ఎస్‌సీ, ఎస్‌టీ విద్యార్థినులకు సాయం!

ఆర్థికంగా వెనుకబడిన ఎస్‌సీ, ఎస్‌టీ విద్యార్థినులకు సంతూర్‌, ఓఎన్‌జీసీ స్కాలర్‌షిప్‌లను అందిస్తున్నాయి. ఇంటర్మీడియట్‌ పూర్తి అయి, డిగ్రీ కోర్సులు చేస్తున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. సంతూర్‌ నోటిఫికేషన్‌ ఇప్పటికే...

Updated : 19 Oct 2022 16:09 IST

ఆర్థికంగా వెనుకబడిన ఎస్‌సీ, ఎస్‌టీ విద్యార్థినులకు సంతూర్‌, ఓఎన్‌జీసీ స్కాలర్‌షిప్‌లను అందిస్తున్నాయి. ఇంటర్మీడియట్‌ పూర్తి అయి, డిగ్రీ కోర్సులు చేస్తున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. సంతూర్‌ నోటిఫికేషన్‌ ఇప్పటికే  వెలువడింది. ఓఎన్‌జీసీ ప్రకటన ఈ నెలాఖరుకు విడుదలయ్యే అవకాశముంది.సంతూర్‌ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌ను విప్రో కన్సూమర్‌ కేర్‌ అండ్‌ విప్రోకేర్‌ అందిస్తోంది. 12/ఇంటర్మీడియట్‌ తరువాత ఉన్నతవిద్యను హ్యుమానిటీస్‌, లిబరల్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌లో అభ్యసించేవారికి అందిస్తారు. ఏటా ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలనుంచి 900 మందిని ఎంపిక చేస్తారు. వెనుకబడిన జిల్లాలవారికి ప్రాధాన్యమిస్తారు. 

అర్హత: పదో తరగతి ప్రభుత్వ పాఠశాలలో పూర్తిచేసుండాలి. 2017-18 సంవత్సరానికిగానూ ఇంటర్మీడియట్‌/ డిప్లొమా ప్రభుత్వ కళాశాలలో పూర్తిచేసుండాలి. 2018-19 విద్యాసంవత్సరానికి గుర్తింపు పొందిన కళాశాలలో మూడేళ్ల వ్యవధిగల డిగ్రీ/ డిప్లొమాకు నమోదు చేసుకుని ఉండాలి. 
ఎంత మొత్తం?: చదువు, దానికి సంబంధించిన ఇతర ఖర్చులకు కలిపి కోర్సు పూర్తయ్యేనాటికి ఏడాదికి రూ.24,000 చెల్లిస్తారు. 
దరఖాస్తు ఎలా?: మెయిల్‌, ఫేస్‌బుక్‌ ఐడీలతో రిజిస్టర్‌ చేసుకుని, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా దరఖాస్తు ఫారాన్ని డౌన్‌లోడ్‌ చేసుకుని, దాన్ని నింపి, అవసరమైన పత్రాలను జతచేసి, విప్రో కేర్స్‌, సంతూర్‌ స్కాలర్‌షిప్‌, దొడ్డ కన్నెల్లి, సర్జాపూర్‌రోడ్‌, బెంగళూరు- 560035 కు పంపాల్సి ఉంటుంది. ఎంపికైనవారిని తరువాత ప్రకటిస్తారు. 
దరఖాస్తు చివరితేదీ: సెప్టెంబరు 15, 2018 
వెబ్‌సైట్‌: santoorscholarships.com


ఓఎన్‌జీసీ

ఇంటర్‌ పూర్తయ్యి ఇంజినీరింగ్‌, మెడిసిన్‌, గ్రాడ్యుయేషన్‌/ డిప్లొమా కోర్సు, ఒకేషనల్‌ కోర్సుల్లో 2018 సంవత్సరానికిగానూ చేరిన ఎస్‌సీ, ఎస్‌టీ వారు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తంగా 500 స్కాలర్‌షిప్‌లను అందిస్తారు. 
అర్హత: నాలుగేళ్ల ఇంజినీరింగ్‌/ ఎంబీబీఎస్‌/ రెండేళ్ల ఎంబీఏ/ రెండేళ్ల జియాలజీ/ జియోఫిజిక్స్‌ చదివినవారు అర్హులు. 
కుటుంబ ఆదాయం రూ.4.50 లక్షలు మించకూడదు. 12వ తరగతిలో 60% మార్కులు సాధింంచి ఉండాలి. 
ఎంత మొత్తం: నెలకు రూ.4000 లేదా ఏడాదికి రూ.48,000  చెల్లిస్తారు. 
దరఖాస్తు ఎలా?: పూర్తిచేసిన దరఖాస్తును అవసరమైన పత్రాలతో వెబ్‌సైట్‌లో ఉంచిన చిరునామాకు గడువులోగా పంపాల్సి ఉంటుంది. 
ఎంపిక ప్రక్రియ: ఇంటర్‌లో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఇద్దరికీ ఒకే రకమైన పర్సంటేజీ వస్తే, వారి కుటుంబ ఆదాయం ఆధారంగా ఎంపిక చేస్తారు. 
వెబ్‌సైట్‌: www.ongcindia.com


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని