ఆర్కిటెక్చర్‌కి ఉన్న అవకాశాలేమిటి?

ఆర్కిటెక్చర్‌ చదవాలనుంది. అందిస్తున్న ప్రముఖ కళాశాలలు, వాటి ప్రవేశమార్గాలను తెలియజేయండి....

Published : 26 Feb 2020 00:26 IST

ఆర్కిటెక్చర్‌ చదవాలనుంది. అందిస్తున్న ప్రముఖ కళాశాలలు, వాటి ప్రవేశమార్గాలను తెలియజేయండి. పూర్తిచేసినవారికి ఏ ఉద్యోగావకాశాలుంటాయి?
- ఆర్‌. మహేష్‌

ఆర్కిటెక్చర్‌కు ఇప్పుడు ఇంజినీరింగ్‌కి సమానమైన ఆదరణ ఉందని చెప్పవచ్ఛు మన తెలుగు రాష్ట్రాల్లో జె.ఎన్‌.ఎఫ్‌.ఎ.యు, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ లాంటి రాష్ట్ర వర్సిటీలతో పాటుగా స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌ వంటి కేంద్రస్థాయి విద్యాసంస్థలు ఆర్కిటెక్చర్‌ కోర్సులను నిర్వహిస్తున్నాయి. వీటన్నిటికీ దేశవ్యాప్తంగా జరిగే నేషనల్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఆర్కిటెక్చర్‌ (నాటా) ప్రవేశపరీక్షను ప్రామాణికంగా తీసుకుంటారు. ఆర్కిటెక్చర్‌ 5 సంవత్సరాల కోర్సు. ఆర్కిటెక్చర్‌ పూర్తి చేసిన విద్యార్థులు ఆర్కిటెక్ట్లు, ఇంటీరియర్‌ డిజైనర్‌, సిటీ ప్లానర్‌ లాంటి ఉద్యోగాల్లో స్థిరపడవచ్ఛు నాటా ప్రవేశ పరీక్షకు ప్రకటన వెలువడింది. వివరాలకు క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని