నోటీస్‌బోర్డు

గుజరాత్‌ రాష్ట్రం ద్వారకలోని ఇండియన్‌ హైవేస్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఐహెచ్‌ఎంసీఎల్‌).. రెగ్యులర్‌ ప్రాతిపదికన 31 ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Published : 09 Jul 2024 00:44 IST

ఉద్యోగాలు
ఐఎచ్‌ఎంసీఎల్‌లో ఇంజినీర్లు 

గుజరాత్‌ రాష్ట్రం ద్వారకలోని ఇండియన్‌ హైవేస్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఐహెచ్‌ఎంసీఎల్‌).. రెగ్యులర్‌ ప్రాతిపదికన 31 ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

  • ఇంజినీర్‌ (ఐటీఎస్‌): 30
  • ఆఫీసర్‌ (ఫైనాన్స్‌): 01 

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీటెక్, సీఏ, సీఎంఏతో పాటు 2022, 2023, 2024 గేట్‌ స్కోరు.

విభాగాలు: ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, కంప్యూటర్‌ సైన్స్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్, ఎలక్ట్రికల్,  ఇన్‌స్ట్రుమెంటేషన్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌.

వయసు: ఇంజినీర్‌ పోస్టుకు 21- 30 ఏళ్లు, ఆఫీసర్‌ పోస్టుకు 30 ఏళ్లు మించకూడదు. 

వేతనం: నెలకు రూ.40,000- రూ.1,40,000.

ఎంపిక: ఇంజినీర్‌ (ఐటీఎస్‌) పోస్టుకు గేట్‌ స్కోరు, ఇంటర్వ్యూ, ఆఫీసర్‌ (ఫైనాన్స్‌) పోస్టుకు సీఏ మార్కులు, ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 16-07-2024.

వెబ్‌సైట్‌: https://ihmcl.co.in/


ఐజీజీఎల్‌లో మేనేజర్, ఇంజినీర్‌ పోస్టులు  
సోం రాష్ట్రం గువాహటిలోని ఇంద్రధనుష్‌ గ్యాస్‌ గ్రిడ్‌ లిమిటెడ్‌ (ఐజీజీఎల్‌).. 22 ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

  • మేనేజర్‌ (గ్రేడ్‌-ఈ3): 10  
  • సీనియర్‌ ఇంజినీర్‌ (గ్రేడ్‌-ఈ2): 06 
  • ఇంజినీర్‌ (గ్రేడ్‌-ఈ1): 01 నీ ఆఫీసర్‌ (గ్రేడ్‌-ఈ1): 04 
  • అసిస్టెంట్‌ కంపెనీ సెక్రటేరీ (గ్రేడ్‌-ఈ1): 01 

విభాగాలు: ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్, మార్కెటింగ్, ప్రాజెక్ట్, టెలికాం, ఆపరేటింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్, హెచ్‌ఎస్‌ఈ, హెచ్‌ఆర్, లీగల్‌.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో డిగ్రీ, సీఏ, సీఎంఏ, ఎంబీఏతో పాటు పని అనుభవం.

వేతనం: మేనేజర్‌ పోస్టుకు రూ.12 లక్షల నుంచి రూ.22 లక్షలు, సీనియర్‌ ఇంజినీర్‌ పోస్టుకు రూ.10 లక్షల నుంచి రూ.18 లక్షలు, ఇంజినీర్, ఆఫీసర్, అసిస్టెంట్‌ పోస్టులకు రూ.8 లక్షల నుంచి రూ.13 లక్షలు.

దరఖాస్తు ఫీజు: రూ.500. ఎంపిక: దరఖాస్తుల స్క్రీనింగ్, గ్రూప్‌ డిస్కషన్, ఇంటర్వ్యూల ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 14-07-2024.

వెబ్‌సైట్‌: https://iggl.co.in/


ఎయిమ్స్‌లో సీనియర్‌ రెసిడెంట్లు 

గుజరాత్‌ రాష్ట్రం రాజ్‌కోట్‌లోని ఎయిమ్స్‌.. కింది విభాగాల్లో 48 సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

విభాగాలు: అనస్తీషియా, అనాటమీ, బయోకెమిస్ట్రీ, డెర్మటాలజీ, ఈఎన్‌టీ, జనరల్‌ మెడిసిన్, జనరల్‌ సర్జరీ, పాథాలజీ, పీడియాట్రిక్స్, గైనకాలజీ తదితరాలు.

అర్హత: సంబంధిత విభాగంలో ఎండీ/ ఎంఎస్‌/ ఎంసీహెచ్‌/ డీఎం, పీహెచ్‌డీతో పాటు పని అనుభవం.

వయసు: 45 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీ ఐదేళ్లు, ఓబీసీ మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్లు సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: రూ.1000, ఎస్సీ/ఎస్టీ రూ.800, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 25-07-2024.

వెబ్‌సైట్‌: https://aiimsrajkot.edu.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని