నిరుద్యోగ యువతకు ఉచిత సాంకేతిక శిక్షణ

నిరుద్యోగ యువతలో నైపుణ్యాల అభివృద్ధి నిమిత్తం రైల్వే మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టిన పథకమే ‘రైల్‌ కౌశల్‌ వికాస్‌ యోజన’. ఈ పథకం కింద ఇప్పటివరకు ఐదు బ్యాచులకు శిక్షణ ఇచ్చారు. ఆరో బ్యాచ్‌ నిమిత్తం దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.

Published : 21 Feb 2022 01:10 IST

నిరుద్యోగ యువతలో నైపుణ్యాల అభివృద్ధి నిమిత్తం రైల్వే మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టిన పథకమే ‘రైల్‌ కౌశల్‌ వికాస్‌ యోజన’. ఈ పథకం కింద ఇప్పటివరకు ఐదు బ్యాచులకు శిక్షణ ఇచ్చారు. ఆరో బ్యాచ్‌ నిమిత్తం దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.

దో తరగతి పాసై.. 18-35 సంవత్సరాల వయసున్నవారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకం కింద ఎంపికైన అభ్యర్థులకు మూడు వారాలపాటు సాంకేతిక శిక్షణను అందిస్తారు. ఈ శిక్షణ పూర్తిగా ఉచితం. పదో తరగతిలో పొందిన మార్కుల ఆధారంగానే అభ్యర్థులను ఎంపికచేస్తారు. ఎలాంటి రిజర్వేషన్లూ వర్తించవు. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్న అభ్యర్థులకు సర్టిఫికెట్లను అందజేస్తారు. ఈ శిక్షణ అభ్యర్థులు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగం సంపాదించడానికి లేదా స్వయంగా ఉపాధి పొందడానికి తోడ్పడుతుంది.

ఏ డాక్యుమెంట్లు: అభ్యర్థుల అర్హత సర్టిఫికెట్లను పరిశీలించన తర్వాత శిక్షణకు ఎంపికచేస్తారు. పదోతరగతి ఒరిజినల్‌ సర్టిఫికెట్‌తోపాటుగా మార్క్‌షీట్‌/ సర్టిఫికెట్లు, ఆధార్‌/ డ్రైవింగ్‌ లైసెన్స్‌/ పాస్‌పోర్ట్‌/ ఓటర్‌ ఐడీ/ ప్రభుత్వం జారీచేసిన ఐడీకార్డ్‌/ కాలేజ్‌/ స్కూల్‌ ఐడీ కార్డ్‌/ రేషన్‌కార్డ్‌... వీటిల్లో ఏదో ఒకటి సమర్పించాల్సి ఉంటుంది. వీటిని పరిశీలించిన తర్వాత అభ్యర్థిని ఎంపికచేస్తారు.

ఏయే విభాగాలు: ఫిట్టర్‌, వెల్డర్‌, ఎలక్ట్రీషియన్‌, మెషినిస్ట్‌... ఈ నాలుగు ట్రేడుల్లో శిక్షణను అందిస్తారు. ఇది థియరీ, ప్రాక్టికల్స్‌ రూపంలో ఉంటుంది. అభ్యర్థి ఒకటికంటే ఎక్కువ ట్రేడ్‌లకు దరఖాస్తు చేయొచ్చు. అయితే ప్రాధాన్యం, అభ్యర్థి సాధించిన మార్కుల ఆధారంగా ఒక్క ట్రేడ్‌లో శిక్షణ ఇవ్వడానికి ఎంపికచేస్తారు. ట్రేడ్ల సంఖ్య పెరిగే అవకాశమూ ఉంది.  

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. అభ్యర్థులు తమ పేరును వెబ్‌సైట్‌లో ఎప్పుడైనా రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. లేదా బ్యాచ్‌ ప్రారంభానికి ముందు ప్రకటన వెలువడినప్పుడు.. నేరుగా లింక్‌లోకి వెళ్లి దరఖాస్తు చేయొచ్చు. సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ పూర్తయిన వారం రోజుల తర్వాత ఎంపికైన అభ్యర్థుల వివరాలను ఈమెయిల్‌ ద్వారా తెలియజేస్తారు.

దరఖాస్తులకు చివరి తేది: 21.02.2022

https://railkvy.indianrailways.gov.in/rkvy_userHome/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని