ప్రేమ్‌జీ వర్సిటీలో డిగ్రీ.. డ్యూయల్‌ డిగ్రీలు

ఉన్నత విద్యాప్రమాణాల పరంగా ప్రసిద్ధి చెందిన అజీమ్‌ ప్రేమ్‌జీ యూనివర్సిటీ (బెంగళూరు) వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రకటన విడుదల చేసింది. మూడు రకాల డిగ్రీలు ఇందులో ఉన్నాయి. ప్రవేశపరీక్ష, వ్యక్తిగత ఇంటర్వ్యూల ద్వారా అడ్మిషన్లు ఇస్తారు. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.

Published : 17 Mar 2020 01:52 IST

ప్రవేశాలకు ప్రకటన విడుదల

ఉన్నత విద్యాప్రమాణాల పరంగా ప్రసిద్ధి చెందిన అజీమ్‌ ప్రేమ్‌జీ యూనివర్సిటీ (బెంగళూరు) వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రకటన విడుదల చేసింది. మూడు రకాల డిగ్రీలు ఇందులో ఉన్నాయి. ప్రవేశపరీక్ష, వ్యక్తిగత ఇంటర్వ్యూల ద్వారా అడ్మిషన్లు ఇస్తారు. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.
ఉపాధి కల్పనకు తోడ్పడటం మాత్రమే ధ్యేయం కాకుండా వృత్తిపరంగా, వ్యక్తిగతంగా, సామాజికంగా ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొని నిలిచే మేటి మానవ వనరులను తయారుచేయటం అజీమ్‌ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయ లక్ష్యం. ఈ ఆశయంతో నిర్వహించే కోర్సులకు ఈ యూనివర్సిటీ రెండు రకాలుగా ప్రవేశాలను కల్పిస్తోంది. మొదటిది అర్లీ అడ్మిషన్స్‌ (సెప్టెంబరు- డిసెంబరు), రెండోది రెగ్యులర్‌ అడ్మిషన్స్‌ (జనవరి-  ఏప్రిల్‌).
తాజాగా రెగ్యులర్‌ అడ్మిషన్ల ద్వారా మూడేళ్ల బీఎస్‌సీ, బీఏ డిగ్రీలు, నాలుగేళ్ల బీఎస్‌సీ బీఈడీ డ్యూయల్‌ డిగ్రీ పోగ్రామ్‌ల్లోకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. కోర్సులన్నీ ఆంగ్లమాధ్యమంలోనే ఉంటాయి. ఈ ప్రోగ్రామ్‌ల ద్వారా పొందిన విద్యానుభవం పనిపరంగానూ, సమాజంలో ఉత్తమ పౌరుడిగా మెలగడానికీ తోడ్పడుతుందని సంస్థ చెబుతోంది.
మూడేళ్ల కోర్సులు: ఫుల్‌టైం రెసిడెన్షియల్‌ ప్రోగ్రామ్‌లు. క్రెడిట్‌ విధానం ఉంటుంది. మొత్తం క్రెడిట్లు 84. వీటిలో స్పెషలైజేషన్‌కు 48, కామన్‌ కరిక్యులమ్‌కు 36 చొప్పున కేటాయించారు. బీఎస్‌సీలో ఫిజిక్స్‌, బయాలజీ, మేథమేటిక్స్‌; బీఏ డిగ్రీలో ఎకనామిక్స్‌, హ్యుమానిటీస్‌ స్పెషలైజేషన్లున్నాయి. ఆనర్స్‌ డిగ్రీలో రిసెర్చ్‌ అవకాశం ఉంది. దీనికి అదనంగా 12 క్రెడిట్లు ఉంటాయి.
డ్యూయల్‌ డిగ్రీ ప్రోగ్రామ్‌: నాలుగేళ్ల బీఎస్‌సీ బీఈడీ ప్రోగ్రామ్‌. ఫుల్‌టైం రెసిడెన్షియల్‌ ప్రోగ్రామ్‌. క్రెడిట్‌ విధానం (120 క్రెడిట్లు) ఉంది. స్పెషలైజేషన్‌- ఫిజికల్‌ సైన్సెస్‌, లైఫ్‌సైన్సెస్‌, మేథమేటిక్స్‌లో ఏదో ఒకదాన్ని ఎంచుకోవచ్చు. దీనికి 53 క్రెడిట్లు. ఎడ్యుకేషన్‌కు 52, కామన్‌ కరిక్యులమ్‌కు 15 క్రెడిట్లు కేటాయించారు.
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్మీడియట్‌/ ప్రీ-యూనివర్సిటీ లేదా తత్సమాన విద్య పూర్తిచేసినవారు అర్హులు. పన్నెండో తరగతిలో కనీసం 50% మార్కులు సాధించి ఉండాలి. ఈ విద్యాసంవత్సరానికిగానూ తుది పరీక్షలు రాస్తున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 19కి మించకూడదు. శాట్‌, కేవీపీవై, ఇతర నేషనల్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ల స్కోరులనూ అడ్మిషన్‌ కోసం పరిగణనలోకి తీసుకుంటారు.
ఎంపిక: ప్రవేశపరీక్ష (నేషనల్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌), వ్యక్తిగత ఇంటర్వ్యూల ఆధారంగా అడ్మిషన్లు ఇస్తారు. ప్రవేశపరీక్షలో రెండు విభాగాలుంటాయి. కాలవ్యవధి మూడు గంటలు. తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు విశాఖపట్నం, హైదరాబాద్‌.
దరఖాస్తు: ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ రెండు విధానాల్లోనూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేవారు వెబ్‌సైట్‌ (https://azimpremjiuniversity.edu.in/z లో ఈ-మెయిల్‌ ఐడీ, మొబైల్‌ నంబరు, పుట్టిన తేదీల ఆధారంగా నమోదు చేసుకోవాలి. ఆఫ్‌లైన్‌లో అయితే దరఖాస్తు ఫారం కోసం ugadmissions@apu.edu.in చూడ వచ్చు. దరఖాస్తు ఫీజు రూ.500. ఆన్‌లైన్‌/ డీడీ ద్వారా చెల్లించవచ్చు.
దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీ: మార్చి 26, 2020. ప్రవేశపరీక్ష తేదీ: ఏప్రిల్‌ 12, 2020.
ఒకటికి మించి కోర్సులకు దరఖాస్తు చేసుకునే వీలు ఉంది. అందుకు ప్రత్యేకంగా ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని