Updated : 23 Dec 2022 16:51 IST

పీజీ ప్రోగ్రామ్‌ల్లోకి సంస్కృత వర్సిటీ ఆహ్వానం

సంస్కృత భాష అభివృద్ధికి దేశవ్యాప్తంగా కృషి చేస్తున్న సంస్థల్లో శ్రీ శంకరాచార్య సంస్కృత యూనివర్సిటీ ఒకటి. ఆ కృషిలో భాగంగా ఆ భాషకు సంబంధించిన వివిధ విభాగాలకు పీజీ కోర్సులను నిర్వహిస్తోంది. వాటితోపాటు ఇతర ప్రోగ్రామ్‌ల్లో ప్రవేశాలకూ ప్రస్తుతం ప్రకటన వెలువడింది.

సంస్కృత భాషతోపాటు ఇతర భాషలనూ, సోషల్‌సైన్సెస్‌, ఫైన్‌ ఆర్ట్స్‌ విభాగాలనూ అభివృద్ధి చేసే లక్ష్యంతో శ్రీ శంకరాచార్య సంస్కృత యూనివర్సిటీని కేరళలో ఎర్నాకుళం జిల్లాలోని కాలాడిలో ఏర్పాటు చేశారు. ఎనిమిది క్యాంపస్‌లతో ఆ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల వరకు విస్తరించిన ఈ యూనివర్సిటీ వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. తగిన విద్యార్హతలు ఉన్నవారు ఎవరైనా వీటికి అప్లై చేసుకోవచ్చు.

ఏయే కోర్సులు?
ఎంఏ: సంస్కృత సాహిత్య, సంస్కృత వేదాంత, సంస్కృత వ్యాకరణ, సంస్కృత న్యాయ, సంస్కృత జనరల్‌, వేదిక్‌ స్టడీస్‌ అండ్‌ సోషియాలజీ, ఫిలాసఫీ, మ్యూజిక్‌, భరతనాట్యం, మోహినీయాట్టం, థియేటర్‌ తదితరాలు.
ఎంఎస్‌సీ: సైకాలజీ అండ్‌ జాగ్రఫీ; మాస్టర్‌ ఆఫ్‌ సోషల్‌ వర్క్‌ (ఎంఎస్‌డబ్ల్యూ), మాస్టర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ (విజువల్‌ ఆర్ట్స్‌), పీజీ డిప్లొమా ఇన్‌ ట్రాన్స్‌లేషన్‌ అండ్‌ ఆఫీస్‌ ప్రొసీడింగ్స్‌ ఇన్‌ హిందీ.
అర్హతలు: ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంఎస్‌డబ్ల్యూ కోర్సుల్లో చేరడానికి 10+2+3 పద్ధతిలో ఏదైనా డిగ్రీ రెగ్యులర్‌ లేదా దూరవిద్యలో పూర్తిచేసిన వారు అర్హులు. చివరి సంవత్సరం చదువుతూ ఏప్రిల్‌, 2020లో పరీక్ష రాయబోతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంఎఫ్‌ఏకి దరఖాస్తు చేసుకోవాలంటే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఫైన్‌ ఆర్ట్స్‌లో డిగ్రీని 55 శాతం మార్కులతో పూర్తిచేసి ఉండాలి. పీజీ డిప్లొమా ఇన్‌ ట్రాన్స్‌లేషన్‌ అండ్‌ ఆఫీస్‌ ప్రొసీడింగ్స్‌ ఇన్‌ హిందీ కోర్సులో చేరడానికి ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. పీజీ డిప్లొమా ఇన్‌ వెల్‌నెస్‌ అండ్‌ స్పా మేనేజ్‌మెంట్‌కి దరఖాస్తు చేసుకోవాలంటే బీఏఎంఎస్‌ (బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆయుర్వేదిక్‌ మెడిసిన్‌ అండ్‌ సర్జరీ) డిగ్రీని పొంది ఉండాలి.

దరఖాస్తు ఎలా?
అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఎంఏ, ఎమ్మెస్సీ, పీజీ డిప్లొమా కోర్సులకు రూ. 150, ఎంఎఫ్‌ఏ, ఎంఎస్‌డబ్ల్యూలకు రూ. 300 ఫీజు చెల్లించాలి. ఒకటి కంటే ఎక్కువ కోర్సులకు అప్లై చేయాలంటే వేర్వేరుగా  దరఖాస్తు చేయాలి. ఫీజు కట్టాలి.

ఎంపిక విధానం
వివిధ కోర్సుల్లోకి అడ్మిషన్‌ కోరుతున్న అర్హులైన అభ్యర్థులందరూ ఎంట్రన్స్‌ టెస్ట్‌, ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ లేదా ఇంటర్వ్యూలకు హాజరుకావాలి. ఒక క్యాంపస్‌లో కనీసం అయిదు అడ్మిషన్లు ఉంటేనే సంస్కృతంలో పీజీ కోర్సులు, పదిమందికి తగ్గకుండా చేరితేనే సంస్కృతేతర పీజీ కోర్సులను నిర్వహిస్తారు. అంతకంటే తక్కువ మంది చేరితే దగ్గర్లోని మరో క్యాంపస్‌ను వారికి కేటాయిస్తారు. ప్రతి కోర్సుకీ ప్రత్యేక ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ ఉంటాయి.
పీజీ ప్రోగ్రామ్‌లకు ప్రవేశపరీక్షను వాటిని అందిస్తున్న క్యాంపస్‌ల్లోనే నిర్వహిస్తారు. పీజీ డిప్లొమా ఇన్‌ ట్రాన్స్‌లేషన్‌ అండ్‌ ఆఫీస్‌ ప్రొసీడింగ్స్‌ ఇన్‌ హిందీ కోర్సుకు ప్రవేశపరీక్షను కాలాడి, ఎట్టుమనూర్‌ (కొట్టాయం జిల్లా)ల్లో జరుపుతారు. పీజీ డిప్లొమా ఇన్‌ వెల్‌నెస్‌ అండ్‌ స్పా మేనేజ్‌మెంట్‌కు పరీక్ష ఎట్టుమనూర్‌లో మాత్రమే ఉంటుంది.


ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ:  ఏప్రిల్‌ 3, 2020.
దరఖాస్తుల ప్రింట్‌ కాపీని పంపడానికి చివరి తేదీ:  ఏప్రిల్‌ 13, 2020.

వెబ్‌సైట్‌:  www.ssus.ac.in/www.ssusonline.org


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని