అల్‌బెరూనీ రచించిన గ్రంథం ఏది?

గజనీ తన ఎన్నో దండయాత్రలో సోమనాథ దేవాలయాన్ని ధ్వంసం చేశాడు?

Updated : 11 Feb 2020 03:36 IST

సచివాలయ పోస్టుల పరీక్షలు
భారతదేశ చరిత్ర

మహ్మదీయ దండయాత్రలు
1. గజనీ తన ఎన్నో దండయాత్రలో సోమనాథ దేవాలయాన్ని ధ్వంసం చేశాడు?
1) మొదటి  2) అయిదో
3) పదహారో 4) చివరి
2. సోమనాథ దేవాలయం ఉన్న గుజరాత్‌ ప్రాంతం?
1) కచ్‌ 2) కథియవాడ్‌
3) అనిహిల్‌వాడ్‌ 4) సూరత్‌
3. గజనీ తన తొలి దండయాత్రలో ఎవరిని ఓడించాడు?
1) జయచంద్రుడు  2) జయపాలుడు
3) ఆనందపాలుడు 4) సోలంకీ భీముడు
4. గజనీతో మనదేశానికి వచ్చిన పారశీక చరిత్రకారుడు?
1) ఫిరదౌసి 2) ఉత్బీ
3) అల్‌బెరూనీ 4) సులేమాన్‌
5. అల్‌బెరూనీ రచించిన గ్రంథం?
1) షానామా 2) ఫిరదౌసి
3) తుగ్లక్‌ నామా 4) కితాబ్‌-ఉల్‌-హింద్‌
6. భారతదేశంలోని మహ్మదీయ దండయాత్రలకు ప్రధాన ఆధార గ్రంథం?
1) షానామా 2) తారిక్‌-ఇ-హింద్‌
3) తుగ్లక్‌ నామా 4) ఏదీకాదు
7. గజనీ మహ్మద్‌ భారతదేశ దండయాత్ర లక్ష్యాల్లో లేనిది?
1) భారతదేశ సిరిసంపదలను దోపిడీ చేయడం
2) విగ్రహారాధనను నిర్మూలించడం
3) ఇస్లాం మతాన్ని వ్యాప్తి చేయడం
4) భారతదేశాన్ని ఆక్రమించడం
8. భారతదేశాన్ని ఆక్రమించాలనే లక్ష్యంతో దండెత్తి వచ్చిన తురష్క పాలకుడు?
1) గజనీ   2) ఘోరీ మహ్మద్‌
3) మహ్మద్‌ బిన్‌ ఖాసిం 4) కుతుబుద్దీన్‌ ఐబక్‌
9. భారత్‌లో ఇస్లాంరాజ్య స్థాపనకు పునాది వేసినవారు?
1) గజనీ    2) ఘోరీ మహ్మద్‌
3) మహ్మద్‌ బిన్‌ ఖాసిం  4) కుతుబుద్దీన్‌ ఐబక్‌
10. ఘోరీ మహ్మద్‌తో తరైన్‌ యుద్ధాల్లో తలపడిన
రాజపుత్ర రాజు?
1) జయచంద్రుడు 2) జయపాలుడు
3) పృథ్వీరాజ్‌ చౌహాన్‌ 4) ఎవరూ కాదు
11. మొదటి తరైన్‌ యుద్ధం ఎప్పుడు జరిగింది?
1) 1191  2) 1192  

3) 1193  4) 1194
12. చంద్‌వార్‌ యుద్ధం ఎప్పుడు జరిగింది?
1) 1191  2) 1192  3) 1193   4) 1194
13. చంద్‌వార్‌ యుద్ధంలో ఘోరీ మహ్మద్‌ చేతిలో
మరణించిన కనోజ్‌ పాలకుడు?
1) జయపాలుడు 2) జయచంద్రుడు
3) ఆనందపాలుడు 4) పృథ్వీరాజ్‌ చౌహాన్‌
14. భారతదేశంలో ఘోరీ మహ్మద్‌ ప్రతినిధిగా
నియమితులైనవారు?
1) భక్తియార్‌ ఖిల్జీ 2) కుతుబుద్దీన్‌ ఐబక్‌
3) యల్‌డజ్‌ 4) ఎవరూ కాదు
15. కిందివాటిలో సరికానిది.
1) భారతదేశంలో ఇస్లాం మతాన్ని ప్రారంభించినవారు మహ్మద్‌ బిన్‌ ఖాసిం.
2) భారతదేశంలో ఇస్లాం రాజ్య స్థాపనకు పునాది వేసినవారు గజనీ మహ్మద్‌.
3) భారతదేశంలో ఇస్లాం సామ్రాజ్యాన్ని విస్తరించినవారు కుతుబుద్దీన్‌ ఐబక్‌.
4) భారతదేశంపైకి దండెత్తి వచ్చిన మొదటి ముస్లింలు అరబ్బులు.
16. భారతదేశంలో 1206లో ఢిల్లీ సుల్తాన్‌ సామ్రాజాన్ని స్థాపించినవారు?
1) గజనీ 2) ఘోరీ మహ్మద్‌
3) కుతుబుద్దీన్‌ ఐబక్‌ 4) ఇల్‌టుట్‌ మిష్‌

సమాధానాలు
13; 22; 32; 43; 54; 62; 74; 82; 92; 103; 111; 124; 132; 142;  152; 163.

- బొత్స నాగరాజు

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు