జెనెటిక్‌ ఇంజినీరింగ్‌లో ఎంటెక్‌ చేయాలా? ఎంఎస్సీనా?

బీటెక్‌ (జెనెటిక్‌ ఇంజినీరింగ్‌) 2018లో పూర్తిచేశాను. పీజీ చేయాలనుకుంటున్నాను. ఎంటెక్‌ చేయాలా? ఎంఎస్సీలాంటి అవకాశాలేమైనా ఉన్నాయా?

Published : 22 Apr 2020 00:27 IST

* బీటెక్‌ (జెనెటిక్‌ ఇంజినీరింగ్‌) 2018లో పూర్తిచేశాను. పీజీ చేయాలనుకుంటున్నాను. ఎంటెక్‌ చేయాలా? ఎంఎస్సీలాంటి అవకాశాలేమైనా ఉన్నాయా?

- నిఖిత

* ఈ మధ్యకాలంలో జెనెటిక్‌ ఇంజినీరింగ్‌ కోర్సుపై చాలామందికి ఆసక్తి పెరుగుతోంది. జెనెటిక్‌ ఇంజినీరింగ్‌ సిద్ధాంతాలను వ్యవసాయం, వైరాలజీ, మైక్రో బయాలజీ, బయో కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, వైద్యం, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, పరిశోధనా రంగాల్లో శాస్త్రవేత్తలు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. సాధారణంగా బీఎస్సీ చదివిన తర్వాత ఎమ్మెస్సీ; బీటెక్‌ చదివాక ఎంటెక్‌ లేదా ఎంఎస్సీ చదివే అవకాశం ఉంటుంది. కొంతమంది ఎమ్మెస్సీ అనంతరం ఎంటెక్‌ చదువుతారు. ఎంటెక్‌ (జెనెటిక్‌ ఇంజినీరింగ్‌), ఎంఎస్సీ (జెనెటిక్‌ ఇంజినీరింగ్‌) కోర్సుల్లో 70 నుంచి 80 శాతం సిలబస్‌ ఒకటే. ఉద్యోగావకాశాలూ దాదాపు ఒకే విధంగా ఉంటాయి. ఏ కోర్సునైనా ఎంచుకొనే ముందే భవిష్యత్తులో ఏ రంగంలో, ఏ విధంగా స్థిరపడాలనుకుంటున్నారు అనేదానిపై స్పష్టత ఏర్పరచుకోవాలి. ఇంజినీరింగ్‌ రంగంలో స్థిరపడటానికి ఎంటెక్‌ కోర్సు ఉపయోగకరం. బోధన, పరిశోధనా రంగంలో ప్రవేశించడానికి ఎంఎస్సీ కోర్సుని ఎంచుకోవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని