నోటీస్‌బోర్డు

నావికాదళంలో సెయిలర్‌ ఖాళీల భర్తీకి అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి ఇండియన్‌ నేవీ దరఖాస్తులు కోరుతోంది.

Published : 06 Dec 2018 00:37 IST

ప్రభుత్వ ఉద్యోగాలు 
నేవీలో 3వేలకు పైగా సెయిలర్‌ పోస్టులు

నోటీస్‌బోర్డునావికాదళంలో సెయిలర్‌ ఖాళీల భర్తీకి అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి ఇండియన్‌ నేవీ దరఖాస్తులు కోరుతోంది. 
పోస్టులు-ఖాళీలు: సెయిలర్‌(సీనియర్‌ సెకండరీ రిక్రూట్‌/ ఆర్టిఫైసర్‌ అప్రెంటిస్‌/ మెట్రిక్‌ రిక్రూట్‌)- 3400 (సుమారుగా). 
అర్హత: పదోతరగతి, సంబంధిత సబ్జెక్టుల్లో ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీకర, వైద్య ప్రమాణాలు తప్పనిసరి. 
వయసు: ఎస్‌ఎస్‌ఆర్‌, ఏఏ పోస్టులకు 01.08.1998 - 31.07.2002, ఎంఆర్‌ ఖాళీలకు 01.10.1998 - 30.09.2002 తేదీల మధ్య జన్మించి ఉండాలి. 
ఎంపిక: కంప్యూటర్‌ ఆధారిత, శారీరక దృఢత్వ, వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా. 
ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ తేదీలు: 14.12.2018 నుంచి 30.12.2018 వరకు. 
వెబ్‌సైట్‌: ‌www.joinindiannavy.gov.in

మహానది కోల్‌ఫీల్డ్స్‌

సంబల్‌పూర్‌ (ఒడిశా)లోని కోల్‌ ఇండియా లిమిటెడ్‌ సబ్సిడరీ సంస్థ అయిన మహానది కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 
పోస్టులు-ఖాళీలు: జూనియర్‌ ఓవర్‌మ్యాన్‌-149, మైనింగ్‌ సర్దార్‌-201, డిప్యూటీ సర్వేయర్‌-20. 
ఆన్‌లైన్‌ దరఖాస్తు: డిసెంబరు 21 నుంచి 2019 జనవరి 10 వరకు. 
గమనిక: పూర్తి వివరాలకు సంస్థ వెబ్‌సైట్‌ చూడవచ్చు. 
వెబ్‌సైట్‌: http://www.mahanadicoal.in/

న్యూఇండియా అస్యూరెన్స్‌

ముంబయి ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న న్యూ ఇండియా అస్యూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 
పోస్టులు-ఖాళీలు: జనరలిస్ట్‌-245, స్పెషలిస్ట్‌-67. 
స్పెషలిస్ట్‌ విభాగాలు: కంపెనీ సెక్రటరీ, లీగల్‌, ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌. 
ఆన్‌లైన్‌ దరఖాస్తు: డిసెంబరు 10 నుంచి 26 వరకు. 
గమనిక: పూర్తి వివరాలకు న్యూఇండియా వెబ్‌సైట్‌ చూడవచ్చు. https://www.newindia.co.in/

కేఐవోసీఎల్‌ లిమిటెడ్‌

బెంగళూరులోని భారత ప్రభుత్వ రంగ సంస్థ కేఐవోసీఎల్‌ లిమిటెడ్‌ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 
పోస్టు: గ్రాడ్యుయేట్‌ ఇంజినీర్‌ ట్రైనీ 
ఖాళీలు: 25 విభాగాలు: మెకానికల్‌, ఎలక్ట్రికల్‌/ ఎల‌క్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ తదితరాలు. 
అర్హత: సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణత. 
వయసు: 27 ఏళ్లు మించకూడదు. 
ఎంపిక: గేట్‌ ర్యాంకు, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా. 
ఆన్‌లైన్‌ దరఖాస్తు: డిసెంబరు 10 నుంచి 2019 జనవరి 4 వరకు. 
వెబ్‌సైట్‌: https://www.kioclltd.in/

తిరుపతి ఐఐటీలో టీచింగ్‌  పోస్టులు

తిరుపతిలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ) కింది టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 
పోస్టులు: ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ గ్రేడ్‌-1. 
విభాగాలు: కెమిస్ట్రీ, కెమికల్‌ ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ తదితరాలు. 
అర్హత: సంబంధిత విభాగంలో ప్రథమశ్రేణిలో పీహెచ్‌డీ, బోధన/ పరిశోధన/ ఇండస్ట్రీ అనుభవం. 
వయసు: అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు 38 ఏళ్లు; అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు 45 ఏళ్లు మించకూడదు. 
దరఖాస్తు: ఆన్‌లైన్‌. 
చివరితేది: 2019 జనవరి 13 
వెబ్‌సైట్‌: http://iittp.ac.in/
మరిన్ని నోటిఫికేషన్లు ‌www.eenadupratibha.net లో

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని