ప్రభుత్వ ఉద్యోగాలు

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవెల్‌ (సీజీఎల్‌) పరీక్ష-2024 ప్రకటన వెలువరించింది. వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లో గ్రూప్‌-బి, గ్రూప్‌-సి విభాగాల్లోని 17,727 ఖాళీలను భర్తీచేస్తారు.

Published : 26 Jun 2024 00:37 IST

ఎస్‌ఎస్‌సీ- సీజీఎల్‌ 2024

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవెల్‌ (సీజీఎల్‌) పరీక్ష-2024 ప్రకటన వెలువరించింది. వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లో గ్రూప్‌-బి, గ్రూప్‌-సి విభాగాల్లోని 17,727 ఖాళీలను భర్తీచేస్తారు.
పోస్టులు:

 • అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌
 • ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఇన్‌కమ్‌ ట్యాక్స్‌
 • ఇన్‌స్పెక్టర్‌
 • అసిస్టెంట్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫీసర్‌
 • సబ్‌ ఇన్‌స్పెక్టర్‌
 • ఎగ్జిక్యూటివ్‌ అసిస్టెంట్‌
 • రిసెర్చ్‌ అసిస్టెంట్‌
 • జూనియర్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌
 • సబ్‌ ఇన్‌స్పెక్టర్‌/ జూనియర్‌ ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌
 • ఆడిటర్‌
 • అకౌంటెంట్‌
 • అకౌంటెంట్‌/ జూనియర్‌ అకౌంటెంట్‌
 • పోస్టల్‌ అసిస్టెంట్‌/ సార్టింగ్‌ అసిస్టెంట్‌
 • సీనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌/ అప్పర్‌ డివిజన్‌ క్లర్క్‌
 • సీనియర్‌ అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌
 • టాక్స్‌ అసిస్టెంట్‌

అర్హత: ఎక్కువ పోస్టులకు సాధారణ డిగ్రీ సరిపోతుంది. మిగిలినవాటికి సంబంధిత విభాగాల్లో గ్రాడ్యుయేషన్‌ ఉండాలి. ఎంపిక: రాత పరీక్షలు, స్కిల్‌ టెస్టులతో.
దరఖాస్తు ఫీజు: రూ.100. ఎస్సీ/ఎస్టీ/ మహిళలు/ దివ్యాంగులకు మినహాయించారు.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 25-07-2024.
వెబ్‌సైట్‌: https://ssc.gov.in/


ఎస్‌బీఐలో స్పెషలిస్ట్ట్‌లు

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) 5 స్పెషలిస్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

 • క్లైమేట్‌ రిస్క్‌ స్పెషలిస్ట్‌ (ఎంఎంజీఎస్‌-III)- మిడిల్‌ మేనేజ్‌మెంట్‌ గ్రేడ్‌-స్కేల్‌ III: 2  
 • మార్కెట్‌ రిస్క్‌ స్పెషలిస్ట్‌ (ఎంఎంజీఎస్‌-III)- మిడిల్‌ మేనేజ్‌మెంట్‌ గ్రేడ్‌-స్కేల్‌ III: 3  

అర్హతలు: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో సీఏ/ ఐసీడబ్ల్యూఏ, ఎంబీఏ (బ్యాంకింగ్‌/ ఫైనాన్స్‌), పీజీ ఉత్తీర్ణతతో పాటు రెండు నుంచి మూడేళ్ల పని అనుభవం ఉండాలి.
వయసు: 01-02-2024 నాటికి క్లైమేట్‌ రిస్క్‌ స్పెషలిస్ట్‌లకు 25 నుంచి 40 ఏళ్లు, మార్కెట్‌ రిస్క్‌ స్పెషలిస్ట్‌ పోస్టులకు 28 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్‌: నెలకు రూ.63,840-రూ.78,230.
పోస్టింగ్‌ ప్రదేశం: ముంబయి.
దరఖాస్తు రుసుము: రూ.750 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు మినహాయించారు).
ఎంపిక: అప్లికేషన్‌ షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌తో.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 27.06.2024.
వెబ్‌సైట్‌: https://sbi.co.in/


చార్టర్డ్‌ అకౌంటెంట్లు

చార్టర్డ్‌ అకౌంటెంట్‌ పోస్టుల భర్తీకి ఎస్‌బీఐ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
చార్టర్డ్‌ అకౌంటెంట్‌ (స్పెషలిస్ట్‌) (ఎంఎంజీఎస్‌-II)- మిడిల్‌ మేనేజ్‌మెంట్‌ గ్రేడ్‌-స్కేల్‌ II: 09 పోస్టులు
అర్హతలు: చార్టర్డ్‌ అకౌంటెన్సీ ఉత్తీర్ణతతో పాటు షెడ్యూల్డ్‌ కమర్షియల్‌ బ్యాంకు/ ఐఎఫ్‌ల్లో మూడేళ్ల పని అనుభవం ఉండాలి.
వయసు: 01-02-2024 నాటికి 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్‌: నెలకు రూ.48,170-రూ.69,810.
పోస్టింగ్‌ ప్రదేశం: ముంబయి.
దరఖాస్తు ఫీజు: రూ.750 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు మినహాయించారు).
ఎంపిక: అప్లికేషన్‌ షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 27.06.2024.
వెబ్‌సైట్‌: https://sbi.co.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని