యూకేలో ఉన్న ఫార్మసీ కోర్సులు?

ఎం.ఫార్మసీ 2016లో పూర్తిచేశాను. రెండేళ్ల పని అనుభవం ఉంది. యూకేలో ఎంఎస్‌ చేయాలను కుంటున్నాను. అక్కడ ఫార్మసీ రంగంలో అందుబాటులో ఉన్న కోర్సులు, అందిస్తున్న ప్రముఖ విద్యాసంస్థల వివరాలను తెలియజేయండి.

Published : 17 Mar 2020 01:53 IST

* ఎం.ఫార్మసీ 2016లో పూర్తిచేశాను. రెండేళ్ల పని అనుభవం ఉంది. యూకేలో ఎంఎస్‌ చేయాలను కుంటున్నాను. అక్కడ ఫార్మసీ రంగంలో అందుబాటులో ఉన్న కోర్సులు, అందిస్తున్న ప్రముఖ విద్యాసంస్థల వివరాలను తెలియజేయండి.

- వి. జయంతి

- వి. జయంతి

* మీ రెండేళ్ల  ఉద్యోగ అనుభవం యూకే  వెళ్లడానికి సాయపడుతుంది. అక్కడ ఫార్మసీలో ఎమ్మెస్సీ ఫార్మాస్యూటికల్‌ టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్‌ సైన్సెస్‌, జనరల్‌ ఫార్మసీ ప్రాక్టీసెస్‌ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. క్యూఎస్‌ లేదా టైమ్స్‌ ర్యాంకింగ్స్‌ ఆధారంగా మంచి యూనివర్సిటీని ఎంపిక చేసుకోవచ్చు. యూనివర్సిటీలను ఎంచుకున్న తర్వాత పూర్వ విద్యార్థులతో మాట్లాడితే తగిన నిర్ణయం తీసుకోడానికి వీలవుతుంది. కొన్ని సంవత్సరాలుగా మన దేశంలో ఇంజనీరింగ్‌తోపాటు ఫార్మసీ రంగానికి సంబంధించిన విజ్ఞానవంతమైన మానవవనరులు అభివృద్ధి చెందుతున్నాయి. ఫార్మసీ రంగానికి డిమాండ్‌ పెరుగుతూనే ఉంది. ఫార్మసీ డిగ్రీ ఉన్నవాళ్లకి ఇండస్ట్రీలో క్లినికల్‌ రిసెర్చ్‌ అసోసియేట్‌,  ఫార్మకాలజిస్ట్‌ , మెడికల్‌ సేల్స్‌ రిప్రజెంటేటివ్‌, ప్రాసెస్‌ డెవలప్‌మెంట్‌ సైంటిస్ట్‌ వంటి ఉద్యోగాలు ఉంటాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని