విద్యార్థినులకు స్కాలర్‌షిప్‌

దూరవిద్య ద్వారా తమ కలలను సాకారం చేసుకోవాలనుకునే విద్యార్థులు ఎందరో. వీరిలో మహిళలను ప్రోత్సహించే ఉద్దేశంతో ...

Updated : 30 Oct 2020 04:44 IST

చండీగఢ్‌ యూనివర్సిటీ మాతృదినోత్సవ కానుక●

దూరవిద్యా కోర్సుల్లో అమలు

దూరవిద్య ద్వారా తమ కలలను సాకారం చేసుకోవాలనుకునే విద్యార్థులు ఎందరో. వీరిలో మహిళలను ప్రోత్సహించే ఉద్దేశంతో చండీగఢ్‌ యూనివర్సిటీ ఓ అవకాశాన్ని ఇస్తోంది. వారికోసం ‘విమెన్‌ ఎంపవర్‌మెంట్‌ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌’ను అందిస్తోంది. చదువు మధ్యలో ఆపేసిన, ఉద్యోగాలు చేస్తున్న స్త్రీలు ఎవరైనా ఈ అవకాశాన్ని అందుకోవచ్చు.

పంజాబ్‌లోని చండీగఢ్‌ యూనివర్సిటీ అంతర్జాతీయ మాతృదినోత్సవం సందర్భంగా విమెన్‌ ఎంపవర్‌మెంట్‌ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టింది. దీని ప్రకారం దూరవిద్య నిమిత్తం దరఖాస్తు చేసుకున్నవారి ఫీజులో 20% మొత్తం అకడమిక్‌ స్కాలర్‌షిప్‌గా చెల్లిస్తారు. దీనిని మహిళలకు మాత్రమే అందజేస్తారు. స్త్రీలను ఉన్నతవిద్య దిశగా ప్రోత్సహించడమే ఈ ప్రోగ్రామ్‌ ఉద్దేశం. 2020 జులై ప్రవేశాలకు అందుబాటులో కోర్సులకు దరఖాస్తు చేసుకున్న మహిళలందరికీ ఇది వర్తిస్తుంది.

గృహిణులు, ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పనిచేసేవారు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశావర్కర్లు, అసంఘటిత రంగంలో పనిచేసేవారు, చదువు మధ్యలో మానేసినవారు ఎవరైనా దీనికి అర్హులే. కామర్స్‌, మేనేజ్‌మెంట్‌ ఐటీ, హ్యూమానిటీస్‌, టూరిజం విభాగాల్లో దూరవిద్యా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. డిగ్రీ స్థాయిలో.. బ్యాచిలర్‌ ఆఫ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ (బీబీఏ), బ్యాచిలర్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ (బీసీఏ), బీఎస్‌సీ, బీకాం, బీఏ కోర్సులూ, పీజీలో.. మాస్టర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎంబీఏ), మాస్టర్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ (ఎంసీఏ), ఎంకాం, ఎంఏ (ఇంగ్లిష్‌, సైకాలజీ) కోర్సులూ ఉన్నాయి.

నేరుగా తరగతులకు హాజరు కావాల్సిన పనిలేదు. ఇంటరాక్టివ్‌, లర్నింగ్‌ మెటీరియల్‌, వెబినార్‌, డిస్కషన్స్‌, పర్సనల్‌ కాంటాక్ట్‌ ప్రోగ్రామ్‌ మొదలైనవాటి ద్వారా నేర్చుకునే వీలు కల్పిస్తారు. ఆసక్తి ఉన్నవారు ఆన్‌లైన్‌ (http://www.cuidol.in/) లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పేరు, ఈ-మెయిల్‌, కాంటాక్ట్‌ వివరాలు, సిటీతో నమోదు చేసుకోవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని