నోటీస్‌బోర్డు

హైదరాబాద్‌లోని హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌).. కింది విభాగాల్లో 20 ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.

Published : 08 Jul 2024 00:22 IST

ఉద్యోగాలు

హాల్‌లో నాన్‌ ఎగ్జిక్యూటివ్‌లు 

హైదరాబాద్‌లోని హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌).. కింది విభాగాల్లో 20 ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.

 • సీఎంఎం (లెవల్‌-5) ఇంజినీర్‌: 04 
 • మిడిల్‌ స్పెషలిస్ట్‌: 08
 • జూనియర్‌ స్పెషలిస్ట్‌: 08  
 • అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్‌తో పాటు పని అనుభవం.  

విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్, కంప్యూటర్‌ సైన్స్‌. 

వయసు: 18.07.2024 నాటికి సీఎంఎం పోస్టుకు 45 ఏళ్లు, మిడిల్‌ స్పెషలిస్ట్‌ పోస్టుకు 40 ఏళ్లు, జూనియర్‌ పోస్టుకు 35 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీ (ఎన్‌సీఎల్‌) లకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్ల సడలింపు ఉంటుంది. 

వేతనం: నెలకు సీఎంఎం పోస్టుకు రూ.60,000, మిడిల్‌ స్పెషలిస్ట్‌ పోస్టుకు రూ.50,000, జూనియర్‌ పోస్టుకు రూ.40,000.

దరఖాస్తు ఫీజు: రూ.500, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.

ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షల ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 18-07-2024.

వెబ్‌సైట్‌: https://hal-india.co.in/home


హెచ్‌ఎల్‌ఎల్‌ లైఫ్‌కేర్‌లో...

ప్రభుత్వ రంగ సంస్థ- హెచ్‌ఎల్‌ఎల్‌ లైఫ్‌కేర్‌ లిమిటెడ్‌.. ఒప్పంద ప్రాతిపదికన దేశవ్యాప్తంగా 63 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

 • హిందీ ట్రాన్స్‌లేటర్‌: 01  
 • ఏరియా సేల్స్‌ మేనేజర్‌/ అసిస్టెంట్‌ రీజినల్‌ మేనేజర్‌/ డిప్యూటీ మేనేజర్‌: 22 
 • బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్‌-5/ సర్వీస్‌ 

ఎగ్జిక్యూటివ్‌: 11  

 • బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్‌-3, 4: 27  
 • ఏరియా సేల్స్‌ మేనేజర్‌: 02  

విభాగాలు: కన్‌స్యూమర్‌ బిజినెస్‌ డివిజన్, సేల్స్‌ అండ్‌ సర్వీస్‌ (వెండింగ్‌ బిజినెస్‌ డివిజన్‌), ఫార్మా డివిజన్‌.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీతో పాటు పని అనుభవం.

వేతనం: నెలకు హిందీ ట్రాన్స్‌లేటర్‌ పోస్టుకు రూ.9000-రూ.18,000. బిజినెస్‌ డెవెలప్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్‌-4 పోస్టులకు రూ.11,000-రూ.22,000. బిజినెస్‌ డెవెలప్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్‌-3 పోస్టులకు రూ.10500-రూ.21,000. బిజినెస్‌ డెవెలప్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్‌-5, ఏరియా సేల్స్‌ మెనేజర్‌కు రూ.11,500-రూ.23,000. అసిస్టెంట్‌ రీజినల్‌ మేనేజర్‌కు రూ.13,000-30,000. డిప్యూటీ మేనేజర్‌ పోస్టుకు రూ.14,000-రూ.32,500.

ఉద్యోగ స్థానం: తమిళనాడు, కేరళ, కర్ణాటక, గోవా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, పంజాబ్, దిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్, 

దరఖాస్తు: పోస్టు/ ఈమెయిల్‌ ద్వారా జులై 17 లోపు దరఖాస్తులు పంపించాలి. 

చిరునామా: డీజీఎం(హెచ్‌ఆర్‌), హెచ్‌ఎల్‌ఎల్‌ లైఫ్‌కేర్‌ లిమిటెడ్, హాల్‌భవన్, చి26/4 వెలచేరీ-తంబంరం మెయిన్‌రోడ్, పల్లికరనై, చెన్నై.

వెబ్‌సైట్‌: https://www.lifecarehll.com/


వాక్‌-ఇన్‌

ఎన్‌ఎంఆర్‌ఐ, హైదరాబాద్‌లో యంగ్‌ ప్రొఫెషనల్స్‌  

హైదరాబాద్, చెంగిచెర్లలోని ఐసీఏఆర్‌కు చెందిన నేషనల్‌ మీట్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌.. 10 ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

 • ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-1: 02
 • యంగ్‌ ప్రొఫెషనల్‌-1: 04  
 • యంగ్‌ ప్రొఫెషనల్‌-2: 04 

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీతో పాటు పని అనుభవం.

వేతనం: నెలకు ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ పోస్టుకు రూ.25,000, యంగ్‌ ప్రొఫెషనల్‌-1 పోస్టుకు రూ.30,000, యంగ్‌ ప్రొఫెషనల్‌-2 పోస్టుకు రూ.42,000.

వయసు: ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ పోస్టుకు 35 ఏళ్లు, యంగ్‌ ప్రొఫెషనల్‌ పోస్టులకు 45 ఏళ్లు మించకూడదు.

ఇంటర్వ్యూ తేదీ: 15-07-2024.

వేదిక: ఐసీఏఆర్‌-నేషనల్‌ మీట్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్, చెంగిచెర్ల, హైదరాబాద్‌.

వెబ్‌సైట్‌: https://nrcmeat.icar.gov.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు