నెలనెలా రూ.నాలుగు వేలు!

సుప్రసిద్ధ సంస్థ ఓఎన్‌జీసీ షెడ్యూల్డ్‌ కులాల, తెగల విద్యార్థులు ఉన్నతవిద్యను అభ్యసించేలా ప్రోత్సాహాన్నిస్తూ ఆర్థికసాయం అందిస్తోంది.. ప్రొఫెషనల్‌ కోర్సుల్లో డిగ్రీ, పీజీ కోర్సులను చేస్తున్నవారు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. మెరిట్‌ ఆధారంగా అర్హులను ఎంపిక చేస్తారు....

Updated : 28 Aug 2019 02:41 IST

ఎస్‌సీ, ఎస్‌టీ విద్యార్థులకు ఓఎన్‌జీసీ 1000 స్కాలర్‌షిప్పులు

సుప్రసిద్ధ సంస్థ ఓఎన్‌జీసీ షెడ్యూల్డ్‌ కులాల, తెగల విద్యార్థులు ఉన్నతవిద్యను అభ్యసించేలా ప్రోత్సాహాన్నిస్తూ ఆర్థికసాయం అందిస్తోంది.. ప్రొఫెషనల్‌ కోర్సుల్లో డిగ్రీ, పీజీ కోర్సులను చేస్తున్నవారు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. మెరిట్‌ ఆధారంగా అర్హులను ఎంపిక చేస్తారు.
ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఓఎన్‌జీసీ) ప్రొఫెషనల్‌ కోర్సుల్లో ప్రవేశం పొందిన ఎస్‌సీ, ఎస్‌టీ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను ప్రకటించింది. గ్రాడ్యుయేషన్‌ స్థాయిలో ఇంజినీరింగ్‌, మెడికల్‌ విభాగాలవారూ, బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌, జియాలజీ, జియో ఫిజిక్స్‌ల్లో పీజీ ప్రవేశం పొందినవారూ వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు.
డిగ్రీ కోర్సులకు నాలుగేళ్లపాటు, పీజీ కోర్సులకు రెండేళ్లపాటు స్కాలర్‌షిప్‌ అందుతుంది. నెలకు రూ.4000 చొప్పున ఏడాదికి మొత్తంగా రూ.48,000 చెల్లిస్తారు.
దేశవ్యాప్తంగా 1000 స్కాలర్‌షిప్‌లను అందిస్తున్నారు. జోన్లవారీగా వీటిని అందజేస్తారు. మొత్తంగా అయిదింటిని ఎంపిక చేసి, ప్రతిజోన్‌కు 200 చొప్పున స్కాలర్‌షిప్‌లను అందిస్తున్నారు. వీటిలో 50% స్కాలర్‌షిప్‌లను అమ్మాయిలకు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ విద్యార్థులు సౌత్‌ (జోన్‌-5) జోన్‌ కిందకి వస్తారు.

ఎంపిక విధానం
గత పరీక్షలో సాధించిన మార్కులను బట్టి ఎంపిక ఉంటుంది. మెరిట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆ ఏడాదిలో పొందిన మార్కుల ఆధారంగానే తరువాతి ఏడాది స్కాలర్‌షిప్‌ కొనసాగడం, కొనసాగకపోవడం ఆధారపడి ఉంటుంది. ఫెయిల్‌ అయినవారికి స్కాలర్‌షిప్‌ నిలిపివేస్తారు. కనీసం 50% మార్కులు సాధించడం తప్పనిసరి.
దరఖాస్తు విధానం
వెబ్‌సైట‌ (www.ongcindia.com) నుంచి దరఖాస్తు ఫారాన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. దానిని తగిన వివరాలతో నింపి, అడిగిన ధ్రువపత్రాలను జోడించి సంస్థ చిరునామాకు పంపాల్సి ఉంటుంది.
చిరునామా: ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌, గ్రీన్‌ హిల్స్‌ టెల్‌ భవన్‌, దేహ్రాదూన్‌- 248003.
దరఖాస్తు ఫీజు ఏమీలేదు. దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీ: అక్టోబరు 15, 2019.

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల విద్యార్థులు దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:

DGM(HR), ONGC, 7th Floor, East Wing, CMDA Tower-
I, No.1,Gandhi Irwin Road,
Egmore, Chennai - 600 008.

అర్హతలు
* గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి రెగ్యులర్‌ కోర్సుల్లో మొదటి ఏడాది ప్రవేశం పొంది ఉండాలి.
*  గ్రాడ్యుయేషన్‌ కోర్సులకు ఇంటర్మీడియట్‌, పీజీ కోర్సులకు డిగ్రీ కనీసం 60% మార్కులతో పూర్తిచేసి ఉండాలి.
*  కుటుంబ నెలవారీ ఆదాయం రూ.37000 మించకూడదు.
*  అక్టోబరు 1, 2019 నాటికి 30 ఏళ్లు మించకూడదు.
*  ఇతర స్కాలర్‌షిప్‌లు పొందుతున్నవారిని అనర్హులుగా ప్రకటిస్తారు. ప్రభుత్వం నుంచి ఫీజు రీయంబర్స్‌మెంట్‌/ ఫీజులో తగ్గింపు పొందుతున్నవారు అర్హులే.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని