డంపింగ్‌ డ్యూటీ ఉద్దేశం ఏమిటి?

1. దేశంలో జీవిత బీమా సౌకర్యం కల్పిస్తున్న సంస్థల్లో అతిపెద్దదైన ప్రభుత్వ రంగ సంస్థ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ) 2019 నాటికి మొత్తం పాలసీల్లో ఎంత వాటా కలిగి ఉంది?

Updated : 29 Jan 2020 01:40 IST

టీఎస్‌పీఎస్సీ పరీక్షలు

ఇండియన్‌ ఎకానమీ

మాదిరి ప్రశ్నలు

1. దేశంలో జీవిత బీమా సౌకర్యం కల్పిస్తున్న సంస్థల్లో అతిపెద్దదైన ప్రభుత్వ రంగ సంస్థ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ) 2019 నాటికి మొత్తం పాలసీల్లో ఎంత వాటా కలిగి ఉంది?

1) 80%  2) 75%  3) 73%  4) 63%

2. మన దేశం నుంచి ఎగుమతయ్యే క్వార్ట్జ్‌ స్టోన్‌ శ్లాబులపై 4.32% అమెరికా డంపింగ్‌ డ్యూటీ విధించింది. దాని ఉద్దేశం ఏమిటి?

1) మన ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వడం.

2) మన ఉత్పత్తుల ధరలు పెంచి డిమాండ్‌ తగ్గించడం.

3) మన ఉత్పత్తులను తిరిగి స్వదేశానికి పంపడం.

4) అమెరికా ఉత్పత్తులకు పోటీ పెంచడం.

3. ఫోర్బ్స్‌ 2019 కుబేరుల జాబితాలో 51.4 బిలియన్‌ డాలర్లతో ముకేశ్‌ అంబానీ వరుసగా 12వ ఏడాది భారత్‌లో అత్యంత ధనవంతుడిగా నిలిచారు. ఈ జాబితాలో 37వ స్థానంలో ఉన్న తెలుగు వ్యక్తి?

1) దివీస్‌ మురళి  2) రాంప్రసాద్‌ రెడ్డి  3) గ్రంథి మల్లికార్జున రావు  4) జి.వి. ప్రసాద్‌

4. రూ.4500 కోట్ల కుంభకోణంతో వివాదాస్పద వార్తల్లో నిలిచిన సహకార బ్యాంకు?

1) తెలంగాణ సహకార బ్యాంకు

2) గుజరాత్‌ సహకార బ్యాంకు

3) జమ్మూ-కశ్మీర్‌ సహకార బ్యాంకు

4) పంజాబ్‌, మహారాష్ట్ర సహకార బ్యాంకు

5. ఏడేళ్లలో అత్యంత కనిష్ఠ పారిశ్రామిక వృద్ధిరేటు (1.1%) మన దేశంలో ఎప్పుడు నమోదైంది?

1) 2019 ఆగస్టు  2) 2019 సెప్టెంబరు  3) 2019 జులై  4) 2019 ఏప్రిల్‌

6. అమితాబ్‌కాంత్‌ కమిటీ దేనికి సంబంధించింది?

1) పన్నుల సంస్కరణలు     2) వ్యవసాయ సంస్కరణలు 

3) ఉన్నత విద్య ప్రైవేటీకరణ  4) రైల్వేల ప్రైవేటీకరణ

7. 2019 సంవత్సరానికి అర్థశాస్త్రంలో నోబెల్‌ బహుమతి పొందిన రెండో భారతీయుడు?

1) రంగరాజన్‌  2) బిమల్‌ జలాన్‌  3) అభిజిత్‌ బెనర్జీ  4) అభిజిత్‌ సేన్‌

8. 2019 ప్రపంచ ఆహార సంస్థ నివేదిక ప్రకారం ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న ప్రపంచ ఆహార ధాన్యాలు సగటున ఒక మనిషికి రోజుకు ఎంత శక్తిని (కిలో కేలరీల్లో) ఇస్తాయి?

1) 2200  2)  3000  3) 3500  4) 4000

9. ప్రపంచ దారిద్య్ర నిర్మూలన దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?

1) అక్టోబరు 1  2) అక్టోబరు 5  3) అక్టోబరు 17  4) అక్టోబరు 21

10. స్టాక్‌ మార్కెట్‌లో కంపెనీ మార్కెట్‌ విలువ రూ.9 లక్షల కోట్ల స్థాయికి చేరిన తొలి భారతీయ సంస్థ?

1) టాటా గ్రూపు  2) మహీంద్ర టెక్‌  3) ఓఎన్‌జీసీ  4) రిలయన్స్‌

11. బ్యాంకుల్లోని ప్రజల డిపాజిట్లకు బీమా అందించే సంస్థ ఏది?

1) జీవిత బీమా సంస్థ     2) డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ అండ్‌ క్రెడిట్‌ గ్యారెంటీ కార్పొరేషన్‌

3) సాధారణ బీమా సంస్థ  4) డిపాజిట్‌ సెక్యూరిటీ ఫెడరేషన్‌

- డి. రామానుజులు


సమాధానాలు

1-3; 2-2; 3-1; 4-4; 5-1; 6-4; 7-3; 8-2; 9-3; 10-4; 11-2.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని