టీసీఎస్ కొలువుల పిలుపు
స్మార్ట్ హైరింగ్: బీఎస్సీ, బీసీఏ
డిగ్రీ పూర్తవగానే ప్రసిద్ధ సంస్థలో ఉద్యోగం.. అది చేసుకుంటూనే ఉన్నత చదువులు.. ఈ అవకాశాన్ని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కల్పిస్తోంది. ఇటీవల డిగ్రీ పట్టా అందుకున్న అభ్యర్థులు, ఇంకొద్ది రోజుల్లో పూర్తిచేయబోతున్నవారు, ఎంబీఏ ఆఖరి సంవత్సరంలో ఉన్న విద్యార్థులు ఈ ఆఫర్‌ను అందుకోవచ్చు. సంబంధిత ప్రకటన వెలువడింది.
రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపికైనవారికి టీఎసీఎస్ సంస్థ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, ఏఆర్, వీఆర్ల్లో నిపుణులతో ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తుంది. విజయవంతంగా ట్రెయినింగ్ పూర్తిచేసుకున్నవారిని ఉద్యోగాల్లోకి తీసుకుంటుంది. ఇలా చేరినవారు టీసీఎస్‌లో విధులు నిర్వహిస్తూనే శస్త్ర యూనివర్సిటీ నుంచి ఎంసీఏ కోర్సు చదువుకోవచ్చు.
ఎవరు అర్హులు: బీసీఏ, బీఎస్సీ, ఒకేషనల్ స్టడీస్ (సీఎస్ అండ్ ఐటీ) కోర్సులను 2019లో పూర్తిచేసుకున్నవారు, 2020లో పూర్తిచేయబోతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. పదో తరగతి, ఇంటర్, బీఎస్సీ/ బీసీఏ/ ఒకేషనల్- ప్రతి తరగతిలోనూ కనీసం 50 శాతం మార్కులు తప్పనిసరి. విద్యాభ్యాసం మొత్తంమీద గ్యాప్ రెండేళ్లకు మించకూడదు.
పరీక్ష ఇలా: రాత పరీక్షలో 40 ప్రశ్నలు ఇస్తారు. కొన్ని మల్టిపుల్ ఛాయిస్‌లో, మరికొన్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ రూపంలో ఉంటాయి. 90 నిమిషాల్లో సమాధానాలు రాయాలి. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 15 ప్రశ్నలు ఉంటాయి. కాలవ్యవధి 45 నిమిషాలు. వెర్బల్ ఎబిలిటీలో 15 ప్రశ్నలకు 15 నిమిషాల సమయం ఇస్తారు. ప్రోగ్రామింగ్ లాజిక్ నుంచి 10 ప్రశ్నలుంటాయి. వీటిని 30 నిమిషాల వ్యవధిలో పూర్తిచేయాలి. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ప్రశ్నలు హైస్కూల్ స్థాయిలో ఉంటాయి. లీనియర్ ఆల్జీబ్రా, రేషియో ప్రపోర్షన్స్, స్పీడ్-డిస్టెన్స్, జామెట్రీ, టైమ్ అండ్ వర్క్, ప్రాఫిట్ అండ్ లాస్, ఏరియాస్ అండ్ వాల్యూమ్స్, కో ఆర్డినేట్ జామెట్రీ, ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్, నంబర్ సిస్టమ్స్, ట్రిగొనామెట్రీ, కాలిక్యులస్, డేటా ఇంటర్‌ప్రిటేషన్ విభాగాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. వెర్బల్ ఎబిలిటీలో రీడింగ్ కాంప్రహెన్షన్, బేసిక్ ఇంగ్లిష్ గ్రామర్, సెంటెన్స్ కన్స్ట్రక్షన్ ప్రశ్నలు అడుగుతారు. ప్రోగ్రామింగ్ లాజిక్‌లో సీ లాంగ్వేజీ నుంచి షార్ట్ కోడ్ స్నిప్పెట్స్ ఉంటాయి. వీటిని చదివి అర్థం చేసుకోవాలి. ఆ కోడ్ ఏమిటో గుర్తించాలి.
ఎంబీఏ డ్రైవ్
ఎంబీఏ కోర్సు చివరిదశలో ఉన్న విద్యార్థుల కోసం టీసీఎస్ మేనేజ్మెంట్ హైరింగ్ డ్రైవ్ నిర్వహిస్తోంది. ఆన్లైన్ పరీక్షలో చూపిన ప్రతిభ, ఇంటర్వ్యూల ద్వారా నియామకాలు చేపడతారు.
విద్యార్హత: రెండేళ్ల ఫుల్ టైం ఎంబీఏ కోర్సు 2020లో పూర్తిచేసుకోబోతున్నవారు అర్హులు. మార్కెటింగ్/ ఫైనాన్స్/ సిస్టమ్స్/ ఆపరేషన్స్/ ఐటీ/ సప్లయ్ చెయిన్/ బిజినెస్ ఎకనామిక్స్/ ప్రొడక్టివిటీ అండ్ క్వాలిటీ మేనేజ్మెంట్/ ఈ-కామర్స్/ లాజిస్టిక్స్/ రిటైల్/ ఎనలిటిక్స్/ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్లలో ఏ విభాగంలోనైనా ఎంబీఏ చదువుతున్నవారు అర్హులు. డిగ్రీలో బీఈ/ బీటెక్ చదివుండాలి. అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ చివరి సంవత్సరం కోర్సు చదువుతున్న విద్యార్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యాభ్యాసం మొత్తంలో అన్ని పరీక్షల్లోనూ తొలి ప్రయత్నంలోనే 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. రెగ్యులర్ విధానంలో ఫుల్ టైం కోర్సులు చదివినవారే అర్హులు. అకడమిక్ కోర్సుల మధ్య మొత్తంగా 30 నెలల కంటే ఎక్కువ ఖాళీ ఉండకూడదు.
పరీక్షలో: వెర్బల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ విభాగాల్లో ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి 90 నిమిషాలు. ఇందులో 80 నిమిషాలు క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, 10 నిమిషాలు వెర్బల్ ఎబిలిటీకి కేటాయించారు.
ఎంపికైతే: టీసీఎస్ ఇనిషియల్ లర్నింగ్ ప్రోగ్రాం (ఐఎల్పీ) శిక్షణ ఉంటుంది. అనంతరం ప్రొడక్ట్ స్పెషలిస్టు, ప్రీ సేల్స్ కన్సల్టింగ్, బిజినెస్ ఎనలిస్ట్, ఫంక్షనల్ కన్సల్టెంట్, మార్కెటింగ్ ఎనలిస్టు, సొల్యూషన్ ఆర్కిటెక్ట్ హోదాలతో ఉద్యోగాల్లోకి తీసుకుంటారు.
రిజిస్ట్రేషన్లకు చివరి తేదీ: సెప్టెంబరు 30. https://careers.tcs.com
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Earthquake: తుర్కియే భూకంపం.. ముందే హెచ్చరించిన పరిశోధకుడు..!
-
India News
Layoffs: ‘కాబోయేవాడికి ‘మైక్రోసాఫ్ట్’లో ఉద్యోగం పోయింది.. పెళ్లి చేసుకోమంటారా?’
-
Sports News
Ind vs Aus: టీమ్ ఇండియా 36కి ఆలౌట్.. ఆ పరాభవానికి బదులు తీర్చుకోవాల్సిందే!
-
Movies News
Raveena Tandon: రేప్ సన్నివేశాల్లోనూ అసభ్యతకు నేను చోటివ్వలేదు: రవీనా
-
Sports News
IND vs AUS: ఆసీస్ ఆటగాళ్లను ఎగతాళి చేయడం కోహ్లీకి ఇష్టం: సంజయ్ బంగర్
-
Movies News
Social Look: దివి ‘టీజింగ్ సరదా’.. అనుపమ తలనొప్పి పోస్ట్!