నోటీస్‌బోర్డు

చెన్నైలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఎంపవర్మెంట్‌ ఆఫ్‌ పర్సన్స్‌ విత్‌ మల్టిపుల్‌ డిజెబిలిటీస్‌ (దివ్యాంగ్‌జన్‌).. ఒప్పంద ప్రాతిపదికన కింది ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

Published : 04 Jul 2024 00:08 IST

ఉద్యోగాలు
కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌లో..

కేరళలోని కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌.. 3 ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ (మెకానికల్‌) పోస్టుల భర్తీకి ఒప్పంద ప్రాతిపదికన దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: సంబంధిత విభాగంలో 60 శాతం మార్కులతో బీటెక్‌తో పాటు పని అనుభవం.

వయసు: జులై 12 వరకు 30 ఏళ్లు మించకూడదు. ఎస్సీలకు 5 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ/ ఎక్స్‌ సర్వీస్‌మెన్‌కు పదేళ్లు సడలింపు ఉంటుంది.

ఎంపిక: ఆన్‌లైన్‌ టెస్ట్, షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూల ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: రూ.400, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 12-07-2024.

వెబ్‌సైట్‌: https://cochinshipyard.in/


ఎస్‌పీఏవీలో టీచింగ్‌ ఖాళీలు

విజయవాడలోని స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌.. 4 ఫ్యాకల్టీ (ప్రొఫెసర్, అసోసియేట్‌ ప్రొఫెసర్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

విభాగాలు: ప్లానింగ్, ఆర్కిటెక్చర్‌

అర్హత: సంబంధిత విధానంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీతో పాటు బోధనలో అనుభవం.

వేతనం: ప్రొఫెసర్‌ పోస్టుకు నెలకు రూ.1,44,200. అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టుకు రూ.1,31,400.

దరఖాస్తు ఫీజు: రూ.1000, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/మహిళలకు ఫీజు మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తు: వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకుని నోటిఫికేషన్‌ వెలువడిన 30 రోజుల్లోగా ది డైరెక్టర్, స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్, విజయవాడ, 4/4, ఐటీఐ రోడ్, విజయవాడ- 8’ చిరునామాకు పంపించాలి.

వెబ్‌సైట్‌: https://www.spav.ac.in/


వాక్‌-ఇన్‌
చెన్నైలో కన్సల్టెంట్‌ పోస్టులు

చెన్నైలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఎంపవర్మెంట్‌ ఆఫ్‌ పర్సన్స్‌ విత్‌ మల్టిపుల్‌ డిజెబిలిటీస్‌ (దివ్యాంగ్‌జన్‌).. ఒప్పంద ప్రాతిపదికన కింది ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

  • సీనియర్‌ కన్సల్టెంట్‌-ఎస్టేట్‌ అండ్‌ మెయింటెనెెన్స్‌: 01
  • కన్సల్టెంట్‌-అడ్మిన్‌ అండ్‌ ఎస్టేట్‌: 01
  • వర్క్‌షాప్‌ సూపర్‌వైజర్‌- ఇయర్‌మౌల్డ్‌ టెక్నిషియన్‌ (కన్సల్టెంట్‌): 01  

అర్హత: డిప్లొమా, డిగ్రీ, బీఈతో పాటు పని అనుభవం.

వేతనం: నెలకు వర్క్‌షాప్‌ సూపర్‌వైజర్‌- ఇయర్‌మౌల్డ్‌ టెక్నీషియన్‌ పోస్టుకు రూ.35,000, ఇతర పోస్టులకు రూ.45,000.

వయసు: కన్సల్టెంట్‌-అడ్మిన్‌ అండ్‌ ఎస్టేట్‌ పోస్టుకు 62 ఏళ్లు, ఇతర పోస్టులకు 56 ఏళ్లు మించకూడదు.

ఇంటర్వ్యూ తేదీ: 15-07-2024.

వెబ్‌సైట్‌: https://www.niepmd.tn.nic.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు