ఫార్మసీలో ఏ స్పెషలైజేషన్‌ మేలు?

బీఫార్మసీ తుది సంవత్సరం చదువుతున్నాను. భవిష్యత్తులో ఎంఫార్మసీ చేద్దామనుకుంటున్నా.

Published : 14 May 2020 00:23 IST

* బీఫార్మసీ తుది సంవత్సరం చదువుతున్నాను. భవిష్యత్తులో ఎంఫార్మసీ చేద్దామనుకుంటున్నా. ఏ స్పెషలైజేషన్‌ చేస్తే మేలు? ఉద్యోగావకాశాలు ఎలా ఉంటాయి?

- కృష్ణ, విజయవాడ

● మనదేశంలో మెడిసిన్‌ కోర్సు తర్వాత సైన్స్‌ విద్యార్థులకు బీఫార్మసీ ప్రత్యామ్నాయ కోర్సుగా నిలుస్తోంది. స్థిరమైన కెరియర్‌, మెరుగైన ఉద్యోగావకాశాలతో పాటు జాబ్‌ మార్కెట్లో మంచి డిమాండ్‌ ఉండటం దీనికి కారణాలు. బీఫార్మసీ తర్వాత ఎంఫార్మసీ చేసిన విద్యార్థులకు మరింత ఉన్నతమైన అవకాశాలు అందుబాటులో ఉంటాయి. ఎంఫార్మసీలో ఫార్మకాలజీ, మెడికల్‌ కెమిస్ట్రీ, ఫార్మాస్యూటిక్స్‌, ఫార్మాకాగ్నసి, ఫార్మకోవిజిలెన్స్‌, బయోటెక్నాలజీ/మైక్రో బయాలజీ, హాస్పిటల్‌ ఫార్మసీ లాంటి స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఏ స్పెషలైజేషన్‌ అయినా సరే మన ఆసక్తి, ఆ సబ్జెక్టుపై ఉన్న నైపుణ్యాలను బట్టి ఉద్యోగావకాశాలు ఆధారపడి ఉంటాయి. వైద్యరంగానికి సంబంధించి ఎన్నో పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఏ స్పెషలైజేషన్లో అయినా మంచి ఉద్యోగ అవకాశాలే ఉంటాయి.

ఫార్మకాలజీలో మిగతా స్పెషలైజేషన్లతో పోలిస్తే అధిక వేతనం లభించే అవకాశముంది. ఇందులో కన్సల్టెన్సీ, పరిశోధనాపరంగా మంచి ఎదుగుదల ఉంటుంది. మీకు ఎనాలిసిస్‌ పరమైన విషయాలపై ఆసక్తి ఉన్నట్లయితే మెడికల్‌ కెమిస్ట్రీ స్పెషలైజేషన్‌ తీసుకోవచ్ఛు క్వాలిటీ కంట్రోల్‌ విభాగాల్లో, ఫార్మసీ కాలేజీల్లో ఈ స్పెషలైజేషన్‌ అవసరం చాలా ఉంది. మెడికల్‌ ప్రొడక్ట్స్‌లో ప్రొడక్షన్‌కు సంబంధిత అంశాలు అభిరుచి ఉంటే ఫార్మస్యూటిక్స్‌ చక్కని ఎంపిక. ఆరంభ దశలో వేతనాలు తక్కువగా ఉన్నప్పటికీ పెద్ద కంపెనీల్లో పనిచేసే అవకాశం దొరుకుతుంది. నేచురల్‌ ప్రొడక్ట్స్‌పై ఆసక్తి ఉండి సంబంధిత కంపెనీల్లో స్థిరపడాలంటే ఫార్మాకాగ్నసి ఎంచుకోవచ్ఛు రిటైల్‌ ఫార్మసీకి సంబంధించిన కంపెనీల్లో పనిచేయాలనుకున్నవారికి హాస్పిటల్‌ ఫార్మసీ స్పెషలైజేషన్‌ మెరుగైన ఎంపిక.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు