దామోదర్‌ వ్యాలీ సంస్థలో జేఈలు

]కోల్‌కతాలోని దామోదర్‌ వ్యాలీ కార్పొరేషన్‌ (డీవీసీ) 64 కొలువుల భర్తీకి సిద్ధమైంది. జూనియర్‌ ఇంజినీర్‌ గ్రేడ్‌-2 పోస్టులివి. ఆసక్తి ఉన్నవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

Published : 19 Jun 2024 00:47 IST

]కోల్‌కతాలోని దామోదర్‌ వ్యాలీ కార్పొరేషన్‌ (డీవీసీ) 64 కొలువుల భర్తీకి సిద్ధమైంది. జూనియర్‌ ఇంజినీర్‌ గ్రేడ్‌-2 పోస్టులివి. ఆసక్తి ఉన్నవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, సీ అండ్‌ ఐ, కమ్యూనికేషన్, మైన్‌ సర్వేయర్‌ విభాగాల్లో జూనియర్‌ ఇంజినీర్‌ (జేఈ) ఉద్యోగాల నియామకం జరుగుతుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే ఏ అర్హతలుండాలో చూద్దాం. 
1. మెకానికల్‌-16: మూడేళ్ల మెకానికల్‌ ఇంజినీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణత.  
2. ఎలక్ట్రికల్‌- 20: ఎలక్ట్రికల్‌ టెక్నాలజీ/ ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌ డిప్లొమా.. 
3. సీ అండ్‌ ఐ- 2: ఎలక్ట్రానిక్స్‌ టెక్నాలజీ అండ్‌ టెలికమ్యూనికేషన్స్‌/ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజినీరింగ్‌ డిప్లొమా.
4. సివిల్‌-20: సివిల్‌ ఇంజినీరింగ్‌ టెక్నాలజీ డిప్లొమా 
5. కమ్యూనికేషన్‌ -2: ఎలక్ట్రానిక్స్‌ టెక్నాలజీ అండ్‌ టెలి కమ్యూనికేషన్‌/ టెలి కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌/ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ డిప్లొమా. 

 • జనరల్‌ అభ్యర్థులు 65 శాతం మార్కులతో డిప్లొమా పాసవ్వాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ కేటగిరీకి చెందినవారికి 60 శాతం సరిపోతుంది.
 • 6. మైన్‌ సర్వేయర్‌-4: మెట్రిక్యులేషన్‌ జనరల్‌ 65 శాతం మార్కులు, ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులవ్వాలి. లేదా మైనింగ్‌/ మైనింగ్‌ సర్వేయింగ్‌/ మైనింగ్‌ అండ్‌ మైన్‌ సర్వేయింగ్‌ డిప్లొమాను జనరల్‌ అభ్యర్థులు 65 శాతంతో, ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ వర్గాలవారు 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి.
 • లేటరల్‌ ఎంట్రీ ద్వారా డిప్లొమా ఇంజినీరింగ్‌ రెండో ఏడాదిలో ప్రవేశించినవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 
 • బీటెక్‌/ బీఈ/ ఎంటెక్‌/ ఎంఈ చదివిన ఉన్నత విద్యావంతులూ, దూరవిద్య విధానంలో డిప్లొమా చేసినవారు దరఖాస్తుకు అనర్హులు.
 • వయసు: జేఈ పోస్టుకు 18-28 సంవత్సరాల మధ్య ఉండాలి. మైన్‌ సర్వేయర్‌ పోస్టుకు 18-30 ఏళ్లు ఉండాలి. గరిష్ఠ వయసులో ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పది నుంచి పదిహేనేళ్ల సడలింపు ఉంటుంది. డీవీసీ ఉద్యోగులకు గరిష్ఠ వయసు లేదు. 

రాతపరీక్షలో..

కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ) ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రాత పరీక్ష ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. ప్రశ్నపత్రంలో రెండు పార్టులు ఉంటాయి. వ్యవధి రెండు గంటలు. 

 • పార్ట్‌-1 జనరల్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌. ఒకాబ్యులరీ, వెర్బల్‌ కాంప్రహెన్షన్, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్, రీజనింగ్‌ ఎబిలిటీ, డేటా సఫిషియన్సీ, ఇంటర్‌ప్రెటేషన్, న్యూమరికల్‌ ఎబిలిటీ మొదలైన అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.
 • పార్ట్‌-2లో టెక్నికల్‌ నాలెడ్జ్‌ టెస్ట్‌ (టీకేటీ) ఉంటుంది. 
 • పార్ట్‌-1, పార్ట్‌-2లో జనరల్‌ అభ్యర్థులు 50 శాతం, ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు 40 శాతం కనీసార్హత మార్కులు సాధించాలి. 
 • పరీక్ష షెడ్యూల్‌ను వెబ్‌సైట్‌లో ప్రకటిస్తారు. 
 •  పరీక్షలో అర్హత సాధించినవారికి ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షలు నిర్వహించి తుది ఎంపిక చేస్తారు. 
 • ధ్రువపత్రాల పరిశీలన తేదీ, ప్రదేశాల వివరాలను అభ్యర్థులకు ఈమెయిల్‌ ద్వారా తెలియజేస్తారు. సమాచారాన్ని వెబ్‌సైట్‌లోనూ అందుబాటులో ఉంచుతారు. 

సన్నద్దత ఇలా..

 • జనరల్‌ ఆప్టిట్యూడ్‌లో భాగంగా తార్కిక సంబంధమైన అంశాలు, సమస్యా పరిష్కార నైపుణ్యం, ఇంగ్లిష్‌ భాషా పరిజ్ఞానం, భారతదేశ చరిత్ర, రాజకీయ, ఆర్థిక పరిస్థితులపై అభ్యర్థికి ఉండే అవగాహనను పరీక్షించే విధంగా ప్రశ్నలు అడుగుతారు. 
 • కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలో ఇచ్చే జనరల్‌ ఆప్టిట్యూడ్, టెక్నికల్‌ నాలెడ్జ్‌ టెస్ట్‌ల సిలబస్‌ను డీవీసీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. వాటిపై పట్టు సాధించాలి.    
 • వివిధ పోటీ పరీక్షలకు సంబంధించిన పాత ప్రశ్నపత్రాలను సాధన చేయాలి. 
 •  పరీక్ష వ్యవధి రెండు గంటల సమయంలోనే ప్రశ్నపత్రాన్ని పూరించడం అలవాటు చేసుకోవాలి. 
 •  ఎప్పటికప్పుడు సమీక్షించుకుని వెనకబడి ఉన్న అంశాలకు ఎక్కువ సమయాన్ని కేటాయించాలి. 
 •  టెక్నికల్‌ నాలెడ్జ్‌ టెస్ట్‌లో మార్కులు సాధించడానికి.. సబ్జెక్టు సంబంధిత సాంకేతిక అంశాలపై పట్టు సాధించాలి. 

దరఖాస్తు ఫీజు రూ.300. ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ ఎక్స్‌-సర్వీస్‌మెన్, డీవీసీ డిపార్ట్‌మెంటల్‌ అభ్యర్థులకు ఫీజు లేదు. 
దరఖాస్తుకు చివరి తేదీ: 04.07.2024 
వెబ్‌సైట్‌: http://www.dvc.gov.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని