బోటనీ పీజీ తర్వాత..?

వ్యవసాయానికి ప్రాధాన్యం ఇచ్చే మనదేశంలాంటి చోట్ల బొటానిస్టుల అవసరం ఎప్పుడూ ఉంటుంది. వీరు వివిధ రకాల మొక్కల జీవనవిధానం, వ్యవసాయ ఉత్పత్తికి సంబంధించిన విషయాల్లో నిష్ణాతులుగా ఉంటారు.. కృత్రిమ పరిసరాల్లో మొక్కలను పెంచి వాటిపై ప్రయోగాలు చేస్తారు...

Published : 15 Jul 2019 01:03 IST

* డిగ్రీ (బీఎస్‌సీ) పూర్తిచేశాను. బోటనీలో పీజీ చేద్దామనుకుంటున్నా. భవిష్యత్తు ఎలా ఉంటుంది?   

- బి.రామకృష్ణ

 

వ్యవసాయానికి ప్రాధాన్యం ఇచ్చే మనదేశంలాంటి చోట్ల బొటానిస్టుల అవసరం ఎప్పుడూ ఉంటుంది. వీరు వివిధ రకాల మొక్కల జీవనవిధానం, వ్యవసాయ ఉత్పత్తికి సంబంధించిన విషయాల్లో నిష్ణాతులుగా ఉంటారు.. కృత్రిమ పరిసరాల్లో మొక్కలను పెంచి వాటిపై ప్రయోగాలు చేస్తారు. ఎంఎస్‌సీ బోటనీ కోర్సులో వివిధ రకాల గ్రూపులున్నాయి. జెనెటిక్స్‌ లైకెనాలాజీ, ఎకనామిక్‌ బోటనీ, సైటాలజీ, పాలినాలజీ మొదలైనవి. బోటనీలో పీజీ చేసినవారికి వైవిధ్యమైన ఉద్యోగావకాశాలున్నాయి. పీజీ పూర్తయ్యాక మీ అభిరుచికి తగ్గట్టు  ప్లాంట్‌ ఎక్స్‌ప్లోరర్‌, కన్జర్వేషనలిస్ట్‌, ఎకాలజిస్ట్‌, ఎన్విరాన్‌మెంటల్‌ కన్సల్టెంట్‌, హార్టికల్చరిస్ట్‌ మొదలైన ఉద్యోగాల్లో స్థిరపడవచ్చు.

- ప్రొ. బి. రాజశేఖర్,‌ హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం
 
 

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని