ఖగోళశాస్త్రంలో దూరవిద్య కోర్సులు ఉన్నాయా?

పోలీస్‌ కానిస్టేబుల్‌గా ఇటీవలే ఎంపికయ్యాను. కానీ నాకు ఆస్ట్రానమీపై ఆసక్తి. అందులో డిగ్రీ, పీజీల్లో దూరవిద్య ద్వారా పూర్తిచేయగలిగిన కోర్సులేమైనా ఉన్నాయా? అందించే సంస్థలేవి? వాటిలోకి ఎలా ప్రవేశించవచ్చో తెలియజేయండి.

Published : 06 May 2020 00:42 IST

పోలీస్‌ కానిస్టేబుల్‌గా ఇటీవలే ఎంపికయ్యాను. కానీ నాకు ఆస్ట్రానమీపై ఆసక్తి. అందులో డిగ్రీ, పీజీల్లో దూరవిద్య ద్వారా పూర్తిచేయగలిగిన కోర్సులేమైనా ఉన్నాయా? అందించే సంస్థలేవి? వాటిలోకి ఎలా ప్రవేశించవచ్చో తెలియజేయండి. - కె. బాలకృష్ణ

బాధ్యతాయుతమైన ఉద్యోగానికి ఎంపికైనా ఇంకా చదువు కొనసాగించాలనే మీ ఆసక్తి అభినందనీయం. ఖగోళశాస్త్రం (ఆస్ట్రానమీ)లో రెండు రకాల విభాగాలున్నాయి. ఆప్టికల్‌ ఆస్ట్రానమీ లేదా సెలెస్టియల్‌ ఆస్ట్రానమీ; నాన్‌ ఆప్టికల్‌ ఆస్ట్రానమీ. ఆప్టికల్‌ ఆస్ట్రానమీ మన భూమి నుంచి వివిధ గ్రహాలూ నక్షత్రాల గురించి అధ్యయనం చేస్తుంది. నాన్‌ ఆప్టికల్‌ ఆస్ట్రానమీలో వివిధ వస్తువులను రేడియో సిగ్నల్స్‌తో అధ్యయనం చేస్తారు.

విషయ పరిజ్ఞానంతో పాటు చాలావరకూ ప్రాక్టికల్‌ అప్లికేషన్‌తో ఉండడంవల్ల ఈ కోర్సును సాధారణంగా ఏ విశ్వవిద్యాలయమూ దూరవిద్య ద్వారా ప్రస్తుతం అందించటం లేదు. ఖగోళశాస్త్రంపై అవగాహన పెంచుకోవాలనుకుంటే యుడెమి, కోర్సెరా, ఎడ్‌ఎక్స్‌ లాంటి ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌ పోర్టళ్లలో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వాటి ద్వారా మీరు సంబంధిత విషయ పరిజ్ఞానాన్ని పెంచుకోవచ్ఛు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని