సాఫ్ట్‌వేర్‌ కోర్సులు ఏవి చేస్తే మేలు?

బీఎస్సీ (కెమిస్ట్రీ) చదివాను. నాకు సాఫ్ట్‌వేర్‌ రంగంపై ఆసక్తి. కొంత కంప్యూటర్‌ పరిజ్ఞానమూ ఉంది. ఈ రంగంలో ప్రవేశించడానికి ఏ కోర్సులు చేస్తే మేలు?

Published : 16 Mar 2020 00:22 IST

బీఎస్సీ (కెమిస్ట్రీ) చదివాను. నాకు సాఫ్ట్‌వేర్‌ రంగంపై ఆసక్తి. కొంత కంప్యూటర్‌ పరిజ్ఞానమూ ఉంది. ఈ రంగంలో ప్రవేశించడానికి ఏ కోర్సులు చేస్తే మేలు?

- సతీష్‌

*చాలాకాలంగా సాఫ్ట్‌వేర్‌ రంగం మనదేశంలోని అధిక విద్యార్థుల ఎంపికల్లో ప్రథమ స్థానంలో ఉంటూ వస్తోంది. ఆకర్షణీయమైన వేతనాలూ, కెరియర్లో వేగవంతమైన ఎదుగుదల వల్ల ఇది ఏ రంగంలో చదివిన విద్యార్థులనైనా ఆకర్షిస్తోంది. మీ విషయానికి వస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ రంగంలో చదివినవారైనా సాఫ్ట్‌వేర్‌ రంగంలో ప్రవేశించడానికి సులువైన దారులున్నాయి. కంప్యూటర్స్‌పై ప్రాథమిక పరిజ్ఞానం ఉందంటున్నారు కాబట్టి, ఏదైనా ఒక కోడింగ్‌ లాంగ్వేజ్‌ నేర్చుకుంటే మీరు సాఫ్ట్‌వేర్‌ వైపుగా  వెళ్ళగలుగుతారు. ఇప్పుడు మన జాబ్‌ మార్కెట్లో డేటా సైన్స్‌కు మంచి డిమాండ్‌ ఉంది. డేటా సైన్స్‌ మీదనో, డేటా అనలిటిక్స్‌ మీదనో ప్రాథమిక అవగాహన ఉన్న ఎవరికైనా సరే, కంపెనీలు ఉద్యోగావకాశాలు అందిస్తున్నాయి. డేటా అనలిటిక్స్‌వైపు కెరియర్‌  మొదలు పెట్టాలనుకునేవారు ముందుగా ళి లాంగ్వేజ్‌పై గానీ, పైతాన్‌ లాంటి ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌పై గానీ పట్టు సాధించడం తప్పనిసరి.
- ప్రొ. బి.రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌

 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని