నోటీస్‌బోర్డు

ఎన్‌ఎఫ్‌ఎల్‌లో ఇంజినీర్‌ పోస్టులు 

Published : 17 Jun 2024 00:58 IST

ప్రభుత్వ ఉద్యోగాలు

ఎన్‌ఎఫ్‌ఎల్‌లో ఇంజినీర్‌ పోస్టులు 

నోయిడాలోని నేషనల్‌ ఫెర్టిలైజర్స్‌ లిమిటెడ్‌- దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ ఎన్‌ఎఫ్‌ఎల్‌ యూనిట్లు/ కార్యాలయాల్లో 97 ఇంజినీరింగ్‌ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి రెగ్యులర్‌ ప్రాతిపదికన దరఖాస్తులు కోరుతోంది. 

  • ప్రొడక్షన్‌: 40
  • మెకానికల్‌: 15
  • ఎలక్ట్రికల్‌: 12
  • ఇన్‌స్ట్రుమెంటేషన్‌: 11
  • సివిల్‌: 01
  • ఫైర్‌ అండ్‌ సేఫ్టీ: 03 
  • కెమికల్‌ ల్యాబ్‌: 09
  • మెటీరియల్స్‌ ఆఫీసర్‌: 06  

అర్హత: పోస్టును అనుసరించి కనీసం 60% మార్కులతో బీఈ, బీటెక్, బీఎస్సీ (ఇంజినీరింగ్‌), ఎంఎస్సీ, ఎంబీఏ, పీజీ డిగ్రీ, పీజీ డిప్లొమా (పీజీడీఎం/ పీజీడీబీఎం)/ ఇంటిగ్రేటెడ్‌ ఎంబీఏ. 
వయసు: 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక: షార్ట్‌లిస్ట్, రాత పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ.700. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎస్‌ఎం అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. 
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 01/07/2024.
వెబ్‌సైట్‌:https://careers.nfl.co.in/


వాక్‌-ఇన్స్‌

మంగళగిరి ఎయిమ్స్‌లో..

మంగళగిరిలోని ఎయిమ్స్‌.. 70 సీనియర్‌ రెసిడెంట్‌/ సీనియర్‌ డెమాన్‌స్ట్రేటర్‌ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
విభాగాలు: అనస్తీషియాలజీ, అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్‌ మెడిసిన్‌ అండ్‌ టాక్సికాలజీ, పీడియాట్రిక్స్, సైకాలజీ, జనరల్‌ సర్జరీ, ఆర్థోపెడిక్స్, ఆఫ్తాల్మాలజీ, గైనకాలజీ, రేడియో డయాగ్నోసిస్‌. 
అర్హత: ఎండీ/ డీఎన్‌బీ, ఎంఎస్సీ, పీజీ, ఎంఎస్, ఎంసీహెచ్‌/ డీఎన్‌బీతో పాటు పని అనుభవం. వయసు: 45 ఏళ్లు మించకూడదు. 
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: రూ.1500, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రూ.1000. దివ్యాంగులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
ఇంటర్వ్యూ వేదిక: అడ్మిన్‌ అండ్‌ లైబ్రరీ బిల్డింగ్, ఎయిమ్స్, మంగళగిరి, గుంటూరు జిల్లా.
ఇంటర్వ్యూ తేదీ: 27-06-2024.
వెబ్‌సైట్‌: www.aiimsmangalagiri.edu.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని