పవర్‌ ఎలక్ట్రానిక్స్‌ చేశాక...

మన దేశంలో విద్యుత్‌ తయారీ, సరఫరా, పరికరాల తయారీకి సంబంధించిన కంపెనీలు ప్రభుత్వ రంగంతో పాటు ప్రయివేటు రంగంలోనూ ఉన్నాయి. ఎంటెక్‌ పవర్‌ ఎలక్ట్ట్రానిక్స్‌ చదివినవారికి పై రెండు రంగాల్లో ఉద్యోగావకాశాలు ఉంటాయి.

Published : 13 Apr 2020 00:31 IST

ఎంటెక్‌ (పవర్‌ ఎలక్ట్ట్రానిక్స్‌) 2014లో పూర్తిచేశాను. నాకున్న ఉద్యోగావకాశాలేంటి? - రాణి

న దేశంలో విద్యుత్‌ తయారీ, సరఫరా, పరికరాల తయారీకి సంబంధించిన కంపెనీలు ప్రభుత్వ రంగంతో పాటు ప్రయివేటు రంగంలోనూ ఉన్నాయి. ఎంటెక్‌ పవర్‌ ఎలక్ట్ట్రానిక్స్‌ చదివినవారికి పై రెండు రంగాల్లో ఉద్యోగావకాశాలు ఉంటాయి. జూనియర్‌ ఇంజినీర్‌, అసిస్ట్తెంట్‌ ఇంజినీర్‌, మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ, ఇంజినీర్‌ ట్రెయినీ లాంటి ఉద్యోగాలకు మీరు అర్హులు. భారీ యంత్రాలతో కూడిన పరిశ్రమలతో పాటు, నూతన సాంకేతికత, ఆటోమేషన్‌, కంట్రోల్‌ అవసరమైన అన్ని రంగాల్లో ఎంటెక్‌ పవర్‌ ఎలక్ట్ట్రానిక్స్‌ చదివినవారికి చాలా ఉద్యోగాలున్నాయి.

మీకు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగం చేయాలనుకుంటే- ఉద్యోగ నియామక నోటిఫికేషన్‌ కోసం వేచి ఉంటూ ఈ లోపల ఆ పరీక్షలకు సన్నద్ధం అవ్వండి. కొన్ని ప్రభుత్వరంగ సంస్థలు గేట్‌ స్కోరును బట్టి ఇంటర్వ్యూ నియామకాలు చేపడుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వరంగ సంస్థలైన బీహెచ్‌ఈఎల్‌, బీఈఎల్‌, ఈసీఐఎల్‌, బీఈఎంఎల్‌, రైల్వే, పవర్‌ గ్రిడ్‌ కార్పోరేషన్‌లలో ఉద్యోగాలకు ప్రయత్నించవచ్ఛు ఇక ప్రైవేటు రంగాల్లో ప్రముఖ సంస్థలైన ఎల్‌ అండ్‌ టీ, ఏబీబీ, రిలయన్స్‌, టాటా పవర్‌, జిందాల్‌ పవర్‌, అదానీ పవర్‌, సుజ్లాన్‌ ఎనర్జీల్లో మీకు మంచి ఉద్యోగ అవకాశాలుంటాయి.

- ప్రొఫెసర్‌ బి. రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు