నోటిఫికేషన్స్
నోటిఫికేషన్స్
ప్రవేశాలు
ఏపీ మత్స్య విశ్వవిద్యాలయంలో
విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీ, క్యాంప్ ఆఫీస్ రెండేళ్ల డిప్లొమా(ఫిషరీస్‌సైన్స్) ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
బోధనా మాధ్యమం: ఇంగ్లిష్
సీట్ల సంఖ్య: ప్రభుత్వ కళాశాలల్లో 55, అనుబంధ కళాశాలల్లో 440.
అర్హత: పదో తరగతి.
వయసు: 15- 22 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంపిక: పదో తరగతిలో సాధించిన మార్కులు, స్థానికత, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా. దరఖాస్తు రుసుము: రూ.800 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.400).ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 12.06.2023.
ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరి తేదీ: 15.06.2023.
వెబ్ ఆప్షన్ తేదీ: 19.06.2023.
వెబ్‌సైట్: https://apfu-diplomaadmissions.aptonline.in/APFUPOLY/
ఐకార్- ఏఐఈఈఏ (పీజీ)-2023
వ్యవసాయ సంబంధ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్దేశించిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రిసెర్చ్- ఆలిండియా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫర్ అడ్మిషన్ (ఐకార్- ఏఐఈఈఏ పీజీ)-2023 నోటిఫికేషన్ విడుదలైంది. పరీక్షలో సాధించిన ప్రతిభ ఆధారంగా దేశవ్యాప్తంగా ఉన్న 74 వ్యవసాయ విశ్వవిద్యాలయాలు అందిస్తున్న కోర్సుల్లో ప్రత్యేకించిన సీట్లలో ప్రవేశాలు కల్పిస్తారు.
విభాగాలు: ప్లాంట్ బయోటెక్నాలజీ, ప్లాంట్ సైన్సెస్, ఫిజికల్ సైన్స్, ఎంటమాలజీ అండ్ నెమటాలజీ, అగ్రోనమీ, సోషల్ సైన్సెస్, స్టాటిస్టికల్ సైన్సెస్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, కమ్యూనిటీ సైన్స్, యానిమల్ బయోటెక్నాలజీ, వెటర్నరీ సైన్స్ తదితరాలు.
అర్హత: సంబంధిత విభాగంలో బీఎస్సీ/బీటెక్/ బీవీఎస్సీ/ బీఎఫ్‌ఎస్సీ.
దరఖాస్తు రుసుము: జనరల్/ యూఆర్ అభ్యర్థులకు రూ.1175; ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1150; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలు, థర్డ్ జెండర్ అభ్యర్థులకు రూ.600.
ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 16.06.2023.
వెబ్‌సైట్: https://icar.nta.nic.in/
ఏఐసీఈ- జేఆర్‌ఎఫ్/ ఎస్‌ఆర్‌ఎఫ్ (పీహెచ్‌డీ)
వ్యవసాయ సంబంధ పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్దేశించిన ఐకార్- ఆలిండియా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్- జేఆర్‌ఎఫ్/ ఎస్‌ఆర్‌ఎఫ్ (పీహెచ్‌డీ)-2023 నోటిఫికేషన్ విడుదలైంది.
స్పెషలైజేషన్: జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్, సీడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్, ప్లాంట్ పాథాలజీ, నెమటాలజీ, ఎంటమాలజీ, సెరికల్చర్, బయోకెమిస్ట్రీ, ప్లాంట్ ఫిజియాలజీ, మైక్రోబయాలజీ, వెజిటబుల్ సైన్స్, ఫ్రూట్ సైన్స్, ఫ్లోరికల్చర్ అండ్ ల్యాండ్‌స్కేపింగ్ తదితరాలు.
అర్హత: సంబంధిత విభాగంలో ఎంఎస్సీ/ ఎంటెక్/ ఎంవీఎస్సీ/ఎంఎఫ్‌ఎస్సీ.
దరఖాస్తు రుసుము: జనరల్/ యూఆర్ అభ్యర్థులకు రూ.1875; ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1850; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలు, థర్డ్ జెండర్‌లకు రూ.950.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 16.06.2023.
వెబ్‌సైట్: https://icar.nta.nic.in/
అప్రెంటిస్‌షిప్
సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే, రాయ్‌పూర్‌లో..
సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే 2023-24 సంవత్సరానికి రాయ్‌పూర్ డివిజన్, వ్యాగన్ రిపేర్ షాప్(రాయ్‌పూర్)లో 1033 ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ట్రేడులు: వెల్డర్, టర్నర్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, స్టెనోగ్రాఫర్ (ఇంగ్లిష్, హిందీ), కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామ్ అసిస్టెంట్, హెల్త్ అండ్ శానిటరీ ఇన్‌స్పెక్టర్, మెషినిస్ట్, మెకానిక్ డీజిల్, మెషిన్ రిఫ్రిజిరేటర్ అండ్ ఎయిర్ కండిషనర్, మెకానిక్ ఆటో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్.
అర్హత: అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి, సంబంధిత ట్రేడ్‌లలో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు (01-07-2023 నాటికి): 15- 24 సంవత్సరాల మధ్య
ఎంపిక: మెట్రిక్యులేషన్, ఐటీఐ పరీక్ష మార్కుల ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 22-06-2023.
వెబ్‌సైట్: https://secr.indianrailways.gov.in/view_section.jsp?lang=0&id=0,2,1903,2196
ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో..
చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ 782 యాక్ట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ట్రేడులు: కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మెషినిస్ట్, పెయింటర్, వెల్డర్, ఎంఎల్‌టీ రేడియాలజీ, ఎంఎల్ పాథాలజీ, పీఏఎస్‌ఏఏ.
అర్హత: ట్రేడును అనుసరించి 50 శాతం మార్కులతో పదో తరగతి, సంబంధిత ట్రేడులో ఐటీఐ, పన్నెండో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు (30-06-2023 నాటికి): 15-24 ఏళ్ల మధ్య ఉండాలి.
స్టైపెండ్: నెలకు రూ.6000 నుంచి రూ.7000.
ఎంపిక: అకడమిక్ మెరిట్ ఆధారంగా.దరఖాస్తు రుసుము: రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 30-06-2023.
వెబ్‌సైట్: https://pb.icf.gov.in/act/instructions.php
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Pulivendula: కురుస్తున్న బస్టాండ్‌కు ఉత్తమ పర్యాటక అవార్డు!
-
Ayyannapatrudu: వైకాపా ప్రభుత్వ అక్రమాలు కనిపించడం లేదా ఉండవల్లీ?: అయ్యన్న
-
కాంగ్రెస్‌కు మల్లన్న సినిమా చూపిస్తా: మంత్రి మల్లారెడ్డి
-
Nizamabad: అపహరించిన కారులో వచ్చి.. ఏటీఎం లూటీ
-
బాంబులా పేలిన ఫోను.. కిటికీలు, సామాన్లు ధ్వంసం
-
ఐఏఎస్ కొలువుకు ఎసరు తెచ్చిన ‘కుక్క వాకింగ్’