దిల్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్‌ వీరులెవరు?

పోటీ పరీక్షల్లో వర్తమానాంశాలకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. అందుకే వీటిని ఎప్పటికప్పుడు గమనిస్తూ గుర్తుంచుకోవడం అవసరం!

Published : 17 Feb 2020 01:04 IST


పోటీ పరీక్షల్లో వర్తమానాంశాలకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. అందుకే వీటిని ఎప్పటికప్పుడు గమనిస్తూ గుర్తుంచుకోవడం అవసరం!
పోటీపరీక్షలకు వర్తమాన అంశాలు
జాతీయం

 

1. కింది అంశాల్లో సరైనవి ఏవి?
ఎ) 2020 ఫిబ్రవరి 8న జరిగిన దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఫిబ్రవరి 11న ప్రకటించారు. మొత్తం 70 శాసనసభ స్థానాలకుగానూ అధికార ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) 62 చోట్ల విజయం సాధించింది.
బి) భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 8 చోట్ల గెలుపొందింది. కాంగ్రెస్‌ పార్టీ ఒక్క స్థానంలోనూ గెలుపొందలేదు.
సి) 2015 ఎన్నికల్లో ఆప్‌ 67 సీట్లు, బీజేపీ 3 చోట్ల నెగ్గాయి. దిల్లీలో వరుసగా మూడుసార్లు అధికార పగ్గాలు చేపట్టి ఆప్‌ హ్యాట్రిక్‌ సాధించింది. 1998-2013 మధ్యకాలంలో షీలా దీక్షిత్‌ నేతృత్వంలో కాంగ్రెస్‌ పార్టీ కూడా మూడు సార్లు వరుసగా అధికారంలో కొనసాగింది.
డి) ఫిబ్రవరి 16న ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ దిల్లీ సీఎంగా వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు.
(కేజ్రీవాల్‌ ప్రమాణ స్వీకారోత్సవానికి అవ్యాన్‌ తోమర్‌ అనే బాలుడు ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరయ్యాడు. కేజ్రీవాల్‌ మాదిరిగానే టోపీ, స్వెటర్‌, మఫ్లర్‌, కళ్లజోడు ధరించిన ఈ బాలుడు దిల్లీలోని ఆప్‌ కార్యాలయం దగ్గర ఫలితాల వెల్లడి రోజు అందరి దృష్టి ఆకర్షించాడు)
1) ఎ, బి మాత్రమే 2) ఎ, సి మాత్రమే
3) ఎ, బి, సి మాత్రమే 4) పైవన్నీ

2. ఐటీ దిగ్గజం ‘ఇన్ఫోసిస్‌’ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి అల్లుడు, బ్రిటన్‌ ఎంపీ రిషి సునక్‌ను 2020 ఫిబ్రవరి 13న బ్రిటన్‌ ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌ ఏ శాఖ మంత్రిగా నియమించారు? (భారత సంతతికి చెందిన అలోక్‌శర్మను వాణిజ్య, ఇంధన, పారిశ్రామిక శాఖల మంత్రిగా, సుయెల్లా బ్రేవర్‌మన్‌ను అటార్నీ జనరల్‌గా ప్రధాని తాజాగా నియమించారు. ఇప్పటికే హోంమంత్రిగా భారత సంతతికి చెందిన ప్రీతి పటేల్‌ కొనసాగుతున్నారు.)
1) ఆర్థిక మంత్రి 2) పర్యావరణ మంత్రి
3) రైల్వే మంత్రి 4) విదేశాంగ మంత్రి

3. కిందివాటిలో ఏ సంస్థకు దివంగత కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్‌ పేరు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది? (ఫిబ్రవరి 14న దివంగత నేత సుష్మాస్వరాజ్‌ జయంతి నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.)
ఎ) ప్రవాసీ భారతీయ కేంద్రం బి) ఫారిన్‌ సర్వీస్‌ ఇన్‌స్టిట్యూట్‌
సి) భారత ఒలింపిక్‌ సంఘం డి) భారత పెట్రోలియం సంస్థ
1) ఎ మాత్రమే 2) ఎ, బి మాత్రమే
3) ఎ, బి, సి మాత్రమే 4) పైవన్నీ

4. ప్రముఖ పర్యావరణవేత్త, ది ఎనర్జీ అండ్‌ రిసోర్సెస్‌ ఇన్‌స్టిట్యూట్‌ (టెరి) మాజీ అధినేత ఆర్‌.కె. పచౌరి 2020 ఫిబ్రవరి 13న ఎక్కడ మరణించారు?
(2001లో పద్మభూషణ్‌, 2008లో పద్మ విభూషణ్‌ పురస్కారాలను ఈయన గెలుచుకున్నారు. వాతావరణ మార్పులకు సంబంధించి ఏర్పాటైన ఐరాస ఇంటర్‌- గవర్నమెంటల్‌ ప్యానెల్‌- ఐపీసీసీ అధ్యక్షుడిగా పచౌరీ 2007లో అమెరికా అప్పటి ఉపాధ్యక్షుడు అల్‌గోర్‌తో కలిసి నోబెల్‌ శాంతి బహుమతి గెలుచుకున్నారు. టెరి వ్యవస్థాపక సంచాలకుడిగా పనిచేస్తున్న సమయంలో సహచర ఉద్యోగినిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో 2015లో తన పదవికి రాజీనామా చేశారు).
1) కాన్పూర్‌ 2) గువాహటి
3) దిల్లీ 4) అహ్మదాబాద్‌

- సీహెచ్‌. కృష్ణప్రసాద్‌
ఇతర వర్తమాన అంశాలను
www.eenadupratibha.net లో చూడండి.
జవాబులు: 1-4, 2-1, 3-2, 4-3


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని