కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు పెంచుకోవాలంటే?

అడ్మిన్‌ ఎగ్జిక్యూటివ్‌గా చేస్తున్నాను. కమ్యూనికేషన్‌ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలనుకుంటున్నాను. వాటిని అందించే ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ శిక్షణ సంస్థలు ఏవి?

Published : 07 May 2020 00:21 IST

* అడ్మిన్‌ ఎగ్జిక్యూటివ్‌గా చేస్తున్నాను. కమ్యూనికేషన్‌ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలనుకుంటున్నాను. వాటిని అందించే ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ శిక్షణ సంస్థలు ఏవి? - స్రవంతి

● ఏ రంగానికి సంబంధించినా, ఏ సంస్థలో పనిచేస్తున్నా భావప్రసారణ నైపుణ్యాలు (కమ్యూనికేషన్‌ స్కిల్స్‌) చాలా ముఖ్యం. ఆ స్కిల్స్‌, ఆంగ్ల భాషా ప్రావీణ్యం రెండూ ఒకటి కాదు. రెండింటికీ తేడా ఉంది. చాలామందికి ఆంగ్లంపై పట్టు ఉన్నప్పటికీ వారు చెప్పాలనుకున్నది సరిగ్గా చెప్పలేక పోవచ్ఛు ఇది ఆత్మవిశ్వాసం లేకపోవడం వల్లనో, చెప్పాలనుకున్నది సరిగ్గా వ్యక్త పరచలేకపోవడం వల్లనో జరుగుతూ ఉంటుంది. ఇలాంటి ఇబ్బందులు అధిగమించడానికి కమ్యూనికేషన్‌ స్కిల్స్‌లో శిక్షణ తీసుకోవడం మంచిది. ఈ శిక్షణ పొందేందుకు పలు ప్రైవేట్‌ కోచింగ్‌ సంస్థలున్నాయి. చాలా వెబ్‌సైట్లు, లర్నింగ్‌ ప్లాట్‌ఫామ్‌లు ఎన్నో కోర్సులను ఉచితంగా అందిస్తున్నాయి. ముఖ్యంగా alison.com, udemy.com ల్లో మంచి కోర్సులు ఉన్నాయి. హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం కమ్యూనికేటివ్‌ ఇంగ్లిష్‌లో ఒక సంవత్సరం కాల వ్యవధి ఉన్న పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా కోర్సును అందిస్తోంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని