యువ సంగీత కళాకారులకు సాయం

హిందుస్థానీ సంగీత విభాగంలో ప్రవేశం ఉండి, సరైన ఆసరా అందక చాలామంది ప్రజ్ఞావంతులు మట్టిలో మాణిక్యాలుగానే మిగిలిపోతున్నారు. అలాంటి కళాకారులను వెలికితీసి, వారిని సానబెట్టేందుకూ, ప్రోత్సహించేందుకూ ముంబయిలోని..

Updated : 26 Dec 2018 02:56 IST

హిందుస్థానీ సంగీత విభాగంలో ప్రవేశం ఉండి, సరైన ఆసరా అందక చాలామంది ప్రజ్ఞావంతులు మట్టిలో మాణిక్యాలుగానే మిగిలిపోతున్నారు. అలాంటి కళాకారులను వెలికితీసి, వారిని సానబెట్టేందుకూ, ప్రోత్సహించేందుకూ ముంబయిలోని సాంస్కృతిక సంస్థ ‘నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ది పెర్ఫార్మింగ్‌ ఆర్ట్స్‌’ (ఎన్‌సీపీఏ) కృషి చేస్తోంది. ఇందులో భాగంగా యువ కళాకారులకు స్కాలర్‌షిప్‌ను అందిస్తోంది. ఆ ప్రకటన విశేషాలు తెలుసుకుందామా?

యువ సంగీత కళాకారులకు సాయం

హిందుస్థానీ సంగీతం (వోకల్‌-ఖయాల్‌/ దృపద్‌, పర్‌క్యూషన్‌-తబలా/ పఖావజ్‌)లో ఆధునిక శిక్షణపై ఆసక్తి ఉన్న కళాకారులకు ‘సీఐటీఐ - ఎన్‌సీపీఏ స్కాలర్‌షిప్‌ ఫర్‌ యంగ్‌ మ్యుజీషియన్స్‌’ను 2019-20 సంవత్సరానికి నేషనల్‌ యువ సంగీత కళాకారులకు సాయంసెంటర్‌ ఫర్‌ ది పెర్ఫార్మింగ్‌ ఆర్ట్స్‌ సంస్థ అందిస్తోంది. అభ్యర్థులు తమ వివరాల బయోడేటాను డిసెంబరు 31లోగా ఎన్‌సీపీఏకు పంపించాలి. ఎంపికైన కళాకారులు ఒక సంవత్సరం (ఏప్రిల్‌ 2019 - మార్చి 2020)పాటు నెలకు రూ.7,500 స్కాలర్‌షిప్‌ను పొందుతారు.
1969లో ప్రారంభమైన ఎన్‌సీపీఏ దక్షిణ ఆసియాలోనే మొదటిసారిగా బహుళ-వేదికలను, బహుళ-తరహా సాంస్కృతిక కేంద్రాలను కలిగిన సంస్థ. సంగీతం, నృత్యం, థియేటర్‌, చలనచిత్రం, సాహిత్యం, ఫొటోగ్రఫీతోపాటు నాటకం, సమకాలీన నృత్యం, ఆర్కెస్ట్రా కచేరీలు, ఒపెరా, జాజ్‌, చాంబర్‌ మ్యూజిక్‌ విభాగాల్లో జాతీయ, అంతర్జాతీయ కళాకారులతో వినూత్నమైన పనితీరును ప్రదర్శిస్తోంది. హిందుస్థానీ సంగీతంలో ఆధునిక శిక్షణను తీసుకోవాలనుకునే కళాకారులకు ఏటా   స్కాలర్‌షిప్‌ను అందిస్తోంది.
ఉపకారవేతనంపై ఆసక్తి ఉన్న కళాకారులు సంగీతానికి సంబంధించి తాము చేసిన కోర్సుల వివరాలను బయోడేటాతో జతచేసి
ncpascholarships@gmail.comకు ఈ-మెయిల్‌ చేయాలి. లేదా పోస్టు ద్వారా పంపొచ్చు. ఎన్‌వలప్‌ పైన ‘సీఐటీఐ- ఎన్‌సీపీఏ స్కాలర్‌షిప్‌ ఫర్‌ యంగ్‌ మ్యుజీషియన్స్‌ 2019-20 (హిందుస్థానీ మ్యూజిక్‌)’ అని రాసి ‘ది నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ పెర్ఫార్మింగ్‌ ది ఆర్ట్స్‌, నారిమన్‌ పాయింట్‌, ముంబయి-400021’ చిరునామాకు పంపించాలి.

ఏ అర్హతలు? ఎంపిక ఎలా?

యువ సంగీత కళాకారులకు సాయం* భారతీయ పౌరులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. * ఖయాల్‌/తబలా/పఖావజ్‌ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తుదారుడి వయసు 2019 మార్చి 1వ తేదీనాటికి 18 నుంచి 30 సంవత్సరాలలోపు, దృపద్‌ స్కాలర్‌షిప్‌కు 18 నుంచి 35 సంవత్సరాలలోపు ఉండాలి.  * ఏప్రిల్‌ 2019-20 సంవత్సరానికి సంగీత రంగంలో ఇతర సంస్థల నుంచి స్కాలర్‌షిప్‌ లేదా గ్రాంట్‌ను పొందే కళాకారులు దీనికి అనర్హులు. * ప్రొఫెషనల్‌ మ్యుజీషియన్స్‌తోపాటు ఆలిండియా రేడియో ద్వారా ‘ఎ’ గ్రేడ్‌ గుర్తింపు పొందినవారికి అవకాశంలేదు.
* దరఖాస్తులో అభ్యర్థి పేరు, పుట్టిన తేదీ, చిరునామా, ఫోన్‌ నంబర్‌, వృత్తిపరమైన అర్హత, ఈ-మెయిల్‌ ఐడీ, సంగీత ఉపాధ్యాయుడు/ గురువు పేరు, మొత్తం సంగీత శిక్షణ తీసుకున్న కాలం, సాధించిన విజయాలు/ బహుమతులు/ స్కాలర్‌షిప్‌/ ప్రదర్శనలు ఏవైనా ఇచ్చి ఉంటే, ఇతర విలువైన వివరాలన్నింటినీ తెలపాలి. * ఎంపికైన అభ్యర్థులకు సమాచారాన్ని ఈ-మెయిల్‌ లేదా టెలిఫోన్‌ ద్వారా తెలియజేస్తారు. ఎంపికైనవారు ఫిబ్రవరి 2019 నాటికి ఎన్‌సీపీఏ-ముంబయికి ఆడిషన్‌ కోసం రావాల్సి ఉంటుంది. ఎన్‌సీపీఏ సెలక్షన్‌ కమిటీదే తుది నిర్ణయం.
వెబ్‌సైట్‌:
www.ncpamumbai.com

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని