విదేశీ విద్యకు టాటా స్కాలర్‌షిప్‌

విదేశాల్లో అభ్యసించాలనుకునేవారికి జేఎన్‌ టాటా ఎండోమెంట్‌ లోన్‌ స్కాలర్‌షిప్‌ అందిస్తోంది. దీనికి సంబంధించిన ప్రకటన ఇటీవలే విడుదలైంది. ఎంపికైతే రూ.లక్ష నుంచి రూ.పది లక్షల వరకూ పొందే అవకాశముంది...

Published : 10 Feb 2020 00:40 IST

విదేశాల్లో అభ్యసించాలనుకునేవారికి జేఎన్‌ టాటా ఎండోమెంట్‌ లోన్‌ స్కాలర్‌షిప్‌ అందిస్తోంది. దీనికి సంబంధించిన ప్రకటన ఇటీవలే విడుదలైంది. ఎంపికైతే రూ.లక్ష నుంచి రూ.పది లక్షల వరకూ పొందే అవకాశముంది. విదేశాల్లో ఉన్నతవిద్య కోర్సులను ఎంచుకున్నవారు దీనికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
జేఎన్‌ టాటా ఎండోమెంట్‌ వన్‌టైమ్‌ లోన్‌ స్కాలర్‌షిప్‌. విదేశాల్లో ఫుల్‌టైం పోస్ట్‌గ్రాడ్యుయేట్‌/ పీహెచ్‌డీ/ పోస్ట్‌ డాక్టొరల్‌ స్టడీస్‌/ రిసెర్చ్‌ ఫెలోషిప్‌లకు ఎంపికైనవారు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థి అవసరం ఆధారంగా స్కాలర్‌షిప్‌ మొత్తాన్ని రూ.లక్ష నుంచి రూ. పది లక్షల మధ్య నిర్ణయిస్తారు. విద్యాభ్యాసానికి అయ్యే మొత్తం ఖర్చులను మాత్రం చెల్లించరు.
ఎంపికైన వారు చదువులో చూపిన ప్రతిభ ఆధారంగా ట్రావెల్‌ గ్రాంట్‌ (పాక్షికం), గిఫ్ట్‌ అవార్డులనూ పొందే వీలుంది. ఇది పూర్తిగా ట్రస్ట్‌ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. గిఫ్ట్‌ స్కాలర్‌షిప్‌ మొత్తం రూ.7,50,000 వరకూ, పార్షియల్‌ ట్రావెల్‌ గ్రాంట్‌ను రూ.50,000 వరకూ చెల్లిస్తారు.

అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/ కళాశాల నుంచి గత తరగతిలో 60% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. ఇప్పటికే విదేశాల్లో రెండో ఏడాది విద్యాభ్యాసం చేస్తున్నవారూ (ఫాల్‌ 2020, స్ప్రింగ్‌ 2021) దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీ తుది సంవత్సరం చదువుతూ ఫలితాల కోసం ఎదురు చూస్తున్నవారూ అర్హులే. ఇదివరకే ఈ స్కాలర్‌షిప్‌ పొందినవారు మళ్లీ దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు.
వయసు జూన్‌ 30, 2020 నాటికి 45 ఏళ్లు మించకూడదు. ఎంచుకున్న రంగంలో మంచి విద్యా నేపథ్యం, అనుభవం ఉన్నవారు, శిక్షణ పొందుతున్నవారూ అర్హులే. సెమినార్లు, కాన్ఫరెన్సులు, అండర్‌ గ్రాడ్యుయేట్‌ విద్య కోసం వెళ్తున్నవారు అనర్హులు.


ఏమేం చూస్తారు?
* విద్యానేపథ్యంతోపాటు కో కరిక్యులర్‌, ఎక్స్‌ట్రా కరిక్యులర్‌ అంశాలను పరిశీలిస్తారు.
* జీఆర్‌ఈ/ జీమ్యాట్‌/ టోఫెల్‌/ ఐఈఎల్‌టీఎస్‌ల్లో మంచి స్కోరు సాధించి ఉండాలి.
* ఎస్‌ఓపీని సమర్పించాల్సి ఉంటుంది.
ఎంపిక: దరఖాస్తుల ఆధారంగా ప్రాథమిక ఎంపిక ప్రక్రియ పూర్తయ్యాక ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహిస్తారు. దీనిలోనూ అర్హత సాధించినవారిని ఇంటర్వ్యూకు పిలుస్తారు. దీనిలోనూ అర్హత సాధించాల్సి ఉంటుంది. మొత్తంగా ఇంటర్వ్యూ,
ఆన్‌లైన్‌ పరీక్ష స్కోరు, అకడమిక్‌, ప్రీరిక్విజిట్‌ టెస్ట్‌ల స్కోరు ఆధారంగా స్కాలర్‌షిప్‌ అందజేస్తారు.

ఆన్‌లైన్‌లో(http://www.jntataendowment.org) దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీ:
మార్చి 9, 2020.


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని