ.. కొద్ది రోజులకే బ్యాంకు ఎండీ రాజీనామా..!
-
Chandrababu: చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
-
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Law Commission: 2024లో జమిలి ఎన్నికలు సాధ్యమేనా..? కొత్త ఫార్ములా రూపొందిస్తున్న లా కమిషన్!