ఫార్మసీ తర్వాత ఫుడ్‌ టెక్నాలజీ చేయవచ్చా?

బీఫార్మసీ చదువుతున్నాను. ఫుడ్‌ టెక్నాలజీ కోర్సులు చేయడానికి అర్హుడినేనా?

Published : 28 Apr 2020 00:46 IST

బీఫార్మసీ చదువుతున్నాను. ఫుడ్‌ టెక్నాలజీ కోర్సులు చేయడానికి అర్హుడినేనా?

- రాకేష్‌ సాయి

* ఇప్పుడు పెరుగుతున్న జనాభా, మారుతున్న జీవన విధానం, అలవాట్ల వల్ల ప్యాకేజ్డ్‌ ఫుడ్‌కు ఆదరణ పెరుగుతోంది. దీంతో ఫుడ్‌ టెక్నాలజీ ఒక కోర్సుగా, ఉపాధి అవకాశంగా ప్రాధాన్యం సంతరిచుకుంటోంది. ఫుడ్‌ సైన్స్‌/టెక్నాలజీలో పీజీ చదవాలంటే ఫుడ్‌ సైన్స్‌, డెయిరీ, హోమ్‌ సైన్స్‌, అగ్రికల్చర్‌ బయాలజీలకు సంబంధించిన డిగ్రీ చదివి ఉండాలి. కానీ ఈ జాబితాలో మీరు చదువుతున్న బీఫార్మసీ కోర్సు లేదు. ఫుడ్‌ టెక్నాలజీ కోర్సు కచ్చితంగా చదవాలనుకుంటే మీకున్న ఏకైక మార్గం ఫుడ్‌  సైన్స్‌/టెక్నాలజీలో డిగ్రీ చేయడమే. డిగ్రీ స్థాయిలో బీఎస్‌సీ ఫుడ్‌ టెక్నాలజీ, బీటెక్‌ ఫుడ్‌ టెక్నాలజీ లాంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. బీటెక్‌ ఫుడ్‌ టెక్నాలజీ చదవాలంటే ఇంటర్మీడియట్‌ను మ్యాథమేటిక్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ సబ్జెక్టులతో 55% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. బీఎస్సీ ఫుడ్‌ టెక్నాలజీ/సైన్స్‌ చదవాలంటే ఇంటర్మీడియట్‌లో మ్యాథమేటిక్స్‌ లేదా బయాలజీ, ఫిజిక్స్‌, కెమిస్ట్రీలతో 55% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. ప్రస్తుతం బీఫార్మసీ చదువుతున్నారు కాబట్టి, బీఎస్సీ ఫుడ్‌ టెక్నాలజీ కోర్సుకు ఇంటర్మీడియట్‌తో అర్హులవుతారు.

- ప్రొ. బి. రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని