ఇంజినీరింగ్‌ కాకుండా ఇంకేం చేయవచ్చు?

డిప్లొమా (ఈఈఈ) పూర్తిచేశాను. బీటెక్‌ కాకుండా ఉన్నతవిద్యకు వేరే అవకాశాలు ఏమున్నాయి?...

Published : 12 May 2020 00:04 IST

డిప్లొమా (ఈఈఈ) పూర్తిచేశాను. బీటెక్‌ కాకుండా ఉన్నతవిద్యకు వేరే అవకాశాలు ఏమున్నాయి?

- ఎం. సుధాన్య

లక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌లో డిప్లొమా చేసిన విద్యార్థులకు ఎలక్ట్రానిక్స్‌కు సంబంధించిన చాలా రంగాల్లో స్థిరపడే అవకాశం ఉంది. సాధారణంగా పాలిటెక్నిక్‌ పూర్తిచేసినవారు మూడు సంవత్సరాల ఇంజనీరింగ్‌ను ఎంచుకొని ఉన్నత విద్య కొనసాగిస్తారు. కానీ మీరు ఇంజనీరింగ్‌ కాకుండా ఇతర ఉన్నత విద్యావకాశాల గురించి అడిగారు కాబట్టి మీరు సంప్రదాయ డిగ్రీలు బీఏ, బీకామ్‌, బీఎస్సీ లేదా ప్రత్యేక డిగ్రీలైన బీబీఏ, హోటల్‌ మేనేజ్‌మెంట్‌, టూరిజం మేనేజ్‌మెంట్‌, రిటైల్‌ మేనేజ్‌మెంట్‌, బిజినెస్‌ అనెలిటిక్స్‌, డేటా సైన్సెస్‌, ఫ్యాషన్‌ టెక్నాలజీ లాంటి కోర్సులు చేయవచ్ఛు తర్వాత పీజీ, పీహెచ్‌డీ చదవవచ్ఛు డిప్లొమా అర్హతతో ఏదైనా ఉద్యోగం చేస్తూ దూరవిద్య ద్వారానూ డిగ్రీ చేసుకోవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని