ఐకార్‌ కల ఫలించాలంటే...

ఐసీఏఆర్‌ (ఐకార్‌)లో ఉద్యోగం చేయాలన్నది నా కల. కానీ ఎంసెట్‌లో తగినంత ర్యాంకు రాలేదు. డిగ్రీలో అగ్రి బయోటెక్నాలజీ, ...

Published : 18 May 2020 00:35 IST

ఐసీఏఆర్‌ (ఐకార్‌)లో ఉద్యోగం చేయాలన్నది నా కల. కానీ ఎంసెట్‌లో తగినంత ర్యాంకు రాలేదు. డిగ్రీలో అగ్రి బయోటెక్నాలజీ, బీఎస్సీ బయోటెక్నాలజీ చేయడం ద్వారా ఐసీఏఆర్‌లో ఉద్యోగం పొందే వీలుందా?
- కావ్య

ఐ.సి.ఎ.ఆర్‌. (ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌) స్వయంప్రతిపత్తి కలిగిన వ్యవసాయ పరిశోధన సంస్థ. వ్యవసాయం, విత్తనాలకు సంబంధించిన పరిశోధనలను ఇది నిర్వహిస్తుంది. ఈ సంస్థలో ఉద్యోగాలు మొత్తం మూడు విభాగాలుగా ఉన్నాయి. సైంటిఫిక్‌ స్టాఫ్‌, టెక్నికల్‌ స్టాఫ్‌, అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌. సైంటిఫిక్‌ స్టాఫ్‌ను అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ సర్వీసెస్‌ ఎగ్జామ్‌ ద్వారా నియమిస్తారు. అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ సర్వీసెస్‌ పరీక్షను ప్రతి సంవత్సరం అగ్రికల్చర్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ద్వారా నిర్వహిస్తారు. పరీక్ష రాయడానికి అగ్రికల్చర్‌లో పీహెచ్‌డీ కనీస అర్హత. టెక్నికల్‌ స్టాఫ్‌ను టీ 3, టీ 6 స్థాయిలో నియమిస్తారు. టీ 3కి కనీస అర్హత అగ్రికల్చర్‌కి సంబంధించిన రంగాల్లో గ్రాడ్యుయేషన్‌. టీ 6కు కనీస అర్హత అగ్రికల్చర్‌ సంబంధిత రంగాల్లో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌. చివరిగా అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌. చాలావరకు వీరు కంపెనీకి సంబంధించిన అకౌంట్స్‌, ఆడిట్‌ ఉద్యోగాల్లో నియమితులవుతారు. ఈ పోస్టులకు బీ.కాంతో పాటుగా సీఏ లేదా సీఎంఏ లాంటి ప్రొఫెషనల్‌ డిగ్రీ ఉన్న వాళ్లను నియమించడం జరుగుతుంది.

ఎంసెట్లో తగిన ర్యాంకు రాలేదని మీరు నిరాశపడవలసిన అవసరంలేదు. డిగ్రీలో బయోటెక్నాలజీ, అగ్రికల్చరల్‌ బీఎస్‌సీ లేదా వ్యవసాయానికి సంబంధించిన ఏ డిగ్రీ కోర్సు చేసినా, టెక్నికల్‌ స్టాఫ్‌కు సంబంధించిన ఉద్యోగానికి ప్రయత్నం చేయవచ్ఛు మెరుగైన వేతనం సంపాధించడానికి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేసిన తరువాత టీ 6 స్థాయికి అర్హులు కావొచ్ఛు కోర్సులను ఉద్యోగం కోసం కాకుండా ఆసక్తితో, భావప్రకటనా సామర్థ్యం, విషయ పరిజ్ఞానం, మెలకువలు పెంచుకొంటూ శ్రద్ధగా చదవండి. ఈ విధంగా మీరు ఏ కోర్సు చదివినా మంచి ఉద్యోగావకాశాలు ఉంటాయి.

- ప్రొ. బి. రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని