తేజ్‌పూర్‌ సెంట్రల్‌ వర్సిటీలో ఇంటిగ్రేటెడ్‌ కోర్సులు

ఇంటర్‌ విద్యార్థుల కోసం బీటెక్‌తోపాటు పలు ఇంటిగ్రేటెడ్‌ కోర్సులను; డిగ్రీ అభ్యర్థుల కోసం వివిధ పీజీలను...

Published : 12 Mar 2020 00:41 IST

ఇంటర్‌ విద్యార్థుల కోసం బీటెక్‌తోపాటు పలు ఇంటిగ్రేటెడ్‌ కోర్సులను; డిగ్రీ అభ్యర్థుల కోసం వివిధ పీజీలను తేజ్‌పూర్‌ విశ్వవిద్యాలయం నిర్వహిస్తోంది. ఈ సెంట్రల్‌ యూనివర్సిటీలో చదువుకోడానికి విదేశాల నుంచీ విద్యార్థులు వస్తుంటారు. నాణ్యమైన విద్యతోపాటు హాస్టళ్లు, ఇతర సౌకర్యాలనూ అందించే ఈ సంస్థ కొన్ని కోర్సుల్లో ప్రవేశాలకు ప్రకటన విడుదల చేసింది.

కేంద్రీయ సంస్థల్లో ఒకటైన తేజ్‌పూర్‌ విశ్వవిద్యాలయం ఇంటర్‌ విద్యార్థుల కోసం బీటెక్‌, ఇంటిగ్రేటెడ్‌ బీఎడ్‌, ఎమ్మెస్సీ, ఎంఏ, ఎంకాం కోర్సులను అందిస్తోంది. యూజీ పూర్తిచేసుకున్న వారికి ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంబీఏ, ఎంసీఏ తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రవేశానికి ప్రకటన విడుదల చేసింది. పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా అవకాశం కల్పిస్తారు.

ఇవీ కోర్సులు

బీటెక్‌: సివిల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, కంప్యూటర్‌ సైన్స్‌, ఫుడ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ, మెకానికల్‌ ఇంజినీరింగ్‌. ప్రవేశం: జేఈఈ స్కోరు ఆధారంగా.

ఇంటిగ్రేటెడ్‌ బీఎస్సీ బీఎడ్‌: మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ.

ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ: మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, లైఫ్‌ సైన్సెస్‌.

అర్హత: పై రెండు ఇంటిగ్రేటెడ్‌ కోర్సులకు ఇంటర్‌ ఎంపీసీ గ్రూప్‌ను 60 శాతం మార్కులతో పూర్తిచేసుకున్నవారు దరఖాస్తు చేసుకోవచ్ఛు లైఫ్‌ సైన్సెస్‌ కోర్సులకు బైపీసీ, ఎంపీసీ రెండు గ్రూపులవారూ అర్హులే.

ఇంటిగ్రేటెడ్‌ కోర్సులు: ఎంఏ ఇంగ్లిష్‌, ఎంకాం. అర్హత: 60 శాతం మార్కులతో ఇంటర్‌ ఉత్తీర్ణత

ఎమ్మెస్సీ: మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, లైఫ్‌ సైన్సెస్‌, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌, మాలిక్యులర్‌ బయాలజీ, బయో టెక్నాలజీ.

ఎంఏ: సోషియాలజీ, కల్చరల్‌ స్టడీస్‌, ఇంగ్లిష్‌, హిందీ, సోషల్‌ వర్క్‌, మాస్‌ కమ్యూనికేషన్‌ అండ్‌ జర్నలిజం, అస్సామీ.

మాస్టర్‌ ఆఫ్‌ టూరిజం అండ్‌ ట్రావెల్‌ మేనేజ్‌మెంట్‌, లింగ్విస్టిక్స్‌ అండ్‌ లాంగ్వేజ్‌ టెక్నాలజీ, ఎడ్యుకేషన్‌, కమ్యూనికేషన్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌, ఎంబీఏ, ఎంసీఏ, ఎల్‌ఎల్‌ఎం, బీఎడ్‌, పీజీ డిప్లొమా.

అర్హత: సంబంధిత విభాగాల్లో 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత. వీటిలో జనరల్‌ కోర్సులకు ఏదైనా డిగ్రీ అర్హతతో దరఖాస్తు చేసుకోవచ్ఛు

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్‌ 7

దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.400. మిగిలిన అందరికీ రూ.800

పరీక్ష: మే 29 నుంచి 31 వరకు నిర్వహిస్తారు.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రం: హైదరాబాద్‌.

వెబ్‌సైట్‌: https://www.tezuadmissions.in/public/

పరీక్ష విధానం

పరీక్ష వ్యవధి 2 గంటలు. దరఖాస్తు చేసుకున్న కోర్సును బట్టి పరీక్ష విధానంలో మార్పు ఉంటుంది. కొన్ని కోర్సులకు నిర్వహించే పరీక్షలకు ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ తరహాలో ఇస్తారు. వీటిని 4 సెక్షన్లుగా విభజించి అడుగుతారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. తప్పుగా గుర్తించిన సమాధానానికి పావు మార్కు తగ్గిస్తారు. హ్యుమానిటీస్‌, సోషల్‌ సైన్సెస్‌ విభాగాలకు చెందిన కోర్సులకు 40 ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలతో, 60 మార్కులకు డిస్క్రిప్టివ్‌ ప్రశ్నలతో పరీక్ష నిర్వహిస్తారు.

ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ, ఇంటిగ్రేటెడ్‌ బీఎడ్‌ కోర్సులకు ఉమ్మడి పరీక్ష నిర్వహిస్తారు. ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ కోర్సుల్లో చేరినవారు కావాలంటే మూడేళ్ల తర్వాత వైదొలగవచ్ఛు అప్పుడు వీరికి బీఎస్సీ డిగ్రీని ప్రదానం చేస్తారు. వివిధ విభాగాల్లో ఎంటెక్‌ కోర్సులు అందిస్తున్నారు. గేట్‌ స్కోరుతో వాటిలోకి ప్రవేశం లభిస్తుంది. ఎంబీఏ అడ్మిషన్‌ పొందాలంటే క్యాట్‌, మ్యాట్‌, సీమ్యాట్‌, ఎక్స్‌ఏటీ తదితర పరీక్షల్లో ఏదో ఒకదాని స్కోర్‌ పొంది ఉండాలి. పీహెచ్‌డీ కోర్సుల్లోకి నెట్‌ స్కోర్‌ లేదా యూనివర్సిటీ నిర్వహించే పరీక్షతో ప్రవేశాలుంటాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని