2019లో మేటి హిందీ మాట?

పోటీ పరీక్షల్లో వర్తమానాంశాలకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. అందుకే వీటిని ఎప్పటికప్పుడు గమనిస్తూ గుర్తుంచుకోవడం అవసరం!

Published : 03 Feb 2020 01:29 IST

పోటీపరీక్షల కోసం...
వర్తమాన అంశాలు

జాతీయం
పోటీ పరీక్షల్లో వర్తమానాంశాలకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. అందుకే వీటిని ఎప్పటికప్పుడు గమనిస్తూ గుర్తుంచుకోవడం అవసరం!
1. గర్భస్రావం (అబార్షన్‌) చేయించుకునేందుకు ఇప్పటివరకూ ఉన్న గరిష్ఠ కాలపరిమితిని 20 వారాల నుంచి ఎన్ని వారాలకు పెంచాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది?
(ఇలాంటి గర్భాన్ని తొలగించుకోవాలనుకుంటే ఇద్దరు వైద్యుల అనుమతి అవసరం. అందులో ఒకరు తప్పనిసరిగా ప్రభుత్వ వైద్యుడై ఉండాలి. 20 వారాల్లోపు అయితే ఒక వైద్యుడి అభిప్రాయం చాలు. గర్భస్థ శిశువులో అసాధారణ లోపానున్నట్లు వైద్యమండలి నిర్ధారిస్తే అప్పుడు ఈ గరిష్ఠ పరిమితి వర్తించదు)
1) 22 వారాలు  2) 24 వారాలు 3) 26 వారాలు  4) 28 వారాలు

2. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ప్రెస్‌ (ఓయూపీ) ‘మేటి హిందీ పదం-2019’ గా దేన్ని ప్రకటించింది?
(ఒక ఏడాదిలో విస్తృతంగా చర్చనీయాంశంగా మారడంతో పాటు ప్రజల మనోగతానికి లేదా సంస్కృతికి అద్దం పట్టే పదాలను ఓయూపీ గుర్తించి ఆ ఏటి ‘మేటి పదం’గా ఎంపిక చేస్తుంది)
1) అభియాన్‌  2) సశక్తీకరణ్‌  3) సర్కార్‌  4) సంవిధాన్‌

3. కింది అంశాల్లో సరైనవి ఏవి?
ఎ) ఈ ఏడాదికి సంబంధించి 2020 జనవరి 25న కేంద్రప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. మొత్తం ఏడుగురికి పద్మవిభూషణ్‌, పదహారు మందికి పద్మభూషణ్‌, 118 మందికి పద్మశ్రీ
అవార్డులను ప్రకటించింది.
బి) దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్‌ను కేంద్ర మాజీ మంత్రులు జార్జి ఫెర్నాండెజ్‌, అరుణ్‌ జైట్లీ, సుష్మాస్వరాజ్‌లతో పాటు ఆధ్యాత్మిక గురువు, ఉడిపి పెజావర్‌ మఠ్‌ పీఠాధిపతి విశ్వేశతీర్థ స్వామీజీలకు మరణానంతరం ప్రకటించింది. మారిషస్‌ మాజీ ప్రధానమంత్రి అనిరుధ్‌ జగన్నాథ్‌Å, భారత బాక్సింగ్‌ క్రీడాకారిణి మేరీకోమ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ప్రఖ్యాత హిందుస్తానీ గాయకుడు చన్నులాల్‌ మిశ్రాలనూ పద్మవిభూషణ్‌ వరించింది.
సి) బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి, తెలుగు తేజం పీవీ సింధుకు దేశ మూడో అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్‌ లభించింది. సింధుతో సహా తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐదుగురికి పద్మ పురస్కారాలు లభించాయి. ఏపీ నుంచి కళాకారులు యడ్ల గోపాలరావు, దళవాయి చలపతిరావు, తెలంగాణ నుంచి వ్యవసాయ రంగానికి చెందిన చింతల వెంకటరెడ్డి, విద్య, సాహిత్య రంగాల నుంచి విజయ సారధి శ్రీ భాష్యంలు పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికయ్యారు.
డి) భారత 71వ గణతంత్ర వేడుకలకు బ్రెజిల్‌ అధ్యక్షుడు జెయీర్‌ మిసియాస్‌ బొల్సోనారో ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. గణతంత్ర వేడుకల్లో ఆ దేశాధినేత ముఖ్య అతిథిగా పాల్గొనడం ఇది మూడోసారి.
1) ఎ మాత్రమే   2) ఎ, బి మాత్రమే  3) ఎ, బి, సి మాత్రమే 4) పైవన్నీ

4. దేశ జీడీపీ వృద్ధి రేటు వచ్చే ఆర్థిక సంవత్సరం 2020-21లో ఎంత శాతానికి పుంజుకోవచ్చని 2019-20 ఆర్థిక సర్వే అంచనా వేసింది?
(2020-21 ఆర్థిక బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న పార్లమెంటుకు సమర్పించటానికి ఒక రోజు ముందు ఆర్థిక సర్వే నివేదికను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంటు ముందుంచారు)
1) 5- 5.5 శాతం   2) 5.5- 6 శాతం   3) 6- 6.5 శాతం   4) 6.5- 7 శాతం.

సమాధానాలు:  1)2   2)4   3)4    4)3  

- సీహెచ్‌. కృష్ణప్రసాద్‌

మిగతా వర్తమాన అంశాలను www.eenadupratibha.net లో చూడండి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని