టూరిజం కోర్సులు చేశాక..?

పర్యాటక స్థలాలపై ఆసక్తి, ఆకర్షణీయమైన వేతనాలు అందుకోవాలనుకునే వారికి పర్యటక రంగంలో...

Published : 06 Apr 2020 00:09 IST

టూరిజంపై ఆసక్తి ఉంది. ప్రభుత్వ రంగంలో సంబంధిత కొలువుల్లో చేరే మార్గాలేంటి? అర్హతలనూ తెలియజేయండి.

- వై. దీప్తి

ర్యాటక స్థలాలపై ఆసక్తి, ఆకర్షణీయమైన వేతనాలు అందుకోవాలనుకునే వారికి పర్యటక రంగంలో ఉద్యోగావకాశాలు ఉన్నాయి. సాధారణంగా టూరిజం చదివినవారికి ప్రైవేటురంగ సంస్థల్లో ఉపాధి ఎక్కువగా లభిస్తుంది. మనదేశంలో ప చాలా ప్రయివేటురంగ సంస్థలతో పాటు కొన్ని ప్రభుత్వరంగ సంస్థలు కూడా ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి. బామర్‌ అండ్‌ లారీ, ఐ.ఆర్‌.సి.టి.సి., ఇండియన్‌ టూరిజం అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌, మినిస్ట్రీ ఆఫ్‌ టూరిజం పరిధిలో ఉన్న అశోక టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌, అశోక గ్రూప్‌ ఆఫ్‌ హోటల్స్‌ లాంటి సంస్థల్లో వివిధ హోదాల్లో కొలువులకు అవకాశం ఉంటోంది.

ఈ సంస్థల్లో ఉద్యోగాలు పొందడానికి సంబంధిత పోస్టుకు సంబంధించిన రంగంలో గ్రాడ్యుయేషన్‌ లేదా పోస్టు గ్రాడ్యుయేషన్‌ తప్పనిసరి. దానితో పాటుగా బీబీఏ టూరిజం లేదా ఎంబీఏ టూరిజం చదివినవారికి ప్రాధాన్యం ఉంటుంది. ఇవే కాకుండా ఇండియన్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కౌన్సిల్‌, ఇండియన్‌ కలినరీ ఇన్‌స్ట్టిట్యూట్‌ లాంటి ప్రభుత్వ సంస్థల్లో కూడా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అయితే వీటికి బీఎస్సీ, బీబీఏ లేదా పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ చేసి ఉండాలి. ఇవే కాకుండా మనదేశంలో ప్రతి రాష్ట్రానికీ స్టేట్‌ టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌లు ఉన్నాయి, ఈ సంస్థల్లో డిప్లొమా ఇన్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ చేసినవారికి ఉద్యోగ నియామకాల్లో ప్రాధాన్యం ఇస్తారు.

- ప్రొఫెసర్‌ బి. రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని