ఉచితంగా ఏఐ కోర్సు!

లాక్‌డౌన్‌ సమయంలో అదనపు నైపుణ్యాలపై దృష్టిపెట్టాలనుకుంటున్నారా? అయితే నాస్కామ్‌ ఒక అవకాశాన్ని అందిస్తోంది. ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ (ఏఐ) ఫౌండేషన్‌ కోర్సును అందుబాటులోకి తెచ్చింది. మే 15 వరకూ ఇది ఉచితంగా అందుబాటులో ఉంటుంది.

Updated : 13 Apr 2020 01:17 IST

నాస్కామ్‌ ఫ్యూచర్‌ స్కిల్స్‌ ద్వారా..

ఆసక్తి ఉన్న ఎవరైనా అర్హులే

లాక్‌డౌన్‌ సమయంలో అదనపు నైపుణ్యాలపై దృష్టిపెట్టాలనుకుంటున్నారా? అయితే నాస్కామ్‌ ఒక అవకాశాన్ని అందిస్తోంది. ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ (ఏఐ) ఫౌండేషన్‌ కోర్సును అందుబాటులోకి తెచ్చింది. మే 15 వరకూ ఇది ఉచితంగా అందుబాటులో ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకుని, నైపుణ్యాలను అందుకోవచ్ఛు.

సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కార్లు, ఫేషియల్‌ రికగ్నిషన్‌, వెబ్‌ సెర్చ్‌, మిసైల్‌ గైడెన్స్‌, ట్యూమర్‌ డిటెక్షన్‌.. వంటి ఎన్నో నిజజీవిత సమస్యలకు ఏఐ పరిష్కారం చూపింది. ఎంతో వేగంగానూ అభివృద్ధి చెందుతోంది. అందుకే అన్ని రంగాల్లో దీనికి ప్రాధాన్యం పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ సాఫ్ట్‌వేర్‌ అండ్‌ సర్వీస్‌ కంపెనీస్‌ (నాస్కామ్‌) దీనిపై ఆసక్తి ఉన్నవారికి ఉచిత కోర్సును అందుబాటులోకి తెచ్చింది. లాభాపేక్ష లేని ఈ సంస్థ ఇండియన్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ), బిజినెస్‌ ప్రాసెస్‌ అవుట్‌ సోర్సింగ్‌ (బీపీఓ)కు మధ్య ట్రేడ్‌ అసోసియేషన్‌గా పనిచేస్తోంది. ఈ లాక్‌డౌన్‌ సమయాన్ని ఫలవంతంగా ఉపయోగించుకోవాలనుకునేవారికి ఉచితంగా ఏఐ కోర్సును అందుబాటులోకి తెచ్చింది. దేశంలోని వ్యక్తులను ఏఐకు సంసిద్ధులను చేయాలనే ఉద్దేశం కూడా ఇందులో ఉంది.

ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖ; ఐటీ పరిశ్రమకు చెందిన నాస్కామ్‌.. ‘ఫ్యూచర్‌ స్కిల్స్‌’ ద్వారా సంయుక్తంగా దీనిని అందిస్తున్నాయి. మే 15 వరకు ప్రతిఒక్కరికీ ఇది ఉచితంగా అందుబాటులో ఉంటుంది.

ప్రోగ్రామ్‌ ద్వారా ప్రాథమికాంశాలు, అప్లికేషన్స్‌ మొదలైనవాటిని అందిస్తారు. ఏఐ పూర్వాపరాలు, దానితో సంబంధమున్న డేటాబేస్‌లు, స్టాటిస్టిక్స్‌, పైథాన్‌ మొదలైనవాటినీ తెలుసుకుంటారు. ప్రోగ్రామ్‌లో 6 కోర్సులుంటాయి. థియరీ, ప్రాక్టికల్‌ రెండు అంశాలూ దీనిలో భాగంగా ఉంటాయి.


ఏఐ ప్రోగ్రామ్‌ కోర్సులు ఇవీ

ఇంట్రడక్షన్‌ టూ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌: ఏఐ ప్రాథమికాంశాలు ఇందులో భాగంగా ఉంటాయి. ఎవల్యూషన్‌ ఆఫ్‌ ఏఐ; డిఫరెన్స్‌ బిట్వీన్‌ నారో, జనరల్‌, సూపర్‌ ఏఐ; ఆపర్చ్యునిటీస్‌ ఇన్‌ ఏఐ ఫర్‌ ఇండివిడ్యువల్స్‌ అండ్‌ ఆర్గనైజేషన్స్‌ తోపాటు డేటాబేస్‌ కాన్సెప్టులు- ఎస్‌క్యూఎల్‌ డేటాబేసెస్‌, ఎన్‌ఓఎస్‌క్యూఎల్‌ డేటాబేసెస్‌ ఉంటాయి.

ఎస్‌క్యూఎల్‌ అండ్‌ రిలేషనల్‌ డేటాబేసెస్‌: ఇన్ఫర్మేషన్‌ అండ్‌ డేటా మోడల్స్‌, టైప్స్‌ ఆఫ్‌ రిలేషన్‌షిప్స్‌, మాపింగ్‌ ఎంటైటిల్స్‌ టు టేబుల్స్‌, రిలేషనల్‌ మోడల్‌ కాన్సెప్ట్స్‌తోపాటు రిలేషనల్‌ మోడల్‌ కన్‌స్ట్రయిన్స్‌ అండ్‌ డేటా ఆబ్జెక్టివ్స్‌ ఇంట్రడక్షన్‌, అడ్వాన్స్‌డ్‌ ఫీచర్స్‌ గురించి తెలుసుకుంటారు.

పైథాన్‌ ఫర్‌ డేటా సైన్స్‌: పైథాన్‌ బేసిక్స్‌, పైథాన్‌ డేటా స్ట్రక్చర్స్‌, పైథాన్‌ ప్రోగ్రామింగ్‌ ఫండమెంటల్స్‌ ఉంటాయి.

అల్గారిథమ్స్‌: సార్టింగ్‌ అల్గారిథమ్స్‌, సెర్చింగ్‌ అల్గారిథమ్స్‌, జామెట్రీ అండ్‌ గ్రాఫింగ్‌ అల్గారిథమ్స్‌ దీనిలో భాగం.

స్టాటిస్టిక్స్‌: డిస్క్రిప్టివ్‌ స్టాటిస్టిక్స్‌, అడ్వాన్స్‌డ్‌ డిస్క్రిప్టివ్‌ స్టాటిస్టిక్స్‌, విజువలైజేషన్‌, బ్యూటిఫికేషన్‌ టెక్నిక్‌లు ఉంటాయి.

డేటా విజువలైజేషన్‌ విత్‌ పైథాన్‌: విజువలైజేషన్‌ టూల్స్‌ ఇంట్రడక్షన్‌, స్పెషలైజ్‌డ్‌ విజువలైజేషన్‌ టూల్స్‌, అడ్వాన్స్‌డ్‌ విజువలైజేషన్‌ టూల్స్‌, క్రియేటింగ్‌ మ్యాప్స్‌ అండ్‌ జియోస్పాటికల్‌ డేటాలను నేర్చుకుంటారు.

ఆసక్తి ఉన్నవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీనిలో చేరటానికి ప్రత్యేక అర్హతలేమీ అవసరం లేదు. టెక్నాలజీపై ఆసక్తి ఉన్న విద్యార్థులు, ప్రొఫెషనల్స్‌ ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్ఛు

పూర్తి వివరాలకు https://fslearning.nasscom.in/ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్ఛు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని