నోటిఫికేషన్స్‌

ఏఐ ఎయిర్‌పోర్ట్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ ఫిక్స్‌డ్‌ టర్మ్‌ కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన మూడేళ్ల కాలపరిమితికి ముంబయి ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో మేనేజర్, ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్‌ మొదలైన పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

Published : 06 Jul 2024 00:17 IST

ఏఐఏఎస్‌ఎల్‌లో పోస్టులు

ఏఐ ఎయిర్‌పోర్ట్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ ఫిక్స్‌డ్‌ టర్మ్‌ కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన మూడేళ్ల కాలపరిమితికి ముంబయి ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో మేనేజర్, ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్‌ మొదలైన పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య 3,256. దరఖాస్తు రుసుము రూ.500. ఇంటర్వ్యూ తేదీలు 12, 13, 14, 15, 16 జులై 2024.

నాన్‌ టీచింగ్‌ ఖాళీలు

యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ (యూఓహెచ్‌) నాన్‌ ఫ్యాకల్టీ - గ్రూప్‌-ఎ, గ్రూప్‌-బి, గ్రూప్‌-సి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య 52. అర్హులైన అభ్యర్థులు 19 జులై 2024 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఐటీఐ కోర్సు అడ్మిషన్లు-2024

విజయవాడలోని ఏపీ ఉపాధి - శిక్షణ కమిషనర్‌ కార్యాలయం 2024-2025 రెండో సెషన్‌కుగాను రాష్ట్రంలోని ప్రభుత్వ/ ప్రైవేట్‌ ఐటీఐల్లో వివిధ ట్రేడుల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు జులై 24 లోగా ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు డౌన్‌లోడ్‌ చేసుకొని, వాటిని పూరించి, సంబంధిత కళాశాలలో అందజేయాలి.

పూర్తి వివరాలు, మరిన్ని నోటిఫికేషన్ల కోసం క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయండి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని