బీజెడ్‌సీ అభ్యర్థులకు అవకాశాలేమిటి?

బీఎస్సీ (బీజెడ్‌సీ) పూర్తి చేశాను. ఎంఎస్సీ చేయాలనుంది. ఏది ఎంచుకుంటే మెరుగైన అవకాశాలుంటాయి?....

Published : 02 Apr 2020 01:13 IST

* బీఎస్సీ (బీజెడ్‌సీ) పూర్తి చేశాను. ఎంఎస్సీ చేయాలనుంది. ఏది ఎంచుకుంటే మెరుగైన అవకాశాలుంటాయి? అందించే సంస్థలేవి?

- టి. దిలీప్‌

* బీఎస్సీ విద్యార్థులకు మంచి అవకాశాలు ఉన్నాయి. కెమిస్ట్రీ, బయాలజీలతో డిగ్రీ పూర్తి చేసిన వారికి ఫార్మసీ, వ్యవసాయం, బయో కెమిస్ట్రీ తదితర రంగాల్లో ఉద్యోగాలు లభిస్తాయి. ఉన్నత విద్యను అభ్యసించాలనుకుంటే బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీల్లో ఏదో ఒక విభాగం నుంచి ఎమ్మెస్సీ చేయవచ్చు. అవే కాకుండా బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, పబ్లిక్‌ హెల్త్‌, ఆంత్రపాలజీ, మెడికల్‌ టెక్నాలజీ, హెల్త్‌కేర్‌ అండ్‌ హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌, హెల్త్‌ సైకాలజీ వంటి కోర్సులూ ఉన్నాయి. అభ్యర్థుల అభిరుచుల మేరకు తగిన కోర్సును ఎంచుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లోని పలు విశ్వవిద్యాలయాల్లో అవి అందుబాటులో ఉన్నాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని