యూట్యూబ్‌ పాఠాలు

సుప్రసిద్ధ సంస్థ గూగుల్‌ ఇండియా యూట్యూబ్‌ను వివిధ అంశాలను సమగ్రంగా అభ్యసించడానికి వేదికగా ...

Published : 20 Apr 2020 00:37 IST

సుప్రసిద్ధ సంస్థ గూగుల్‌ ఇండియా యూట్యూబ్‌ను వివిధ అంశాలను సమగ్రంగా అభ్యసించడానికి వేదికగా మలచుకోమంటోంది. అంతే కాదు; నేర్చుకోవడానికి వీలుగా ఎన్నో వీడియోలను అందుబాటులోకి తెచ్చింది. తల్లిదండ్రులు, విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులూ వీటిని ఉపయోగించుకోవచ్చు.

నేర్చుకోవాలన్న ఆసక్తి ఉన్నవారికోసం గూగుల్‌ సంస్థ. యూట్యూబ్‌లో ఒక కొత్త ఫీచర్‌ను ప్రారంభించింది. అదే- ‘యూట్యూబ్‌ లర్నింగ్‌ డెస్టినేషన్‌’. లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికి పరిమితమైనవారి కోసం దీనిని ప్రవేశపెట్టింది. నేర్చుకోవడానికే కాకుండా బోధనకూ ఉపయోగపడాలనే ఉద్దేశంతో దీనిని ప్రారంభించింది. దీనిలో కరిక్యులమ్‌ అంశాలతోపాటు ఆసక్తి ఆధారిత అంశాలకూ ప్రాధాన్యమిచ్చింది. దీనిని డెస్క్‌టాప్‌తోపాటు మొబైల్‌లోనూ ఉపయోగించుకునేలా రూపొందించారు.

వీడియోలు ప్రస్తుతానికి ఇంగ్లిష్‌, హిందీ భాషల్లో అందుబాటులో ఉన్నాయి. తరువాత తెలుగు, తమిళ, బెంగాలీ, మరాఠీ, ఇతర స్థానిక భాషల్లోనూ అందించనున్నారు. కరిక్యులమ్‌ పరంగా.. ఫిజిక్స్‌, మ్యాథ్స్‌, బయాలజీ, టాక్సానమీ అంశాలు అందుబాటులో ఉన్నాయి. వీటిని నిజజీవిత ఉదాహరణలతోపాటుగా, సులువుగా అర్థమయ్యేలా అందిస్తున్నారు. కరిక్యులమ్‌ అంశాలన్నీ కేటగిరీలవారీగా విభజించి ఉంటాయి. విద్యార్థి తనకు నచ్చిన సబ్జెక్టునూ, దానిలోని అంశాన్నీ ఎంచుకునే వీలుంది.

స్టడీ టిప్స్‌, రైటింగ్‌ ట్రిక్స్‌నూ జోడించారు. ఇవేకాకుండా కొత్తగా వేరే అంశాలను నేర్చుకోవాలనుకునేవారికి ఇతర నైపుణ్యాలు- ఫొటోగ్రఫీ, యోగా, మ్యూజిక్‌, గార్డెనింగ్‌ వంటివీ అందుబాటులో ఉన్నాయి. లర్న్‌ బై డూయింగ్‌, ఇంగ్లిష్‌ వర్క్‌ప్లేస్‌ కాన్‌వర్‌సేషన్స్‌, విదేశీ భాషలకూ ప్రాధాన్యమిచ్చారు. ఆసక్తి ఉన్నవారు ప్రయత్నించవచ్ఛు ఇతర వివరాలకు- www.youtube.com/learning వెబ్‌సైట్‌ లింకును సందర్శించవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని