నోటీస్‌బోర్డు

దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న అటామిక్‌ ఎనర్జీ కేంద్రీయ విద్యాలయాలు/ జూనియర్‌ కాలేజీల్లో ఉన్న 9 టీచింగ్‌ ఖాళీల భర్తీకి ముంబయిలోని అటామిక్‌ ఎనర్జీ ఎడ్యుకేషన్‌ సొసైటీ (ఏఈఈఎస్‌) దరఖాస్తులు కోరుతోంది.

Published : 25 Jun 2024 00:01 IST

ఉద్యోగాలు
ఏఈఈఎస్‌లో టీచింగ్‌ ఖాళీలు

దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న అటామిక్‌ ఎనర్జీ కేంద్రీయ విద్యాలయాలు/ జూనియర్‌ కాలేజీల్లో ఉన్న 9 టీచింగ్‌ ఖాళీల భర్తీకి ముంబయిలోని అటామిక్‌ ఎనర్జీ ఎడ్యుకేషన్‌ సొసైటీ (ఏఈఈఎస్‌) దరఖాస్తులు కోరుతోంది.

  • ప్రిన్సిపల్‌: 06
  • స్పెషల్‌ ఎడ్యుకేటర్‌: 03  

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ, బీఎడ్, డిప్లొమా, పీజీ, సర్టిఫికెట్‌ కోర్సు. సీటెట్‌ స్కోరు, ఇంగ్లిష్‌ మీడియంలో టీచింగ్‌ అనుభవం ఉండాలి.
వయసు: ప్రిన్సిపల్‌ పోస్టుకు 35 నుంచి 50 ఏళ్లు, స్పెషల్‌ ఎడ్యుకేటర్‌ పోస్టుకు 18 నుంచి 35 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు ఫీజు: ప్రిన్సిపల్, స్పెషల్‌ ఎడ్యుకేటర్‌ పోస్టులకు రూ.750. ఎస్సీ/ ఎస్టీ/ మహిళలు/ దివ్యాంగులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా.
దరఖాస్తు: గూగుల్‌ ఫామ్‌ ద్వారా.
దరఖాస్తుకు చివరి తేదీ: 12-07-2024.
వెబ్‌సైట్‌: https://www.aees.gov.in/


ఏసీటీఆర్‌ఈసీలో సైంటిఫిక్‌ ఆఫీసర్లు 

వీ ముంబయిలోని టాటా మెమోరియల్‌ సెంటర్‌ పరిధిలోని అడ్వాన్స్‌డ్‌ సెంటర్‌ ఫర్‌ ట్రీట్‌మెంట్, రిసెర్చ్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ ఇన్‌ క్యాన్సర్‌ (ఏసీటీఆర్‌ఈసీ).. 19 ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

  • సైంటిఫిక్‌ ఆఫీసర్‌: 04 
  • ఇంజినీర్‌: 01  
  • అసిస్టెంట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌: 04
  • సైంటిఫిక్‌ అసిస్టెంట్‌: 08
  • టెక్నీషియన్‌: 01
  • లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌: 01  

విభాగాలు: ట్రాన్స్‌లేషనల్‌ రిసెర్చ్‌ ల్యాబొరేటరీ, న్యూక్లియర్‌ మెడిసిన్, డేటా అనలిస్ట్, సెంటర్‌ ఫర్‌ క్యాన్సర్‌ ఎపిడెమియాలజీ, సివిల్, పర్చేజ్, స్టోర్స్, బయోమెడికల్, రేడియేషన్‌ అంకాలజీ, న్యూక్లియర్‌ మెడిసిన్, యానిమల్‌ సైన్సెస్, పాథాలజీ.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ, పీజీ, డీఎంఆర్‌ఐటీ/ పీజీడీఎఫ్‌ఐటీ, పీహెచ్‌డీతో పాటు పని అనుభవం.
వయసు: సైంటిఫిక్‌ ఆఫీసర్‌ పోస్టుకు 35-45 ఏళ్లు, ఇంజినీర్‌కు 35 ఏళ్లు, అసిస్టెంట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌కు 40 ఏళ్లు, సైంటిఫిక్‌ అసిస్టెంట్‌కు 30 ఏళ్లు, టెక్నీషియన్, లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌కు 27 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: రాత పరీక్ష/ ఇంటర్వ్యూ/ స్కిల్‌ టెస్ట్‌ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: రూ.300. ఎస్సీ/ఎస్టీ/ మహిళలు, దివ్యాంగులు, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 18-07-2024.
వెబ్‌సైట్‌: https://actrec.gov.in/index.php/


140 సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టులు 

న్యూదిల్లీలోని అటల్‌ బిహారీ వాజ్‌పేయి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్, డాక్టర్‌ రామ్‌ మనోహర్‌ లోహియా హాస్పిటల్‌.. రెగ్యులర్‌ ప్రాతిపదికన 140 సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
విభాగాలు: ట్రాన్స్‌ఫ్యూజన్‌ మెడిసిన్, కార్డియాక్‌ అనస్థీషియా, ఎండోక్రైనాలజీ, ఫోరెన్సిక్‌ మెడిసిన్, గ్యాస్ట్రోఎంటరాలజీ, ఓ అండ్‌ జీ, మెడిసిన్, మైక్రోబయాలజీ, నియోనాటాలజీ, ఆఫ్తాల్మాలజీ, ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్స్, పాథాలజీ, పీఎంఆర్, రేడియాలజీ, సర్జరీ, అనస్థీషియా, అనాటమీ, కమ్యూనిటీ మెడిసిన్, ఫిజియాలజీ, ఫార్మకాలజీ.
అర్హత: ఎంబీబీఎస్, సంబంధిత విభాగాల్లో పీజీ డిగ్రీ/ డిప్లొమా/డీఎన్‌బీ.
వేతన శ్రేణి: నెలకు రూ.67,700- రూ.2,08,700.
వయసు: 45 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: స్క్రీనింగ్‌ టెస్ట్‌/ రాత పరీక్ష ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: రూ.800. ఎస్సీ/ ఎస్టీ/ ఈడబ్ల్యూఎస్‌/ దివ్యాంగులకు ఫీజు మినహాయించారు.
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ‘సెంట్రల్‌ డైరీ అండ్‌ డిస్పాచ్‌ సెక్షన్, గేట్‌ నెం.3 దగ్గర, ఏబీవీఐఎంఎస్‌ అండ్‌ డాక్టర్‌ రామ్‌ మనోహర్‌ లోహియా హాస్పిటల్, న్యూదిల్లీ’ చిరునామాకు పంపాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: 29-06-2024.
రాత పరీక్ష తేదీ: 28-07-2024.
వెబ్‌సైట్‌: https://rmlh.nic.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని