ఇంటర్న్‌షిప్‌లు 1500 సంస్థల్లో!

కెరియర్‌ ప్రయాణంలో విలువైన భాగం ఇంటర్న్‌షిప్‌. ఈ వేసవి సెలవుల్లో విద్యార్థులకు ప్రముఖ సంస్థల్లో 7,500 ఇంటర్న్‌షిప్‌ అవకాశాలు లభిస్తున్నాయి.

Published : 04 Apr 2022 01:11 IST

రూ. 40 వేల స్టైపెండ్‌

కెరియర్‌ ప్రయాణంలో విలువైన భాగం ఇంటర్న్‌షిప్‌. ఈ వేసవి సెలవుల్లో విద్యార్థులకు ప్రముఖ సంస్థల్లో 7,500 ఇంటర్న్‌షిప్‌ అవకాశాలు లభిస్తున్నాయి.

నియామకాలు, శిక్షణలకు వేదికైన ‘ఇంటర్న్‌శాల’ గ్రాండ్‌ సమ్మర్‌ ఇంటర్న్‌షిప్‌ ఫేర్‌ నిర్వహిస్తోంది. రిలయన్స్‌ రిటైల్‌, ఓయో, కొటాక్‌ మహీంద్రా, దిల్లీ క్యాపిటల్స్‌, మహీంద్రా హాలిడేస్‌, డెకత్లాన్‌, క్రయ్‌, సియట్‌, డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌, మ్యాజిక్‌ బ్రిక్స్‌, ఫ్యాషన్‌ టీవీ, కరాట్‌లేన్‌, పర్పుల్‌, ఐఐటీ దిల్లీ, ఐఐటీ బాంబే, ఐఐఎస్‌సీ మొదలైన 1500 సంస్థలు ఇంటర్న్‌షిప్‌ అవకాశాలు కల్పిస్తున్నాయి.

సీఎస్‌ఐఎఫ్‌-2022 ఇంటర్న్‌షిప్‌కు ఎంపికైన అభ్యర్థులు నెలకు రూ.40,000 వరకు స్టైపెండ్‌ పొందే అవకాశం ఉంది. బిగ్‌ బ్రాండ్‌ ఇంటర్న్‌షిప్‌లు, వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌, షార్ట్‌టర్మ్‌, పార్ట్‌టైమ్‌, ఇన్‌-ఆఫీస్‌, పీపీఓ   ఇంటర్న్‌షిప్‌ మొదలైన రకాలు ఉన్నాయి.

దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 5, 2022

వెబ్‌సైట్‌: https://bit.ly/GSIF-2022


ఈ ఇంటర్న్‌షిప్‌ ఫేర్‌ ద్వారా మార్కెటింగ్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌, వెబ్‌ డెవలప్‌మెంట్‌, పైతాన్‌ డెవలప్‌మెంట్‌, కంటెంట్‌ రైటింగ్‌, సేల్స్‌, హ్యూమన్‌ రిసోర్సెస్‌, బిజినెస్‌ డెవలప్‌మెంట్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌, డేటా ఎనలిటిక్స్‌, ఆపరేషన్స్‌, ప్రొడక్ట్‌ మేనేజ్‌మెంట్‌, గ్రాఫిక్‌ డిజైన్‌, వీడియో ఎడిటింగ్‌, ప్రోగ్రామింగ్‌, ఫైనాన్స్‌ విభాగాల్లో ఇంటర్న్‌షిప్‌ చేయటానికి అవకాశాలున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని