ఇగ్నోలో ఎంబీఏ

అంతర్జాతీయస్థాయి గుర్తింపు పొందిన ఇగ్నో నుంచి ఎంబీఏ కోర్సుకు నోటిఫికేషన్‌ వెలువడింది. ఈ కోర్సు పూర్తి చేసి పీజీ పట్టా అందుకుంటే మెరుగైన ఉద్యోగావకాశాలను పొందవచ్చు. ఉన్నతస్థాయికి చేరుకోవచ్చు.

Published : 11 Mar 2020 01:23 IST

అంతర్జాతీయస్థాయి గుర్తింపు పొందిన ఇగ్నో నుంచి ఎంబీఏ కోర్సుకు నోటిఫికేషన్‌ వెలువడింది. ఈ కోర్సు పూర్తి చేసి పీజీ పట్టా అందుకుంటే మెరుగైన ఉద్యోగావకాశాలను పొందవచ్చు. ఉన్నతస్థాయికి చేరుకోవచ్చు.
ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రాం (ఎంబీఏ)లో ప్రవేశానికి ప్రకటనను వెలువరించింది. ఓపెన్‌ మ్యాట్‌ పరీక్షలో అర్హత సాధిస్తే ఈ కోర్సులో చేరవచ్చు.
కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైనవారు ఓపెన్‌మ్యాట్‌ ద్వారా ఇగ్నో ఎంబీఏ కోర్సులో చేరటానికి వీలుంటుంది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 45 శాతం మార్కులు చాలు. ఓపెన్‌ మ్యాట్‌లో అర్హత పొందిన తర్వాత అభ్యర్థులు ఇగ్నో వెబ్‌సైట్‌ (www.ignou.ac.in) లోని ఈ-ప్రాస్పెక్టస్‌లో ఉన్న నిర్దిష్ట పత్రం ద్వారా ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలి. కోర్సు ఆంగ్ల మాధ్యమంలో ఉంటుంది. వ్యవధి రెండేళ్లు. గరిష్ఠంగా అయిదు సంవత్సరాల్లోపు పూర్తిచేయాలి.
ఓపెన్‌ మ్యాట్‌ను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ నిర్వహిస్తోంది. దీనిలో మొత్తం 200 ప్రశ్నలుంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. రుణాత్మక మార్కులు లేవు. పరీక్ష వ్యవధి 3 గంటలు.
నాలుగు విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. జనరల్‌ అవేర్‌నెస్‌లో 30, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌లో 50, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌లో 50, రీజనింగ్‌లో 70 ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష, ప్రశ్నల స్థాయిపై అవగాహన కోసం ఆన్‌లైన్‌లో నమూనా టెస్టు రాసుకోవచ్చు.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 23, 2020.
ఫీజు: ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌లకు రూ.600, మిగిలిన అందరికీ రూ.800.
పరీక్ష తేదీ: ఏప్రిల్‌ 29 (ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు)
పరీక్ష కేంద్రాలు: ఆంధ్రప్రదేశ్‌లో చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. తెలంగాణలో హైదరాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌.

https://ignouexams.nta.nic.in


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని