కళాకారులకు ఆధునిక శిక్షణ 

సంగీతం, నృత్యం, నాటకం లాంటివాటిలో చక్కని ప్రతిభ చూపించగల యువ కళాకారులు మనదేశంలో ఎందరో ఉన్నారు. వీరిలో చాలామంది మెరుగైన శిక్షణ, ప్రోత్సాహం లేక ముందుకువెళ్లలేకపోతున్నారు. ఇలాంటివారి కోసమే సీసీఆర్‌టీ సంస్థ యంగ్‌ ఆర్టిస్ట్స్‌ స్కాలర్‌షిప్‌లను అందిస్తోంది. యువ కళాకారులకు తోడ్పాటునందించి ప్రోత్సహించాలనే ఉద్దేశంతో  దీన్ని ప్రారంభించారు. 

Published : 10 Dec 2018 01:24 IST

400 స్కాలర్‌షిప్పులు

సంగీతం, నృత్యం, నాటకం లాంటివాటిలో చక్కని ప్రతిభ చూపించగల యువ కళాకారులు మనదేశంలో ఎందరో ఉన్నారు. వీరిలో చాలామంది మెరుగైన శిక్షణ, ప్రోత్సాహం లేక ముందుకువెళ్లలేకపోతున్నారు. ఇలాంటివారి కోసమే సీసీఆర్‌టీ సంస్థ యంగ్‌ ఆర్టిస్ట్స్‌ స్కాలర్‌షిప్‌లను అందిస్తోంది. యువ కళాకారులకు తోడ్పాటునందించి ప్రోత్సహించాలనే ఉద్దేశంతో  దీన్ని ప్రారంభించారు. 

కళాకారులకు ఆధునిక శిక్షణ 

వివిధ సాంస్కృతిక రంగాల్లో ప్రావీణ్యం ఉండి, వాటిలో మరింత నైపుణ్యం సంపాదించదల్చిన యువకళాకారులకు ‘యంగ్‌ ఆర్టిస్ట్స్‌ స్కాలర్‌షిప్‌’ పథకం చక్కటి మార్గం. న్యూదిల్లీలోని సెంటర్‌ ఫర్‌ కల్చరల్‌ రిసోర్స్‌ అండ్‌ ట్రైనింగ్‌ (సీసీఆర్‌టీ) సంస్థ మొత్తం 400 స్కాలర్‌షిప్‌లను అందిస్తోంది. భారతీయ సంస్కృతిని విద్యతో అనుసంధానం చేసేందుకు కృషి చేస్తున్న ఈ సంస్థను 1979లో స్థాపించారు. ప్రస్తుతం కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో స్వతంత్ర సంస్థగా పని చేస్తోంది. 
ఇండియన్‌ క్లాసికల్‌ మ్యూజిక్‌, ఇండియన్‌ క్లాసికల్‌ డాన్స్‌, లైట్‌ క్లాసికల్‌ మ్యూజిక్‌,  థియేటర్‌, విజువల్‌ ఆర్ట్స్‌, ఫోక్‌, ట్రెడిషనల్‌ అండ్‌ ఇండిజినస్‌ ఆర్ట్స్‌ విభాగాల్లో వీరికి ఆధునిక పద్ధతిలో శిక్షణ ఇవ్వడానికి ఈ సహాయాన్ని చేస్తోంది. ఈ సంస్థ ప్రకటించిన స్కాలర్‌షిప్‌ వ్యవధి రెండేళ్లు. ఎంపికైనవారు గతంలో శిక్షణ తీసుకున్న గురువు/ ఇన్‌స్టిట్యూట్‌ ఆధారంగా వీరి శిక్షణ స్వభావం ఆధారపడి ఉంటుంది. వీరు రోజుకు మూడు గంటలు గురువు వద్ద కఠినమైన శిక్షణ పొందాల్సి ఉంటుంది. శిక్షణకాలంలో ప్రయాణ ఖర్చులు, ట్యూషన్‌ ఫీజు, ఉండటానికయ్యే ఖర్చు, పుస్తకాలు మొదలైనవాటికి నెలకు రూ.5000 చొప్పున రెండు సంవత్సరాలు స్కాలర్‌షిప్‌ ఇస్తారు. 


ఎవరు అర్హులు?

అడ్వాన్స్‌డ్‌ శిక్షణను అందించడమే ఈ స్కాలర్‌షిప్‌ ఉద్దేశం. కాబట్టి, దరఖాస్తుదారులు సంబంధిత అంశంలో కనీసం డిగ్రీ/ డిప్లొమా చేసి ఉండాలి. 
ఈ అభ్యర్థులు భారతీయులై ఉండాలి. 
శిక్షణపట్ల ఆసక్తిని రుజువు చేసుకోవాలి. 
ఒక గురువు/సంస్థ దగ్గర కనీసం అయిదేళ్లపాటు శిక్షణ తీసుకున్నట్లు ఆ గురువు సంతకంతో సర్టిఫికెట్‌ను ఇవ్వాల్సి ఉంటుంది. 
అభ్యర్థి వయసు ఏప్రిల్‌ 1కి 18 సంవత్సరాల కంటే తక్కువ, 25 ఏళ్ల కంటే ఎక్కువ ఉండకూడదు. 


ఏయే అంశాల్లో...

ఇండియన్‌ క్లాసికల్‌ మ్యూజిక్‌: క్లాసికల్‌ హిందూస్థానీ మ్యూజిక్‌ (వోకల్‌, ఇన్‌స్ట్రుమెంటల్‌), క్లాసికల్‌ కర్ణాటిక్‌ మ్యూజిక్‌ (వోకల్‌, ఇన్‌స్ట్రుమెంటల్‌ మొదలైనవి) 
ఇండియన్‌ క్లాసికల్‌ డాన్స్‌/ డాన్స్‌ మ్యూజిక్‌: భరతనాట్యం, కథక్‌, కూచిపూడి, కథాకళి, మోహినీఅట్టం, ఒడిస్సీ డాన్స్‌/ మ్యూజిక్‌, మణిపురి డాన్స్‌ / మ్యూజిక్‌, తాంగ్తా, గౌడియా నృత్యం, చౌ డాన్స్‌/ మ్యూజిక్‌, సత్రియ నృత్యం. 
థియేటర్‌: నటన, డైరెక్షన్‌, థియేటర్‌ ఆర్ట్‌ మొదలైనవాటిలో ప్రావీణ్యం; మైమ్‌ 
విజువల్‌ ఆర్ట్స్‌: గ్రాఫిక్స్‌, స్కల్‌ప్చర్‌, పెయింటింగ్‌, క్రియేటివ్‌ ఫొటోగ్రఫీ, పోటరీ, సెరామిక్స్‌ మొదలైనవి. 
ఫోక్‌, ట్రెడిషనల్‌ అండ్‌ ఇండిజినస్‌ ఆర్ట్స్‌: పప్పెట్రీ, ఫోక్‌ థియేటర్‌, జానపద నృత్యాలు, జానపద పాటలు, జానపద సంగీతం మొదలైనవి. 
లైట్‌ క్లాసికల్‌ మ్యూజిక్‌: తుమిరి, దాద్రా, తప్పా, కవాలీ, గజల్‌; లైట్‌ క్లాసికల్‌ మ్యూజిక్‌ బేస్డ్‌ ఆన్‌ కర్ణాటిక్‌ స్టైల్‌ మొదలైనవి; రవీంద్ర సంగీత్‌, నజ్రుల్‌ గీతి, అతుల్‌ప్రసాద్‌.


ఎంపిక విధానం

న్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సివుంటుంది. అభ్యర్థులను నిపుణుల కమిటీ ఇంటర్వ్యూ చేస్తుంది. ప్రతిభ ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. ఎంపికైనవారి వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచుతారు. 
దరఖాస్తు పత్రాలతో పాటు సమర్పించాల్సిన డిగ్రీ, డిప్లొమా, అనుభవ పత్రాలు,. ఇతర వివరాల కోసం http://www.indiaculture.nic.in/,  http://www.ccrtindia.gov.in/ వెబ్‌సైట్‌లను చూడవచ్చు. 
దరఖాస్తులకు చివరి తేదీ: 11.12.2018.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని