మ్యాట్ బాటలో మేనేజ్మెంట్ విద్య!
మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశానికి ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) నిర్వహించే మేనేజ్మెంట్ ఆప్టిట్యూడ్ టెస్టు (మ్యాట్) ప్రకటన వెలువడింది. డిగ్రీ పూర్తిచేసుకున్నవారితోపాటు ఆఖరి సంవత్సరం కోర్సు చదువుతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ స్కోరుతో దేశవ్యాప్తంగా 600కుపైగా విద్యాసంస్థలు ప్రవేశాలు కల్పిస్తున్నాయి.
మ్యాట్‌ను ఏటా నాలుగు సార్లు నిర్వహిస్తున్నారు. ఆన్లైన్, ఆఫ్లైన్లలో పరీక్ష జరుగుతుంది. ఆసక్తి ఉంటే రెండు విధానాలకూ హాజరు కావచ్చు. తెలుగు రాష్ట్రాల్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ (ఐపీఈ), ఆస్కీ, గీతం, విజ్ఞానజ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, ధ్రువ, అరోరా, ఐఐఆర్ఎం, విశ్వవిశ్వానీ, ఐటీఎం, ఐసీబీఎం... సంస్థలు మ్యాట్ స్కోరుతో ప్రవేశాలు కల్పిస్తున్నాయి. మ్యాట్‌లో సాధించిన స్కోరు ఏడాదిపాటు చెల్లుతుంది.
లాంగ్వేజ్ కాంప్రహెన్షన్, మ్యాథమేటికల్ స్కిల్స్, డేటా అనాలిసిస్ అండ్ సఫిషియన్సీ, ఇంటలిజెన్స్ అండ్ క్రిటికల్ రీజనింగ్, ఇండియన్ అండ్ గ్లోబల్ ఎన్విరాన్మెంట్ అంశాల్లో ఒక్కో విభాగం నుంచి 40 చొప్పున 200 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. రుణాత్మక మార్కులున్నాయి. పరీక్ష వ్యవధి రెండున్నర గంటలు.
అర్హత: డిగ్రీ ఉత్తీర్ణత. ఆఖరి సంవత్సరం కోర్సులు చదువుతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా.
పరీక్ష ఫీజు: పేపర్ లేదా ఆన్లైన్ ఏదో ఒక విధానంలో రాసుకోవడానికి రూ.1550. రెండు విధానాలకూ హాజరుకావడానికి¨ రూ. 2650 పేపర్
ఆధారిత పరీక్ష రిజిస్ట్రేషన్ చివరి తేది: డిసెంబరు 1.
రాతపరీక్ష తేది: డిసెంబరు 8.
కంప్యూటర్ ఆధారిత పరీక్ష రిజిస్ట్రేషన్ చివరి తేది: డిసెంబరు 6.
పరీక్ష తేది: డిసెంబరు 14
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం.
https://mat.aima.in/dec19/
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Social Look: దివి ‘టీజింగ్ సరదా’.. అనుపమ తలనొప్పి పోస్ట్!
-
India News
Sonia Gandhi: మోదీ బడ్జెట్.. పేదలపై నిశ్శబ్ద పిడుగు..!
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
World News
Earthquake: వణికిపోతున్న తుర్కియే.. గంటల వ్యవధిలోనే మూడో భూకంపం..!
-
Politics News
Congress: అవసరమైతే రెండు చోట్లా పోటీ చేస్తా: రేణుకా చౌదరి
-
General News
KTR: 4 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా తెలంగాణ మొబిలిటీ వ్యాలీ: మంత్రి కేటీఆర్