నోటీస్‌బోర్డు

దేశవ్యాప్తంగా కేంద్ర విభాగాలు/ శాఖల్లో వివిధ హోదాల్లో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన 312 పోస్టుల భర్తీకి యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ దరఖాస్తులు కోరుతోంది.

Published : 03 Jun 2024 00:08 IST

ప్రభుత్వ ఉద్యోగాలు

కేంద్ర శాఖల్లో 312 కొలువులు

దేశవ్యాప్తంగా కేంద్ర విభాగాలు/ శాఖల్లో వివిధ హోదాల్లో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన 312 పోస్టుల భర్తీకి యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ దరఖాస్తులు కోరుతోంది.

 • డిప్యూటీ సూపరింటెండింగ్‌ ఆర్కియాలజికల్‌ కెమిస్ట్‌: 04
 • డిప్యూటీ సూపరింటెండింగ్‌ ఆర్కియాలజిస్ట్‌: 67  
 • సివిల్‌ హైడ్రోగ్రాఫిక్‌ ఆఫీసర్‌: 04  
 • స్పెషలిస్ట్‌ గ్రేడ్‌-ఖిఖిఖి అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌: 167
 • డిప్యూటీ సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌: 09
 • అసిస్టెంట్‌ డైరెక్టర్‌: 50  
 • ఇంజినీర్‌ & షిప్‌ సర్వేయర్‌-కమ్‌-డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌: 02 
 • ట్రైనింగ్‌ ఆఫీసర్‌: 08 
 • అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌: 01 

అర్హత: సంబంధిత పోస్టులను అనుసరించి డిప్లొమా, డిగ్రీ, ఎంబీబీఎస్, పీజీతో పాటు పని అనుభవం.
ఎంపిక: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: రూ.25. ఎస్సీ/ఎస్టీ/మహిళలు/ దివ్యాంగులకు దరఖాస్తు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 13-06-2024.

వెబ్‌సైట్‌: https://upsc.gov.in/


ప్రవేశాలు

టూల్‌ డిజైన్‌ కోర్సుల్లో పోస్టు డిప్లొమా

హైదరాబాదులోని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎంఎస్‌ఎంఈ టూల్‌ రూం- సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూల్‌ డిజైన్‌ (సీఐటీడీ).. 2024 విద్యాసంవత్సరానికి పోస్టు డిప్లొమా ఇన్‌ టూల్‌ డిజైన్‌ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం సీట్లు: 60.
అర్హత: మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో డిప్లొమా లేదా తత్సమాన విద్యార్హత.
వయసు: 27 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు ఫీజు: జనరల్‌ అభ్యర్థులకు రూ.700, ఎస్సీ/ఎస్టీ వారికి రూ.350.
ఎంపిక: ప్రవేశ పరీక్ష ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 30-06-2024.
ప్రవేశ పరీక్ష: 12-07-2024.

వెబ్‌సైట్‌: https://www.citdindia.org/


వాక్‌-ఇన్స్‌

ఎన్‌ఐటీవీఏఆర్‌లో రిసెర్చ్‌ అసిస్టెంట్‌ పోస్టులు

పుణెలోని ఐసీఎంఆర్‌కు చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ట్రాన్స్‌లేషనల్‌ వైరాలజీ అండ్‌ ఎయిడ్స్‌ రిసెర్చ్‌.. ఒప్పంద ప్రాతిపదికన ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

 • రిసెర్చ్‌ అసిస్టెంట్‌: 01 
 • ల్యాబొరేటరీ టెక్నీషియన్‌: 01  
 • డేటాఎంట్రీ ఆపరేటర్‌: 01 

అర్హత: సంబంధిత విభాగంలో ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ, పీజీతో పాటు పని అనుభవం.
వేతనం: నెలకు రిసెర్చ్‌ అసిస్టెంట్‌ పోస్టుకు రూ.31,000, ల్యాబొరేటరీ టెక్నీషియన్‌కు రూ.18,000, డేటాఎంట్రీ ఆపరేటర్‌కు రూ.17,000.
వయసు: రిసెర్చ్‌ అసిస్టెంట్, ల్యాబొరేటరీ టెక్నీషియన్‌ పోస్టులకు 30 ఏళ్లు, డేటాఎంట్రీ ఆపరేటర్‌కు 28 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఇంటర్వ్యూ తేదీ: 14-06-2024.

ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ సపోర్ట్‌ ఉద్యోగాలు 

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ట్రాన్స్‌లేషనల్‌ వైరాలజీ అండ్‌ ఎయిడ్స్‌ రిసెర్చ్‌.. ఒప్పంద ప్రాతిపదికన కింది ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.

 • ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ సపోర్ట్‌-3: 08  
 • ల్యాబ్‌ అటెంండెంట్‌: 01

అర్హత: పదో తరగతి, సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీతో పాటు పని అనుభవం.
వేతనం: ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ సపోర్ట్‌ పోస్టుకు రూ.28,000. ల్యాబ్‌ అటెండెంట్‌ పోస్టుకు రూ.15,800.
వయసు: ల్యాబ్‌ అటెండెంట్‌ పోస్టుకు 25 ఏళ్లు, ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ సపోర్ట్‌ పోస్టుకు 35 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఇంటర్వ్యూ తేదీ: 10-06-2024.

ఈ రెండు రకాల పోస్టులకూ..

వేదిక: ఆడిటోరియం ఆఫ్‌ ఐసీఎంఆర్‌-నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ట్రాన్స్‌లేషనల్‌ వైరాలజీ అండ్‌ ఎయిడ్స్, రిసెర్చ్, ప్లాట్‌ నెం.73, జీ-బ్లాక్, భోసరీ, పుణె.

వెబ్‌సైట్‌: www.nari-icmr.res.in//


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని