ఐఐటీ సీటుకు ఐఐటీ పాఠాలు

కరోనా అన్ని రంగాలతోపాటు విద్యావ్యవస్థపైనా విపరీతమైన ప్రభావాన్ని చూపుతోంది. ఈ నేపథ్యంలో జేఈఈకి సిద్ధమవుతున్న విద్యార్థులకు...

Published : 02 Apr 2020 01:15 IST

ఆన్‌లైన్‌లో అందరికీ ఉచితం

కరోనా అన్ని రంగాలతోపాటు విద్యావ్యవస్థపైనా విపరీతమైన ప్రభావాన్ని చూపుతోంది. ఈ నేపథ్యంలో జేఈఈకి సిద్ధమవుతున్న విద్యార్థులకు అండగా ఉండేందుకు ఐఐటీ ఖరగ్‌పూర్‌ పాఠాలను సిద్ధం చేసింది. ఇళ్లలోనే ఉండి ప్రిపేర్‌ అయ్యేవారికి ఇవి చాలా ఉపయోకరంగా ఉన్నాయి.

రోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో జేఈఈ మెయిన్‌ పరీక్షలు వాయిదా పడ్డాయి. అడ్వాన్స్‌డ్‌ పరీక్ష తేదీ కూడా మారే అవకాశాలు ఉన్నాయి. కొద్ది రోజుల్లో పరీక్షలకు హాజరుకావాల్సిన అభ్యర్థుల ప్రిపరేషన్‌ కుంటుపడకుండా సాయపడేందుకు ఐఐటీ ఖరగ్‌పూర్‌ ఆన్‌లైన్‌లో జేఈఈ పాఠాలను అందుబాటులోకి తెచ్చింది. నేషనల్‌ డిజిటల్‌ లైబ్రరీ ఆఫ్‌ ఇండియా ప్లాట్‌ఫాంపై జేఈఈ మాడ్యూల్స్‌, నోట్స్‌ను ఉచితంగా అందిస్తోంది. విద్యార్థులు తమ అధ్యయనాన్ని కొనసాగించడానికి ఈ సమాచారం ఉపయోగపడుతుంది. కొవిడ్‌-19 లాక్‌డౌన్‌ వల్ల ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని భారత ప్రభుత్వం విద్యార్థులకు సూచించింది. ఎన్‌డీఎల్‌ఐ వెబ్‌సైట్‌ లేదా మొబైల్‌ యాప్‌ ద్వారా ఈ సేవలను పొందవచ్చు. ‘కరోనా అవుట్‌బ్రేక్‌ - స్టడీ ఫ్రమ్‌ హోమ్‌’ పేరుతో ప్రత్యేకంగా రూపొందించిన వెబ్‌ పేజీలో ఈ లింకులు అందుబాటులో ఉన్నాయి. మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు, సొల్యూషన్లతో పాటు అంశాల వారీగా వీడియో లెక్చర్లూ ఉన్నాయి. 12 సంవత్సరాల జేఈఈ అడ్వాన్స్‌డ్‌ సాల్వ్‌డ్‌ పేపర్లనూ అభ్యర్థులు తమ ప్రిపరేషన్‌కు ఉపయోగించుకోవచ్చు. ఎలాంటి పరిమితులు లేవు. విద్యార్థులు ఎప్పుడైనా, ఎంతసమయమైనా ఆన్‌లైన్‌లో ఉచితంగా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు.
వెబ్‌సైట్‌: https://ndl.iitkgp.ac.in/ లేదా https://www.ndl.gov.in/


సబ్జెక్టు నిపుణులు, డాక్టోరల్‌ విద్యార్థులు తదితరులు జేఈఈ ప్రశ్నలకు ఆన్‌లైన్‌లో సొల్యూషన్లను అందించారు. అభ్యర్థులు తమకు అనుకూలమైన మెథడ్స్‌ను అనుసరించవచ్చు. వాటితోపాటు రిఫరెన్స్‌ మెటీరియల్‌ కూడా అందుబాటులో ఉంది. ఇతర టాపిక్‌ల అధ్యయనానికి ఆ సమాచారాన్ని  వినియోగించుకోవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని