ఉచితంగా టెక్నాలజీలు

డేటాసైన్స్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ (ఏఐ), మెషిన్‌ లర్నింగ్‌.. ప్రస్తుతం బాగా ఆదరణ ఉన్న విభాగాలు....

Published : 20 Apr 2020 00:38 IST

డేటాసైన్స్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ (ఏఐ), మెషిన్‌ లర్నింగ్‌.. ప్రస్తుతం బాగా ఆదరణ ఉన్న విభాగాలు. ఉచితంగా వీటిని అభ్యసించే అవకాశం ఆన్‌లైన్‌ సంస్థ గ్రేట్‌ లర్నింగ్‌ అందిస్తోంది. ప్రారంభం నుంచి అడ్వాన్స్‌డ్‌ దశ వరకూ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

రిశ్రమ ఏదన్నదానితో నిమిత్తం లేకుండా సాంకేతికత వినియోగం బహుముఖంగా విస్తరిస్తోంది. ఏఐ, డేటాసైన్స్‌ వంటి అధునాతన టెక్నాలజీలకు ప్రాధాన్యం పెరుగుతోంది. అందుకే విద్యార్థులందరూ వీటిపై దృష్టి సారిస్తున్నారు. కానీ ఒక్కోదాన్ని నేర్చుకోవడానికి చాలా డబ్బు అవసరమవుతుంది. ఆసక్తి ఉండీ, అవకాశం లేనివారికి ప్రముఖ ఆన్‌లైన్‌ క్లాస్‌రూమ్‌- గ్రేట్‌ లర్నింగ్‌ అకాడమీ సాయమందిస్తోంది. విద్యార్థులతోపాటు వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌ కూడా ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్ఛు

300 గంటల వ్యవధి గల 40కు పైగా కోర్సులు ఇందులో అందుబాటులో ఉన్నాయి. కోర్సులన్నీ రియల్‌ వర్‌ల్డ్‌ ప్రాజెక్టుల ఆధారంగా రూపొందించినవే. కెరియర్‌ క్రిటికల్‌ స్కిల్స్‌పై దృష్టిసారించేలా ఉంటాయి. డేటా సైన్స్‌, మెషిన్‌ లర్నింగ్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌, క్లౌడ్‌ కంప్యూటింగ్‌, మార్కెటింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌, బిగ్‌ డేటా, కాంప్రహెన్సివ్‌, ఐటీ అండ్‌ సాఫ్ట్‌వేర్‌, ఇండస్ట్రీ కేస్‌స్టడీస్‌, లైవ్‌ మాస్టర్‌ క్లాస్‌ విభాగాలు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో కోర్సును బట్టి బిగినర్‌, ఇంటర్మీడియట్‌, అడ్వాన్స్‌డ్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. కోర్సుల కాలవ్యవధి గంటల్లో ఉంటుంది. సాధారణంగా రెండు నుంచి 15 గంటలవరకూ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

ఒకేసారి ఎన్ని కోర్సులకైనా నమోదు చేసుకునే వీలుంది. అన్నీ సెల్ఫ్‌ పేస్‌డ్‌ ఆన్‌లైన్‌ కోర్సులే. విద్యార్థి తనకు నచ్చిన సమయంలో పూర్తి చేసుకోవచ్ఛు విజయవంతంగా పూర్తిచేసినవారికి సర్టిఫికెట్‌ అందజేస్తారు. పరీక్షలో భాగంగా క్విజ్‌/ అసైన్‌మెంట్లను ఇస్తారు. వాటిని సబ్మిట్‌ చేయగానే ఫలితాలూ వెంటనే వస్తాయి. స్కోరుతోపాటు సరైన సమాధానాలనూ అందిస్తారు. ఫలితాలు అందుకున్న 24 గంటల్లో సర్టిఫికెట్‌ను డాష్‌బోర్డులో అందిస్తారు. కోర్సును పూర్తిచేసిన ప్రతిసారీ సర్టిఫికెట్‌ను పొందొచ్ఛు

ఆసక్తి ఉన్నవారు సంస్థ వెబ్‌సైట్‌.. www.greatlearning.in/academy లో దరఖాస్తు చేసుకోవచ్ఛు ఈ-మెయిల్‌ ఐడీతో సైన్‌ అప్‌ అవ్వాల్సి ఉంటుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని